E-Paper
Advertisement

కెఫే స్టైల్ కాపుచినో ఇంట్లోనే.. తక్కువ ధరలో బెస్ట్ హోమ్ కాఫీ మేకర్స్!

కెఫే స్టైల్ కాపుచినో ఇంట్లోనే.. తక్కువ ధరలో బెస్ట్ హోమ్ కాఫీ మేకర్స్!
Advertisement

Best coffee makers for home India: పొద్దున్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీ పడితే.. ఆ కిక్కే వేరు! రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేయడానికి చాలా మందికి కాఫీనే మెయిన్ . అయితే ప్రతి సారీ కేఫ్‌కి వెళ్లి తాగడం కుదరదు కదా? అందుకే ఇంట్లోనే.. మనకు నచ్చిన స్టైల్‌లో కెఫే లాంటి టేస్టీ కాఫీని తయారు చేసుకోవడానికి బెస్ట్ హోమ్ కాఫీ మేకర్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. మరి ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి అమెజాన్ వరకు విపరీతంగా ట్రెండ్ అవుతున్న, మీ బడ్జెట్‌కు సరిపోయే టాప్ 5 కాఫీ మెషీన్లు ఏంటో వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోనే పర్ఫెక్ట్ కాఫీ :

Advertisement

1. వండర్‌షెఫ్ ఫ్రెంచ్ ప్రెస్ (Wonderchef French Press)
మీకు తక్కువ ధరలో, కరెంట్ అవసరం లేకుండా థిక్ కాఫీ కావాలంటే ఫ్రెంచ్ ప్రెస్ బెస్ట్ ఛాయిస్. కేవలం రూ.1,000 లోపు బడ్జెట్లోనే దొరికే ఈ మేకర్‌లో కాఫీ పౌడర్ ,వేడి నీళ్లు పోసి 4 నిమిషాలు ఉంచి ప్రెస్ చేస్తే చాలు.. అద్భుతమైన బ్లాక్ కాఫీ రెడీ. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ.

2. అగారో రాయల్ డ్రిప్ కాఫీ మేకర్ (AGARO Royal Drip)
మనకు అత్యంత ఇష్టమైన డికాషన్ లేదా బ్లాక్ కాఫీని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి Drip Coffee Maker పర్ఫెక్ట్. రూ.1,800 బడ్జెట్‌లో వచ్చే ఈ అగారో మెషీన్ 600ml కెపాసిటీతో వస్తుంది. ఇందులో యాంటీ-డ్రిప్ ఫంక్షన్ , కాఫీని వేడిగా ఉంచే నాన్‌స్టిక్ వార్మింగ్ ప్లేట్ కూడా ఉన్నాయి.

Advertisement

3. 🇮🇹 అగారో క్లాసిక్ మోకా పాట్ (AGARO Classic Moka Pot)
స్టవ్‌టాప్ (గ్యాస్ స్టవ్)పై పెట్టుకుని స్ట్రాంగ్ కెఫే స్టైల్ ఎస్ప్రెస్సో డికాషన్ తయారు చేసుకోవడానికి మోకా పాట్ బాగా ట్రెండ్ అవుతోంది. అల్యూమినియం బాడీతో.. వచ్చే ఈ క్లాసిక్ మోకా పాట్ ధర సుమారు రూ.1,299. ఇది ఇచ్చే థిక్ డికాషన్‌లో పాలు, షుగర్ కలిపితే వచ్చే టేస్టే వేరు.

Also Read: మార్కెట్లోకి Lumio 55-ఇంచ్ క్రేజీ స్మార్ట్ టీవీలు..థియేటర్ లెవెల్ సౌండ్, ఫీచర్స్ చూస్తే షాకే!

4.డెలాంగీ డెడికా స్టైల్ (DeLonghi Dedica EC685)
మీరు కాఫీ లవర్ అయి ఉండి, ఇంట్లోనే లాతే, కాపుచినో, ఎస్ప్రెస్సోలు ప్రొఫెషనల్‌గా చేసుకోవాలనుకుంటే DeLonghi Dedica ఒక అల్టిమేట్ ఆప్షన్. 15-బార్ పవర్‌ఫుల్ ప్రెజర్‌తో వచ్చే.. ఈ మెషీన్‌లో పాలను నురగలా మార్చే మిల్క్ ఫ్రోథర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ.16,999.

5.వండర్‌షెఫ్ రెగాలియా సెమీ-ఆటోమేటిక్ (Regalia Espresso with Grinder)
ఇది బీన్-టు-కప్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే క్రేజీ మెషీన్. ఇందులో ఇన్-బిల్ట్ గ్రైండర్ ఉంటుంది. అంటే.. తాజా కాఫీ గింజలను అప్పటికప్పుడు గ్రైండ్ చేసి 20-బార్ ప్రెజర్‌తో ఫ్రెష్ కాఫీని ఇస్తుంది.దీని ధర దాదాపు రూ.21,999.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×