E-Paper
Advertisement

Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!

Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!
Advertisement

Best Window ACs: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఏసీల మీద ఆధారపడిపోతున్నారు. ఇంట్లో ఏసీ లేనివారి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో బడ్జెట్ లో లభిస్తున్న విండో ఏసీలు ఏవీ? వాటి ప్రధాన ఫీచర్లు, ధర వివరాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

LG 1.5 Ton 5 Star Window AC

మార్కెట్ లో మంచి గుడ్ విల్ కలిగిన కంపెనీల్లో ఎల్జీ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన 1.5 Ton 5 Star Window ACని.. LG ThinQ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా నియంత్రించవచ్చు. ఇందులో ‘క్లీన్ ఫిల్టర్’ ఇండికేటర్, స్మార్ట్ డయాగ్నసిస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. చాలా తక్కువ శబ్దంతో ఇది పనిచేయడం వల్ల రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్రపడుతుంది. అమెజాన్ లో ఈ ఏసీ రూ.41,870కి సేల్ అవుతోంది.

Panasonic 1.5 Ton 5 Star

Advertisement

టెక్నాలజీ పరంగా పానాసోనిక్ ఏసీలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. దీనిలోని ‘MirAIe’ ప్లాట్‌ఫారమ్ ద్వారా మీరు స్లీప్ ప్రొఫైల్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇది అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే PM 2.5 ఫిల్టర్ గాలిలోని ధూళి కణాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ‘Matter’ ప్రోటోకాల్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. పానాసోనిక్ వెబ్ సైట్ లో ఈ ఏసీ రూ.38,990కి అందుబాటులో ఉంది.

Blue Star 1.5 Ton 5 Star

అద్భుతమైన కూలింగ్ కు బ్లూ స్టార్ ఏసీలు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఈ కంపెనీకి 1.5 Ton విండో ఏసీ.. ‘స్మార్ట్ రెడీ’ ఫీచర్‌తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఏసీని యాప్ సాయంతో టెంపరేచర్ మార్చుకోవడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని కూడా ట్రాక్ చేయవచ్చు. దీనిలోని ‘క్లైమేట్ కంట్రోల్’ ఫీచర్ వాతావరణానికి అనుగుణంగా కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. తీరప్రాంతాల్లో ఉండేవారికి దీనిలోని యాంటీ-కొరోసివ్ బ్లూ ఫిన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అమెజాన్ లో ఈ ఏసీ రూ.34,979కి అందుబాటులో ఉంది.

Lloyd 1.5 Ton 5 Star

Advertisement

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి లాయిడ్ కంపెనీకి చెందిన ఈ విండో ఏసీ బెస్ట్ ఛాయిస్. ఇది ‘Havells Sync’ యాప్‌తో కనెక్ట్ అయ్యి, ఫోన్ ద్వారానే కంట్రోల్ చేసేందుకు అనుకులంగా ఉంటుంది. ఇందులోని 5-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్ ఉండటం వల్ల గదిలోని వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. 52°C ఎండలో కూడా ఇది వేగంగా గదిని కూలింగ్ చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఏసీ రూ.37,880 అందుబాటులో ఉంది.

Also Read: Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

Voltas 1.5 Ton 3/5 Star Window AC

విండో ఏసీల మార్కెట్ లో వోల్టాస్ కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంచింది. ఈ స్మార్ట్ విండో ఏసీలు.. వై-ఫై ద్వారా పనిచేస్తాయి. వీటిలో వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. వోల్టాస్ కు సర్వీస్ సెంటర్లు ఎక్కువగా ఉండటం వల్ల రిపేర్ వచ్చినా వెంటనే పరిష్కారం అవుతుంది. 3 స్టార్ ఏసీ ఫ్లిప్ కార్ట్ లో రూ. 26,890 ఉంటే.. 5 స్టార్ మోడల్ రూ. 32,990కు లభిస్తోంది.

Also Read: UBS OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×