E-Paper
Advertisement

Best Budget ACs: రూ.30వేల లోపు బెస్ట్ ఏసీ కావాలా? వోల్టాస్, హిటాచీ, లాయిడ్లలో ఏది బెస్టో తెలుసుకోండిలా!

Best Budget ACs: రూ.30వేల లోపు బెస్ట్ ఏసీ కావాలా? వోల్టాస్, హిటాచీ, లాయిడ్లలో ఏది బెస్టో తెలుసుకోండిలా!
Advertisement

Best Budget ACs: భగభగ మండిపోతున్న ఈ ఎండల వలన బయట అడుగుపెట్టాలంటేనే భయమేస్తోంది. మధ్యాహ్నం అయితే చాలు ఇల్లు నిప్పుల కొలిమిలా మారుతోంది. ఇలాంటి సమయంలో ఏసీ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, బడ్జెట్ చూసుకుంటేనే భయం వేస్తుంది. అయితే, మార్కెట్లో తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వోల్టాస్, హిటాచీ, లాయిడ్ వంటి కంపెనీలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా మంచి మోడల్స్ తీసుకొచ్చాయి.

నమ్మకమైన వోల్టాస్ ఏసీ:

ఎక్కువ మంది వోల్టాస్‌ను నమ్మకమైన బ్రాండ్‌గా భావిస్తారు. టాటా గ్రూప్‌కు చెందిన ఈ బ్రాండ్ ఏసీలు మధ్యతరగతి ప్రజలకు చక్కగా సరిపోతాయి. వీటిలో ఉన్న 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీలు ఎండ తీవ్రతను బట్టి కూలింగ్‌ను సర్దుబాటు చేసుకుంటాయి. దీంతో గది త్వరగా చల్లబడటమే కాకుండా.. కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ముఖ్యంగా టర్బో కూలింగ్ ఫీచర్ వల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే గది అంతా చల్లగా మారిపోతుంది. తక్కువ మెయింటెనెన్స్‌తో పనిచేసే ఈ ఏసీలు మార్కెట్లో సుమారు రూ.32,000 నుండి రూ.36,000 మధ్య లభిస్తున్నాయి.

Advertisement

Also Read: మస్కిటో బ్యాట్‌ను టీవీ దగ్గర పెడుతున్నారా? అయితే, మీరు కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే?

స్మార్ట్ ఫీచర్లలో తోపు లాయిడ్:

ఈ మధ్య కాలంలో లాయిడ్ ఏసీలకు డిమాండ్ బాగా పెరిగింది. హ్యావెల్స్ సంస్థకు చెందిన ఈ బ్రాండ్ తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 5-ఇన్-1 కన్వర్టబుల్ మోడల్స్ గురించి. మన అవసరానికి తగ్గట్టుగా ఏసీ కెపాసిటీని మార్చుకోవచ్చు. దీనివల్ల కరెంటు ఆదా అవుతుంది. అలాగే దీనిలో ఉన్న క్లీన్ ఎయిర్ ఫిల్టర్లు గాలిని శుభ్రం చేసి అందిస్తాయి. ఈ స్మార్ట్ లాయిడ్ ఏసీల ధరలు దాదాపు రూ.30,000 నుండి రూ.35,000 మధ్యలో ఉన్నాయి.

టెక్నాలజీకి మారుపేరు హిటాచీ:

Advertisement

జపాన్ టెక్నాలజీతో వచ్చే హిటాచీ ఏసీలు నాణ్యతలో రాజీ పడవు. వీటిలో వాడే కాపర్ కాయిల్స్ చాలా కాలం మన్నికగా ఉంటాయి. గది మూలమూలకూ చల్లదనం అందేలా వీటి డిజైన్ ఉంటుంది. హిటాచీ ఏసీలు సైలెంట్‌గా పనిచేస్తాయి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఎలాంటి సౌండ్ రాదు. వీటి ధర రూ.37,000 నుండి రూ.42,000 వరకు ఉంటుంది. లాంగ్ రన్‌లో చూసుకుంటే ఈ ఏసీలు ఇచ్చే పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.

Also Read: ఏం లుక్ మావా ఇది.. ఐఫోన్ 18 ప్రో బర్గండీ కలర్ లీక్, చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×