E-Paper
Advertisement

మధ్యతరగతి స్పెషల్.. బడ్జెట్ ధరలో బెస్ట్ డిష్ వాషర్లు.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

మధ్యతరగతి స్పెషల్.. బడ్జెట్ ధరలో బెస్ట్ డిష్ వాషర్లు.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు!
Advertisement

Budget Dishwashers 2026: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వంటగదిలోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంట్లతో అల్లాడే మహిళల కోసం.. ప్రస్తుతం చాలా రకాల డిష్ వాషర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బడ్జెట్ ధరలో సామాన్యుల అవసరాలకు సరిపోయేలా ఉన్న కొన్ని అత్యుత్తమ డిష్‌వాషర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

ఫేబర్ 8 ప్లేస్ సెట్టింగ్

తక్కువ ధరలో మంచి డిష్‌వాషర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది. తక్కువ విద్యుత్, నీటి వినియోగంతో గిన్నెలను తళతళలాడేలా శుభ్రం చేయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం అమెజాన్ లో రూ.26,739కి ఇది అందుబాటులో ఉంది.

ఫేబర్ 12 ప్లేస్ సెట్టింగ్స్

Advertisement

కిచెన్ లో స్పేస్ తక్కువ ఉండేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి తక్కువ స్థలంలోనే సులువుగా సెట్ చేయవచ్చు. సైజ్ చిన్నదైనప్పటికీ.. వంట పాత్రలన్నింటినీ ఎంతో సమర్థవంతంగా క్లీన్ చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర రూ.27,979.

మిడియా 13 ప్లేస్ సెట్టింగ్

మధ్యతరగతి కుటుంబాల అవసరాలకు ఈ డిష్ వాషర్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మసాలా జిడ్డు, ఆయిల్ మరకలను సైతం వదిలించడంలో ఇది ముందంజలో ఉంటుంది. బడ్జెట్ ధరలో మంచి ఆల్ రౌండర్ డిష్ వాషర్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. అమెజాన్ లో రూ.23,990కి ఇది లభిస్తోంది.

ఐఎఫ్‌బీ 14 ప్లేస్ సెట్టింగ్స్

Advertisement

ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. 14 ప్లేస్ సెట్టింగ్స్ సామర్థ్యం ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద గిన్నెలు, ప్లేట్లను ఇందులో ఉంచి క్లీన్ చేయవచ్చు. విభిన్నమైన వంటలకు తగ్గట్లు ఇందులో ప్రత్యేక వాష్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ లో రూ.39,990 వద్ద ఇది సేల్ అవుతోంది.

Also Read: టీవీ షో కోసం వస్తే.. ఇంత ఘోరమా? హైదరాబాద్‌లో మహిళపై దారుణం!

బాష్ 13 ప్లేస్ సెట్టింగ్

డిష్‌వాషర్ రంగంలో ‘బాష్’ బ్రాండ్‌కు మంచి గుడ్ విల్ ఉంది. అత్యుత్తమ నాణ్యత, ప్రీమియం క్లీనింగ్ కోసం దీనిని పరిశీలించొచ్చు. ఇది గిన్నెలను కడగడమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియాను సైతం చంపేస్తుంది. ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ.42,990.

Also Read: స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగానికి చెక్.. సీక్రెట్ రికార్డింగ్స్ అడ్డుకునేందుకు.. మెటా సరికొత్త టెక్నాలజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×