// // Best Mobiles Under 10000: రూ.10 వేలలోపు బెస్ట్ 5జి ఫోన్‌లు ఇవే -->
E-Paper
Advertisement

Best Mobiles Under 10000: రూ.10 వేల లోపు బెస్ట్ 5జి ఫోన్‌లు ఇవే.. బడ్జెట్ కింగ్‌ కోసం మార్కెట్‌లో భారీ డిమాండ్

Best Mobiles Under 10000: రూ.10 వేల లోపు బెస్ట్ 5జి ఫోన్‌లు ఇవే.. బడ్జెట్ కింగ్‌ కోసం మార్కెట్‌లో భారీ డిమాండ్
Advertisement

Best Mobiles Under 10000: నేటి మార్కెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, మొబైల్ కంపెనీలు సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరకే పర్‌ఫెక్ట్ ఫీచర్లను అందించే ఫోన్‌లను వరుసగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రీమియం ఫీచర్ల కోసం అధిక మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులకు బెస్ట్ ఫోన్లు కొనుగోలు చేసుకునే అవకావం లభించనుంది. ముఖ్యంగా 5జి కనెక్టివిటీని ఆశించే ఇండియన్ వినియోగదారుల దృష్టి ఇప్పుడు రూ.10 వేల రేంజ్‌లోని స్మార్ట్‌ఫోన్‌లపై పడింది. కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, ఆన్‌లైన్ క్లాసులు లైట్ గేమింగ్‌ వంటి ఆల్-రౌండ్ పర్‌ఫార్మెన్స్ అందిస్తూ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ను పెంచాయి. ఈ రేంజ్‌లో బెస్ట్‌గా నిలుస్తున్న కొన్ని మోడళ్లను ఇప్పుడు చూద్దాం.

Vivo Y28e 5G – ధర రూ.10,499

Advertisement

రూ.10,499 ధర వద్ద లభిస్తున్న ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌కు అందరూ ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని స్లిమ్ బాడీ, ప్రత్యేకమైన కలర్ ఫినిష్ కారణంగా చేతిలో పట్టుకుంటే ప్రీమియం అనుభూతి వచ్చేలా దీని లుక్స్ తయారుచేశారు. డైలీ యూజ్‌లో ఫోన్‌ రన్ అవ్వడం చాలా స్మూత్‌గా ఉంటుంది ఎటువంటి లాగ్ కనిపించదు. 5000mAh బ్యాటరీ ఉండడంతో పగలంతా ఛార్జ్ గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు. కెమెరా కూడా ఫోటోలు తీసినప్పుడు కలర్స్ నేచురల్‌గా క్యాప్చర్ చేస్తుంది. లుక్ రోజువారీ పర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది సరైన ఎంపిక.

Infinix Hot 50 5G – ధర: రూ. 9,999

Advertisement

రూ.9,999 ధరతో వస్తున్న ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లే క్వాలిటీ, మీడియా వినియోగం కోసం మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది. యూట్యూబ్, రీల్స్, సినిమాలు చూసేటప్పుడు హై రిజల్యూషన్ కారణంగా స్క్రీన్ కలర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లైట్‌ గేమింగ్‌ను కూడా ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఉండడం దీనికి అదనపు బలం. స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడిపేవాళ్లకు ఈ ఫోన్ సరైన ఎంపిక.

Moto G45 5G – ధర రూ. 9,999

రూ.9,999 ధరతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ క్లీన్ స్టాక్ యూజర్ ఇంటర్‌ఫేస్ కావాలనుకునే వారికి పర్‌ఫెక్ట్ ఎంపిక. మోటో అందించే ఈ అన్‌టచ్డ్ ఆండ్రాయిడ్ అనుభవం వల్ల అన్‌వాంటెడ్ యాప్స్ ఉండవు. అందుకే ఫోన్ చాలా లైట్‌గా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. రిలైబుల్ ఆప్షన్‌గా ఇది కాల్స్, మీటింగ్స్, ఆఫీస్ వర్క్ వంటి పనులకు ఉపయోగపడుతుంది. దీని కెమెరా విషయానికి వస్తే, నైట్ ఫోటోగ్రఫీ కూడా చాలా క్లియర్ గా ఉంది. బ్రాండ్ నమ్మకం ప్యూర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కోరేవాళ్లు ఈ ఫోన్‌నే ఎంచుకుంటున్నారు.

Samsung Galaxy M15 5G – ధర రూ.11,249

రూ.11,249 ధరతో లభిస్తున్న ఈ మోడల్‌లో అమెలెట్ డిస్‌ప్లే రేంజ్‌లో లభించడం చాలా అరుదు. స్క్రీన్ క్వాలిటీ చూస్తేనే దాని క్లాస్ అర్థమవుతుంది. వీడియోస్ చూసినప్పుడు కలర్స్ చాలా రిచ్‌గా డీప్‌గా కనిపిస్తాయి. 6000mAh బ్యాటరీ ఉండటం దీని అతిపెద్ద ఆకర్షణ. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకు దగ్గరగా ఈ ఫోన్ బాగా సపోర్ట్ చేస్తుంది. శామ్‌సంగ్ బ్రాండ్ నమ్మకం, బెస్ట్ సర్వీస్ సపోర్ట్ కావాలనుకునే వారికి ఇది టాప్ ప్రాధాన్యం.

Also Read: Nokia Lumino X1 smartphone: నోకియా లుమినో ఎక్స్ వన్ 5 జీ విడుదల.. మార్కెట్‌లోకి కొత్త పోటీదారు ఎంట్రీ

Redmi 14C 5G – ధర రూ.9,989

కేవలం రూ.9,989 ధరతో వస్తున్న ఈ ఫోన్ స్మూత్ పర్‌ఫార్మెన్స్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ పరంగా చాలా స్థిరమైన ఫోన్. దీని ప్రాసెసర్ స్పీడ్ మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. స్టూడెంట్స్, వర్కింగ్ యూజర్స్ ఎక్కువగా ఈ ఫోన్‌ను ఎంచుకుంటారు. కెమెరా రిజల్ట్ కూడా రోజువారీ యూజ్‌కు బాగానే ఉంటుంది డీసెంట్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. తక్కువ ధరలో నిజమైన విలువను అందించే ఫోన్‌ లిస్ట్‌లో ఇది తప్పకుండా మంచి బ్రాండ్‌గా నిలిచింది.

POCO C71 – ధర రూ. 6,499

రూ.6,499 ధరతో లభిస్తున్న ఈ మోడల్ బడ్జెట్ రేంజ్‌లో 5జి అనుభవాన్ని అందిస్తుంది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్లకి, స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. దీని పెద్ద స్క్రీన్ కారణంగా కంటెంట్ చూడటం సౌకర్యంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా డే లాంగ్ మెయింటైన్ అవుతుంది. బేసిక్ స్మార్ట్‌ఫోన్ అనుభవం కావాలనుకునే వాళ్లకి ఇది సరైన ఆప్షన్.

Lava Blaze 3 – ధర రూ.11,499

రూ.11,499 ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ దేశీ బ్రాండ్ ఫోన్‌కు భారతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. బిల్డ్ క్వాలిటీ పటిష్టంగా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు సాలిడ్ ఫీల్ ఇస్తుంది. స్టైలిష్ లుక్, ప్రీమియం బ్యాక్ ప్యానెల్ డిజైన్ కూడా ఇందులో ఆకర్షణీయంగా ఉంటాయి. స్థానిక ఉత్పత్తిని సపోర్ట్ చేయాలనుకునే వాళ్లలో ఈ ఫోన్‌కి భారీ డిమాండ్ ఉంది.

Redmi A4 5G – ధర రూ.7,989

రూ.7,989 ధరతో వస్తున్న ఈ ఫోన్ లో బడ్జెట్ 5జి సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ వాడకం కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్ పర్‌ఫార్మింగ్ మోడల్. ఫోన్ వెయిట్ తక్కువగా ఉండటం గ్రిప్ బాగుండడం వల్ల ఎక్కువ సేపు వాడినా సమస్య రాదు. హ్యాంగ్, లాగ్ సమస్యలు చాలా అరుదు. డైలీ రూటీన్ యూజ్‌లో ఇది స్మూత్ ఫీలింగ్ ఇస్తుంది.

Redmi 13C 5G – ధర రూ.8,999

రూ. 8,999 ధరతో లభిస్తున్న ఈమోడల్ వాల్యూ ఫర్ మనీ అని ముందుగా గుర్తుకు వస్తుంది. పర్‌ఫార్మెన్స్, కెమెరా రిజల్ట్, బ్యాటరీ వంటి ముఖ్య అంశాలలో బ్యాలెన్స్ కలిగిన ఫోన్ ఇది. డే టైమ్ ఫోటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంటుంది, కలర్స్‌ నేచురల్‌గా వస్తాయి. బ్యాటరీ లైఫ్ చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. రీజనబుల్ ఆప్షన్‌గా బ్లైండ్‌గా ఈ ఫోన్ తీసుకోవచ్చు.

Tecno Pop 9 -ధర రూ.6,099

కేవలం రూ.6,099 ధరతో లభిస్తున్న ఇది ఎంట్రీ లెవెల్ 5జి మోడల్. మొదటిసారిగా 5జి ఫోన్ కొనాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్. బేసిక్ యూజ్.. కాల్స్, మెసేజెస్, వాట్సాప్ ఇవన్నీ స్మూత్‌గా రన్ అవుతాయి. పెద్దవాళ్లు కూడా సులభంగా వాడగల ఫోన్. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్ల అనుభవాన్ని ఇది అందిస్తుంది.

ఇప్పుడు ఈ 10 ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ బడ్జెట్ 5జీ ఆప్షన్స్‌లో ప్రతి ఫోన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. డిస్‌ప్లే క్వాలిటీ, బ్యాటరీ స్టామినా కోసం చూస్తే శామ్‌సంగ్ ఎం15 5జీ ముందుంటుంది, అమోలేడ్ స్క్రీన్ ఇవ్వే రిచ్ విజువల్స్, 6000mah బ్యాటరీ కలయిక ఈ రేంజ్‌లో దీనిని టాప్ చాయిస్ చేస్తాయి. క్లీన్ యూజర్ అనుభవం, స్పీడ్, స్టేబుల్ పర్‌ఫార్మెన్స్ అవసరమైతే మోటో జి45 5జీ ఎలాంటి సందేహం లేకుండా ఎంచుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఇచ్చే స్మూత్ ఆపరేషన్ డైలీ వర్క్‌లో అసలు స్ట్రెస్ ఇవ్వదు. స్టైల్ పవర్‌ప్యాక్ పర్‌ఫార్మెన్స్ కలయిక కావాలంటే వివో వై28 ఈ 5జీ ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన రోజువారీ రన్ కారణంగా సరిగ్గా ఫిట్ అవుతుంది. పెద్ద డిస్‌ప్లే, క్వాలిడీ మీడియా అనుభవం ప్రధాన అవసరమైతే ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అనొచ్చు. మీడియా లవర్స్ కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది, వీడియోస్, రీల్స్ చూసేందుకు మరింత లెవెల్‌కు తీసుకెళుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×