// // BSNL Plans: రోజుకు 3GB డేటా.. సామాన్యుడికి వరంలాంటి ప్లాన్స్..! -->
E-Paper
Advertisement

BSNL Plans: రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. సామాన్యుడికి వరంలాంటి ప్లాన్స్..!

BSNL Plans: రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. సామాన్యుడికి వరంలాంటి ప్లాన్స్..!
Advertisement

BSNL Plans: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ తమ టారిఫ్ ధరలను పెంచుతున్న క్రమంలో.. సామాన్యులకు బీఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అనేక రకాల ప్లాన్స్ తీసుకొచ్చింది. వాటిలో తక్కువ బడ్జెట్ లో 70-80 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన బెస్ట్ ప్లాన్స్ ఏవో ఈ కథనంలో చూద్దాం.

రూ. 399 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ లో తక్కువ బడ్జెట్ లో బాగా పాపులర్ అయిన ప్లాన్స్ లో ఇదీ ఒకటి. 80 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీ రోజూ 1 GB డేటా లభిస్తుంది. డేటా పరిమితి అయిపోతే 40kbps వేగంతో ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం యూజర్ కు లభిస్తాయి.

రూ. 439 రీఛార్జ్ ప్లాన్

Advertisement

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 80 – 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో యూజర్ కు అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. 300 ఎస్ఎంఎస్ ల కూడా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఎలాంటి డేటా అందుబాటులో ఉండదు. కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కోసం సిమ్ యాక్టివ్ గా ఉంచాలని భావిస్తే దీనిని ట్రై చేయవచ్చు.

రూ. 485 రీఛార్జ్ ప్లాన్..

తక్కువ బడ్జెట్ లో ఆల్ రౌండ్ ప్లాన్ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. 72 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీరోజూ 1.5 GB డేటా లభిస్తుంది. దాంతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా పొందొచ్చు.

Advertisement

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.25వేల లోపు 4K QLED టీవీలు.. శాంసంగ్, షావోమీల మోడల్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్స్!

రూ.599 రీఛార్జ్ ప్లాన్..

డేటా అవసరం ఎక్కువ ఉన్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ప్రతీ రోజూ 3GB హై స్పీడ్ డేటా, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను యూజర్ పొందొచ్చు. అలాగే జింగ్ (Zing), ఆస్ట్రోసెల్ వంటి అదనపు బెనిఫిట్స్ సైతం యూజర్లకు లభిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఇది బెస్ట్ వాల్యూ ప్లాన్ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు స్ఫష్టం చేస్తున్నాయి.

Also Read: ఫోన్ పేలే ముందు ఇలాంటి సిగ్నల్స్ ఇస్తుంది.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×