// // BSNL Budget Plans: బెస్ట్ BSNL రీఛార్జ్ ప్లాన్స్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

BSNL Budget Plans: బెస్ట్ BSNL రీఛార్జ్ ప్లాన్స్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్!

BSNL Budget Plans: బెస్ట్ BSNL రీఛార్జ్ ప్లాన్స్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్!
Advertisement

Best BSNL Recharge Plans 2026: తక్కువ ఖర్చుతో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తుంది ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ కావాలనుకునే వారికి BSNL మంచి ఆప్షన్‌ గా ఉంటుంది. ఇప్పుడు BSNLలో ఉన్న కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తక్కువ ధరలో ఎక్కువ వాలిడిటీ

తక్కువ ధరలో ఎక్కువ కాలం వాలిడిటీ కావాలనుకునేవారికి BSNL చాలా ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ. 107, రూ. 197 లాంటి  ప్లాన్లు తక్కువ ఖర్చులో 1 నుంచి 2 నెలల వాలిడిటీ ఇస్తాయి. వీటిలో రోజువారీ డేటా కొద్దిగా ఉన్నా, కాల్స్, SMS కోసం బాగా సరిపోతాయి.

డైలీ డేటా యూజర్స్ కోసం..

Advertisement

ఇక డైలీ డేటా యూజర్స్ కోసం BSNL మంచి ప్లాన్స్ అందిస్తుంది. రూ.199, రూ.239, రూ.299 లాంటి ప్లాన్లలో రోజుకు 1GB లేదంటే 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. వాలిడిటీ కూడా 30 రోజులకు దగ్గరగా ఉంటుంది. నెలవారీ వినియోగానికి ఇవి బాగా సెట్ అవుతాయి.

ఎక్కువ వాలిడిటీ కావాలనుకునే వారికి..

లాంగ్ టర్మ్ ప్లాన్స్ విషయంలో BSNL బోలెడు ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ. 666, రూ. 797, రూ. 997 ప్లాన్లలో 150 రోజులు వరకు వాలిడిటీ ఉంటుంది. రోజుకు 2GB వరకు డేటా, అన్‌ లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకుండా ఉండాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

BSNLఅన్‌ లిమిటెడ్ ప్లాన్స్

Advertisement

ఇక BSNLలో అన్‌ లిమిటెడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.  చాలా ప్రైవేట్ నెట్‌ వర్క్‌ లలో రోజుకు ఒక లిమిట్ తర్వాత స్పీడ్ తగ్గుతుంది. కానీ BSNLలో కొన్ని ప్లాన్లలో డేటా స్పీడ్ స్థిరంగా ఉంటుంది. చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, BSNL ఇంకా కొన్ని ప్రాంతాల్లో 4G పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఎక్కువగా 3G, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 4G ఉంది. అందుకే, ముందుగా వినియోగదారులు తమ ప్రాంతంలో నెట్‌ వర్క్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం మంచిది.

ఎవరికి ఏ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది?   

⦿ కాల్స్ ఎక్కువగా చేసేవారికి రూ.107, రూ.197 ప్లాన్స్ సరిపోతాయి.

⦿ డేటా ఎక్కువగా వాడేవారికి  రూ. 199, రూ.299 ప్లాన్స్ సెట్ అవుతాయి.

⦿ లాంగ్ వాలిడిటీ కావాలంటే రూ. 666, రూ. 797 ప్లాన్స్  తీసుకోవడం మంచిది.

నిజానికి BSNL ప్లాన్స్ అనగానే తక్కువ ఖర్చు, ఎక్కువ వాలిడిటీ అని భావిస్తారు. హై స్పీడ్ ఇంటర్నెట్ కంటే బడ్జెట్ అనుకూలంగా ఉండాలంటే, BSNLను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో, సింపుల్ యూజ్ కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

Read Also: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×