E-Paper
Advertisement

రోజుకు 3GB డేటా + ఫ్రీ నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే!

రోజుకు 3GB డేటా + ఫ్రీ నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే!
Advertisement

Airtel Netflix Plans: ప్రస్తుత రోజుల్లో మొబైల్ రీఛార్జ్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పొందడం వినియోగదారులకు ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా సినిమా ప్రియులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ప్లాన్లను తీసుకువచ్చింది. రూ. 2,000 లోపు బడ్జెట్లోనే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలను అందించే కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల అందుబాటులో ఉంచింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 279 ప్లాన్

తక్కువ ధరలో లభించే బెస్ట్ ఓటీటీ ప్లాన్‌లలో ఇదీ ఒకటి. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నెట్ ఫ్లిక్స్ తో పాటు జియో హాట్ స్టార్, జీ5, సోనిలివ్ వంటి ఓటీటీలను ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్రీమియం కంటెంట్ చూసేందుకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ప్లాన్ పూర్తి కాలానికి 30GB డేటాను సైతం వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఎలాంటి ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు లభించవు.

రూ. 598 ప్లాన్

Advertisement

కంప్లీట్ ఆల్ రౌండ్ ప్లాన్ కోరుకునేవారి కోసం ఎయిర్ టెల్ దీనిని తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్, జీ5, ఎయిర్ ఎక్స్ స్ట్రీమ్ ప్లేతో సహా 22 ఓటీటీలకు ఈ ప్లాన్ ద్వారా యాక్సెస్ లభించనుంది. అలాగే ప్రతీ రోజూ 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఉచితంగా హలో ట్యూన్ ను సైతం సెట్ చేసుకోవచ్చు.

రూ.1,729 ప్లాన్

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ ఓటీటీ ప్లాన్ తో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. అలాగే నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ 5 ప్రీమియం, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే తో పాటు 20కి పైగా ఓటీటీలకు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. మీ ఏరియాలో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉండి మీది 5G ఫోన్ అయితే.. అపరిమితంగా 5G డేటాను వాడుకోవచ్చు. అటు ప్రతీ రోజూ 2GB డేటాతో పాటు ఫ్రీకాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు.

Advertisement

Also Read: వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!

రూ.1798 ప్లాన్

ఈ ప్లాన్ కూడా నెట్ ఫ్లిక్స్ ను ఆఫర్ చేస్తోంది. ప్రతీ రోజూ 3GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్ కు యథావిధిగా లభించనున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో పాటు వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ సైతం యూజర్లు ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు. 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల వారు.. ఎలాంటి డేటా పరిమితి లేకుండా నాన్ స్టాప్ గా 5G డేటాను పొందొచ్చని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: ఒకే చెట్టు.. 300 ఏళ్లపాటు కలప.. 600 ఏళ్ల నాటి అద్భుత టెక్నాలజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×