E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా? అయితే ఈ  చిట్కాలు మీ కోసమే
Advertisement

Best Air Purifier in India 2026: రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా, ఇంట్లో స్వచ్ఛమైన గాలిని పీల్చడం అనేది ఒక అవసరంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో మీ కుటుంబ ఆరోగ్యానికి రక్షణగా నిలిచే ఎయిర్ ప్యూరిఫైయర్ కొనడం చాలా ముఖ్యం. మార్కెట్లో వందల మోడల్స్ ఉన్నప్పటికీ, మీ గది పరిమాణం, ఫిల్టర్ రకం ,బడ్జెట్‌కు తగిన ప్రొడక్ట్ ఎంచుకోవడానికి ఈ 6 చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఎయిర్  ప్యూరిఫైయర్ కొనేందుకు చిట్కాలు: 

Advertisement

మీరు కొత్తగా ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. 2026 నాటి లేటెస్ట్ టెక్నాలజీ , నిపుణుల సూచనల ప్రకారం ఈ క్రింది అంశాలను తప్పనిసరిగా గమనించాలి.

1. HEPA ఫిల్టర్ తప్పనిసరి:
ఎయిర్ ప్యూరిఫైయర్‌లో అన్నింటికంటే ముఖ్యమైనది ఫిల్టర్. ఎల్లప్పుడూ True HEPA (H13 or H14 Grade) ఫిల్టర్ ఉన్న మోడల్స్‌ను మాత్రమే ఎంచుకోండి. ఇవి గాలిలోని 99.97% సూక్ష్మ కణాలను (PM 2.5) అంటే కంటికి కనిపించని ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థవంతంగా తొలగిస్తాయి. సాధారణ ఫిల్టర్లు కేవలం పెద్ద దుమ్ము కణాలను మాత్రమే ఆపగలవు. కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకండి.

Advertisement

2. CADR రేటింగ్‌ చెక్ చేయండి:
CADR (Clean Air Delivery Rate) అనేది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంత వేగంగా గాలిని శుద్ధి చేస్తుందో తెలియజేస్తుంది. మీ గది వైశాల్యం బట్టి ఈ రేటింగ్ ఉండాలి. ఉదాహరణకు.. పెద్ద హాల్ అయితే ఎక్కువ CADR ఉన్న మెషిన్ అవసరం. సాధారణంగా 250-400 CADR ఉన్న ప్యూరిఫైయర్లు బెడ్‌రూమ్స్, చిన్న లివింగ్ రూమ్స్‌కు సరి పోతాయి.

3. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్:
గాలిలోని దుమ్మును HEPA ఫిల్టర్ ఆపితే, గాలిలోని దుర్వాసనను, వంట గది పొగను, హానికరమైన వాయువులను ఫిల్టర్ పీల్చుకుంటుంది. మీరు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా పారిశ్రామిక ప్రాంతాల్లో నివసిస్తుంటే.. ఈ ఫిల్టర్ ఉన్న ప్యూరిఫైయర్ మీకు ఎంతో మేలు చేస్తుంది.

4. సౌండ్, కరెంట్ ఖర్చు:
చాలా మంది ప్యూరిఫైయర్ కొన్న తర్వాత అది చేసే శబ్దం భరించలేక రాత్రిపూట ఆపేస్తుంటారు. అందుకే కొనేముందే నాయిస్ లెవల్స్ చెక్ చేయండి. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. అది 30-40 dB కంటే తక్కువ ఉండాలి. అలాగే.. ఎయిర్ ప్యూరిఫైయర్లు రోజంతా ఆన్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి, తక్కువ కరెంట్ వినియోగించే మోడల్స్ ఎంచుకోవడం బెస్ట్.

Also Read: ఆపిల్ వాచ్‌లాగే ఉంది కదూ ! తక్కువ ధరలో Huawei Watch Fit 4..ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారంతే

5. మెయింటెనెన్స్,ఫిల్టర్ :
ప్యూరిఫైయర్ కొనడం ఒక ఖర్చు అయితే.. దాన్ని మెయింటెయిన్ చేయడం మరో ఖర్చు. ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి.. మీరు ఎంచుకున్న బ్రాండ్ ఫిల్టర్లు మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయా? వాటి ధర ఎంత? అనేది ముందే ఆరా తీయండి. తక్కువ ధరలో వచ్చే ప్యూరిఫైయర్ల ఫిల్టర్ ధరలు కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉండొచ్చు.

6. స్మార్ట్ ఫీచర్లు :
ప్రస్తుతం వస్తున్న ఎయిర్ ప్యూరిఫైయర్లు Wi-Fi, Alexa/Google Assistant సపోర్ట్‌తో వస్తున్నాయి. దీనివల్ల మీరు ఆఫీసులో ఉన్నా మీ ఫోన్ ద్వారా ఇంటి గాలి నాణ్యతను చెక్ చేయవచ్చు. అలాగే ఆటో మోడ్ ఉన్న మెషిన్లు గాలి నాణ్యతను బట్టి ఫ్యాన్ స్పీడ్‌ను వాటంతట అవే సర్దుబాటు చేసుకుంటాయి.

సరైన ఎయిర్ ప్యూరిఫైయర్ మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. బ్రాండ్ పేరు కంటే పైన చెప్పిన టెక్నికల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కొనుగోలు చేస్తే మీ పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×