E-Paper
Advertisement

ఈ వానలకు వేడి వేడి డీప్ ఫ్రై స్నాక్స్ తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!

ఈ వానలకు వేడి వేడి డీప్ ఫ్రై స్నాక్స్ తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!
Advertisement

Best Air Fryers: వర్షాకాలం మొదలైంది.. ఇక ప్రతి ఇంట్లోనూ సమోసాలు, పకోడీలు, బజ్జీలు.. ఇలాంటి క్రిస్పీ స్నాక్స్‌ను ఎక్కువగా తినవడానికి ఇష్టపడుతుంటారు. కానీ, వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల వచ్చే క్యాలరీలు, కొవ్వును చూసి చాలామంది భయపడుతుంటారు. ఇలాంటి తరుణంలో రుచి మారకుండా, ఆరోగ్యం పాడవకుండా మనసుకు నచ్చిన స్నాక్స్ తినాలనుకుంటే ఎయిర్ ఫ్రయర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇవి చాలా తక్కువ నూనెతో లేదా అస్సలు నూనె లేకుండానే పదార్థాలను చక్కగా ఫ్రై చేస్తాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎయిర్ ఫ్రయర్ల ఏవో తెలుసుకుందాం.

Wonderchef Platinum Plus

ఈ ఎయిర్ ఫ్రయర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఐదు లీటర్ల కెపాసిటీతో వస్తుంది. అంటే ఒక మీడియం సైజ్ కుటుంబానికి ఇది చక్కగా సరిపోతుంది. దీనిలో ప్రత్యేకంగా గ్లాస్ లోపల లైట్ ఉంటుంది. దీనివల్ల బాస్కెట్ విప్పకుండానే లోపల ఆహారం ఎంతవరకు ఉడికిందో బయటి నుంచే చూసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఎయిర్ ఫ్రయర్లో ఫ్రై చేయడంతో పాటు బేకింగ్, గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. దీని డిజిటల్ టచ్ ప్యానెల్ వల్ల దీనిని ఉపయోగించడం చాలా సులభం.

Nutricook Air Fryer Slim

Advertisement

కిచెన్‌లో ఎక్కువ స్థలం ఆక్రమించకుండా, నిలువుగా ఉండే డిజైన్‌తో ఈ ఫ్రయర్ వస్తుంది. ఐదు లీటర్ల సామర్థ్యంతోనే లభిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వాడిన సెరామిక్ కోటింగ్ పూర్తిగా టాక్సిన్ రహితమైనది. అంటే ప్లాస్టిక్ లేదా ఇతర కెమికల్స్ భయం లేకుండా వండుకోవచ్చు. దీని ప్రొసైక్లోన్ టెక్నాలజీ వల్ల వేడి గాలి చుట్టూ సమానంగా వ్యాపించి, ఆహార పదార్థాలు లోపల మెత్తగా, బయట కరకరలాడేలా తయారవుతాయి.

Also Read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

Pigeon Healthifry Digital

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఎయిర్ ఫ్రయర్ కోసం చూస్తుంటే.. ఈ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. ఇది 4.2 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. దీని 360 డిగ్రీల హైస్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ వల్ల ఆహారం అన్ని వైపులా సమానంగా వేగుతుంది. వంటలు చేయడం రానివారు కూడా సులువుగా వాడుకునేలా దీనిలో 8 రకాల ప్రీసెట్ ఆప్షన్లు ఉన్నాయి. దీని నాన్‌స్టిక్ బాస్కెట్‌ను వంట పూర్తయిన తర్వాత క్లీన్ చేయడం చాలా తేలిక.

Philips Air Fryer

ఎయిర్ ఫ్రయర్ల విభాగంలో ఇది చాలా నమ్మకమైన బ్రాండ్. దీని 4.1 లీటర్ల మోడల్ చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు బాగా సెట్ అవుతుంది. దీనిలోని రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ దాదాపు 90 శాతం వరకు నూనె వాడకాన్ని తగ్గిస్తుంది. వేపుళ్లు మాత్రమే కాకుండా రాత్రి మిగిలిపోయిన ఫుడ్‌ను కూడా ఇందులో వేడి చేసుకుంటే.. అప్పుడే వండినట్టుగా తాజాగా మారుతుంది. ఎక్కువ హంగులు లేకుండా సింపుల్‌గా, మన్నికగా ఉండే వస్తువు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read: వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×