E-Paper
Advertisement

రూ.700 లోపు మల్టీ డివైస్ ఛార్జర్.. ఇక ఫోన్, వాచ్, బడ్స్‌కు ఒకేసారి ఛార్జింగ్ పెట్టేయొచ్చు!

రూ.700 లోపు మల్టీ డివైస్ ఛార్జర్.. ఇక ఫోన్, వాచ్, బడ్స్‌కు ఒకేసారి ఛార్జింగ్ పెట్టేయొచ్చు!
Advertisement

Best Wireless Chargers: వైర్‌లెస్ ఛార్జర్ అంటే ఒకప్పుడు చాలా ఖరీదైన వ్యవహారం అనిపించేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మొబైల్ వైర్లతో ఇబ్బంది పడకుండా, ఫోన్లను స్టైలిష్‌గా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా డెస్క్‌టాప్ మీద ఛార్జర్ వైర్లు గజిబిజిగా కనిపించకుండా నీట్‌గా ఉండాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే కొన్ని మల్టీ డివైస్ ఛార్జర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్‌లో కావాలనుకుంటే..

వైర్‌లెస్ ఛార్జింగ్ కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి టెక్‌పంచ్ మోడల్ బాగా సెట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.644 మాత్రమే. అంత తక్కువ ధరలో కూడా ఇది ఫోన్, వాచ్, ఇయర్‌బడ్స్‌ను ఒకేసారి ఛార్జ్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. బడ్జెట్ తక్కువగా ఉండి.. పని తీరు బాగుండాలి అనుకునే వారికి ఇది ఫస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

స్టైలిష్‌గా ఉండాలంటే..

Advertisement

ఈ పోర్ట్రానిక్స్ ఫ్రీడమ్ 4A ఛార్జర్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇది కేవలం ఛార్జర్ మాత్రమే కాదు.. దీనిలో డిజిటల్ అలారం క్లాక్ కూడా ఉంటుంది. దీనిని బెడ్ పక్కన టేబుల్‌పై క్లాక్ లాగా పెట్టుకోవచ్చు. అంతేకాదు.. ఫోన్‌కు 15 వాట్ల స్పీడ్‌తో ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు. దీని ధర రూ.1,099. చూడటానికి కూడా చాలా మోడ్రన్‌గానూ ఉంటుంది.

Also Read: BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

స్పీడ్ ఛార్జింగ్ కోసం..

Advertisement

చాలామంది వైర్‌లెస్ ఛార్జింగ్ స్లోగా ఉంటుందని అనుకుంటారు. అలాంటి వారి కోసం UBON కంపెనీ ఈ WC-915 ప్రో మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది 22 వాట్ల పవర్‌తో ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేస్తుంది. రూ.1,449 ధరలో దొరికే ఈ ఛార్జర్.. ఒకేసారి మూడు గ్యాడ్జెట్స్‌ను స్పీడ్‌గా ఛార్జ్ చేయడానికి చాలా బాగుంటుంది.

లాంగ్ జర్నీల్లో వాడుకోవాలంటే..

ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్లు అన్ని వైర్లను మోయడం కష్టం. అలాంటప్పుడు ఈ TECNOLOGIA 3-ఇన్-1 ఛార్జర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి బ్యాగులో చిన్న మూలన సర్దేయొచ్చు. చూడటానికి చాలా క్లాసీగా ఉండే ఈ ఛార్జర్, టెక్ ప్రియులకు మరియు ట్రావెలర్లకు బెస్ట్ ఆప్షన్.

మంచి క్వాలిటీ ఉండాలంటే..

బడ్జెట్ కంటే పర్ఫార్మెన్స్ ముఖ్యం అనుకుంటే CASONను ఎంచుకోవచ్చు. దీనిలో లేటెస్ట్ Qi2 టెక్నాలజీ ఉంటుంది. దీని రూ.2,684 వరకు ఉంటుంది. ధర కొంచెం ఎక్కువే అయినా.. ఇది ఇచ్చే పవర్ అవుట్‌పుట్, సేఫ్టీ ఫీచర్లు చాలా బాగుంటాయి. గ్యాడ్జెట్స్ సేఫ్‌గా, స్పీడ్‌గా ఛార్జ్ అవ్వాలి అనుకుంటే ఈ వైర్‌లెస్ ఛార్జర్ బెస్ట్ ఆప్షన్.

Also Read: రూ.13,000 లోపు Redmi A7 Pro 5G .. మిడిల్‌క్లాస్ యూజర్లకు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×