E-Paper
Advertisement

24 డిగ్రీలతో ఏసీ నడిపితే.. నెలకు ఎంత సేవ్ అవుతుందో తెలుసా?

24 డిగ్రీలతో ఏసీ నడిపితే.. నెలకు ఎంత సేవ్ అవుతుందో తెలుసా?
Advertisement

AC Temperature Tips: ఎండలు ముదిరిపోతుంటే ఇంట్లో ఏసీ ఆన్ చేయడం కామన్. అయితే ఏసీ ఆన్ చేయగానే రూమ్ త్వరగా చల్లబడాలని చాలా మంది టెంపరేచర్‌ను వెంటనే 16 డిగ్రీలకు తగ్గించేస్తుంటారు. మరికొందరేమో 24 డిగ్రీలు బెస్ట్ అంటారు. ఇంతకీ మీ ఏసీని నడపడానికి సరైన ఉష్ణోగ్రత ఏది? 16 డిగ్రీలా లేక 24 డిగ్రీలా? వీటిలో ఏ సెట్టింగ్ వల్ల మీ కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

16 డిగ్రీలు వర్సెస్ 24 డిగ్రీలు: ఏది బెస్ట్?

చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏసీని 16 డిగ్రీలలో పెడితే కంప్రెసర్ చాలా వేగంగా చల్లటి గాలిని ఇస్తుందని, రూమ్ త్వరగా కూల్ అవుతుందని అనుకుంటారు. కానీ సైన్స్ , టెక్నాలజీ ప్రకారం ఇది పూర్తిగా తప్పు.

Advertisement

మీరు ఏసీని 16లో పెట్టినా.. 24లో పెట్టినా ఏసీ నుంచి వచ్చే గాలి ఒకే వేగంతో, ఒకే చల్లదనంతో వస్తుంది. కాకపోతే.. 16 డిగ్రీలు అనేది మీ రూమ్ చేరుకోవాల్సిన ‘టార్గెట్ ఉష్ణోగ్రత’. బయట ఎండ 40 డిగ్రీలు ఉన్నప్పుడు, రూమ్ టెంపరేచర్‌ను 16 డిగ్రీలకు తీసుకురావడం ఏసీ కంప్రెసర్‌కు చాలా కష్టమైన పని. దాని కోసం కంప్రెసర్ నాన్‌స్టాప్‌గా, పూర్తి శక్తితో పనిచేయాల్సి వస్తుంది. దీని వల్ల కరెంట్ మీటర్ పెరుగుతుంది.

24 డిగ్రీల మ్యాజిక్:
ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. మానవ శరీరానికి 24 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత సౌకర్యవంతమైంది.

Advertisement

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఏసీ ఉష్ణోగ్రతను ప్రతి ఒక్క డిగ్రీ పెంచినప్పుడల్లా దాదాపు 6 శాతం కరెంట్ ఆదా అవుతుంది. అంటే.. మీరు ఏసీని 16 డిగ్రీల నుంచి 24 డిగ్రీలకు మార్చితే, దాదాపు 40% పైగా కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు. 24 డిగ్రీల వద్ద రూమ్ టెంపరేచర్ సాధారణ స్థితికి రాగానే కంప్రెసర్ ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ అవుతుంది (ఇన్వర్టర్ ఏసీలయితే తక్కువ పవర్‌తో నడుస్తాయి). దీని వల్ల కరెంట్ విపరీతంగా సేవ్ అవుతుంది.

కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సూపర్  టిప్స్:
ఏసీతో పాటు ఫ్యాన్ వేయండి: ఏసీని 24 లేదా 26 డిగ్రీల వద్ద సెట్ చేసి, ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో ఆన్ చేయండి. ఫ్యాన్ గాలి వల్ల ఏసీ ఇచ్చే చల్లదనం రూమ్ అంతటా త్వరగా విస్తరిస్తుంది.

Also Read: ఆపిల్ వాచ్ రేంజ్ ఫీచర్లు బడ్జెట్ ధరలో! 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రియల్మీ వాచ్

టైమర్ ఫీచర్ ఉపయోగించండి: రాత్రిపూట పడుకునేటప్పుడు 2 లేదా 3 గంటల టైమర్ సెట్ చేసుకోండి. రూమ్ చల్లబడ్డాక ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.

ఫిల్టర్ల క్లీనింగ్: ఏసీ ఎయిర్ ఫిల్టర్లలో దుమ్ము చేరితే కంప్రెసర్‌పై లోడ్ పడి కరెంట్ బిల్లు పెరుగుతుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను ఇంట్లోనే క్లీన్ చేసుకోండి.

రూమ్ లీకేజీలు అరికట్టండి: ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు, తలుపులు సరిగ్గా వేశారో లేదో చూసుకోండి. చిన్న గ్యాప్స్ ఉన్నా చల్లదనం బయటకు పోయి ఏసీ ఎక్కువసేపు తిరగాల్సి వస్తుంది.

బాటమ్ లైన్: 16 డిగ్రీల వద్ద ఏసీ పెడితే గది ఐస్ లాగా మారడమే తప్ప, ఆరోగ్యానికి, జేబుకి అస్సలు మంచిది కాదు. కాబట్టి స్మార్ట్‌గా థింక్ చేయండి. ఏసీని 24 డిగ్రీల వద్ద రన్ చేయండి. ఈ సమ్మర్‌లో వచ్చే కరెంట్ బిల్లు షాక్‌ల నుంచి సేఫ్ అవ్వండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×