E-Paper
Advertisement

90 డిగ్రీల రొటేషన్, కోడింగ్‌కు పర్ఫెక్ట్.. డెవలపర్ల కోసం బెన్ క్యూ సూపర్ మానిటర్ లాంచ్!

90 డిగ్రీల రొటేషన్, కోడింగ్‌కు పర్ఫెక్ట్.. డెవలపర్ల కోసం బెన్ క్యూ సూపర్ మానిటర్ లాంచ్!
Advertisement

Coding Monitor: భారత్‌లోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ (BenQ) సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమ ‘ఆర్‌డి’ సిరీస్‌లో భాగంగా BenQ RD270Q అనే మోడల్‌ను లాంచ్ చేసింది. రాత్రింబవళ్లు కోడింగ్ చేసే డెవలపర్ల కంటి శ్రమను తగ్గించి, పని సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ఈ డివైజ్‌లో ప్రత్యేక ఫీచర్లను అందించారు.

అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ BenQ RD270Q మానిటర్ 27 అంగుళాల 2కే ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. సుదీర్ఘ సమయం స్క్రీన్ వైపే చూసేవారికి లైటింగ్ ప్రతిబింబించకుండా ప్రత్యేకమైన నానో మ్యాట్ టెక్నాలజీని వాడారు. దీంతో కాంతి నుంచి ఉపశమనం లభించి, అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

Advertisement

Also Read: WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!

ప్రత్యేకమైన కోడింగ్ మోడ్స్:

కోడర్ల కోసం దీనిలో ప్రత్యేకమైన డెవలపర్ మోడ్స్ ఉన్నాయి. లైట్, డార్క్ మోడ్స్‌తో పాటు పేపర్ కలర్ మోడ్ కూడా అందించారు. ఇది ఈ-పేపర్ అనుభూతిని ఇస్తూ కళ్లకు హాయినిస్తుంది. గదిలోని వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్స్ ఆటోమేటిక్‌గా మారేలా విజువల్ ఆప్టిమైజర్ పనిచేస్తుంది. రాత్రి వేళల్లో వర్క్ చేసేవారికి నైట్ అవర్స్ ప్రొటెక్షన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

కనెక్టివిటీ, కంఫర్ట్:

Advertisement

BenQ RD270Q మానిటర్ కేవలం వర్క్ కోసమే కాదు.. వాడకంలోనూ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. టైప్-సి పోర్ట్ ద్వారా 65W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంటే.. ఒకే కేబుల్‌తో ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేస్తూనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మన వెన్ను, మెడ నొప్పులు రాకుండా ఉండటానికి మానిటర్ ఎత్తును, యాంగిల్‌ను నచ్చినట్లు మార్చుకోవచ్చు. కావలసినప్పుడు 90 డిగ్రీలు తిప్పి నిలువుగా (పోర్ట్రెయిట్) కూడా ఉపయోగించుకోవచ్చు.

ధర ఎంతంటే?

విండోస్, మాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో సులువుగా పనిచేసే ఈ బెన్ క్యూ RD270Q మానిటర్ ప్రారంభ ధర రూ.29,989గా ఉంది. ప్రస్తుతం ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. మంచి పెర్ఫార్మెన్స్, కంటికి రక్షణ కోరుకునే ప్రోగ్రామర్లకు BenQ RD270Q బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×