E-Paper
Advertisement

BLDC Fans: కరెంట్ బిల్లుకు చెక్, ఈ స్మార్ట్ BLDC ఫ్యాన్లతో.. నెలకు వందల రూపాయలు ఆదా!

BLDC Fans: కరెంట్ బిల్లుకు చెక్, ఈ స్మార్ట్ BLDC ఫ్యాన్లతో.. నెలకు వందల రూపాయలు ఆదా!
Advertisement

BLDC Fans: నేడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం వాడే వస్తువుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో.. ఏసీలు, కూలర్ల కంటే సాధారణ ప్రజలు ఎక్కువగా వాడేది ఫ్యాన్లు. అయితే పాతకాలపు ఫ్యాన్ల వల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ క్రమంలోనే.. ‘BLDC ఫ్యాన్లు’ మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణ ఫ్యాన్ కంటే 60 శాతం వరకు కరెంట్ ఆదా చేసే ఈ స్మార్ట్ ఫ్యాన్లు, తక్కువ శబ్దం , రిమోట్ కంట్రోల్ ఫీచర్లతో యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BLDC ఫ్యాన్లు అంటే ఏంటి? 
వేసవి కాలంలో చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ‘కరెంట్ బిల్లు. ఒక సామాన్య మధ్య తరగతి ఇంట్లో కనీసం మూడు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి. ఇవి రోజంతా తిరుగుతూ ఉండటం వల్ల బిల్లు మోత మోగుతుంది. ఈ సమస్యకు పరిష్కారమే BLDC (Brushless Direct Current) టెక్నాలజీ.

Advertisement

సాధారణ ఫ్యాన్లలో ‘ఇండక్షన్ మోటార్’ ఉంటుంది. ఇది కరెంట్‌ను వృధా చేయడమే కాకుండా ఘర్షణ వల్ల వేడెక్కుతుంది. కానీ BLDC ఫ్యాన్లలో బ్రష్‌లు ఉండవు. ఇవి పర్మనెంట్ మాగ్నెట్స్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ద్వారా పనిచేస్తాయి. దీని వల్ల విద్యుత్ నష్టం చాలా తక్కువగా ఉంటుంది.

ఎందుకు వీటికి డిమాండ్ పెరుగుతోంది?
అద్భుతమైన కరెంట్ ఆదా :
సాధారణ ఫ్యాన్ సుమారు 75-80 వాట్ల విద్యుత్ తీసుకుంటే.. BLDC ఫ్యాన్ కేవలం 28-35 వాట్లతోనే అంతే వేగంగా తిరుగుతుంది. అంటే సగం కంటే తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. సంవత్సరానికి ఒక ఫ్యాన్ మీద మీరు కనీసం రూ.1,500 నుంచి కూ. 2,000 వరకు ఆదా చేయవచ్చు.

Advertisement

రిమోట్ కంట్రోల్ & స్మార్ట్ ఫీచర్స్:
యూత్ ఎప్పుడూ సౌకర్యాన్ని కోరుకుంటారు. రెగ్యులేటర్లు తిప్పే పని లేకుండా. ఈ ఫ్యాన్లు రిమోట్‌తో వస్తాయి. బెడ్ మీద పడుకునే స్పీడ్ మార్చుకోవచ్చు, టైమర్ సెట్ చేయవచ్చు. కొన్ని హై-ఎండ్ మోడల్స్ అయితే మొబైల్ యాప్ లేదా అలెక్సా తో కూడా పనిచేస్తాయి.

తక్కువ శబ్దం:
చదువుకునేటప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు ఫ్యాన్ చేసే ‘కిర్ కిర్’ శబ్దం చాలా విసుగు కలిగిస్తుంది. BLDC ఫ్యాన్లు చాలా సైలెంట్‌గా తిరుగుతాయి. వీటి మోటార్ వేడెక్కదు. కాబట్టి లైఫ్ కూడా ఎక్కువే.

ఇన్వర్టర్‌తోనూ ఎక్కువ సేపు తిరుగుతాయి:
పవర్ కట్ అయినప్పుడు మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే.. సాధారణ ఫ్యాన్ కంటే BLDC ఫ్యాన్ మూడు రెట్లు ఎక్కువ సేపు బ్యాకప్ ఇస్తుంది. ఎందుకంటే.. ఇది చాలా తక్కువ వాటేజ్ తీసుకుంటుంది.

Also Read: కూలర్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ 6 టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

వోల్టేజ్ సమస్యలు ఉండవు:
తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు సాధారణ ఫ్యాన్లు స్లో అవుతాయి. కానీ BLDC ఫ్యాన్లు 140V నుంచి 280V వరకు స్థిరమైన వేగంతో తిరుగుతాయి.

కొనే ముందు గమనించాల్సినవి:
BLDC ఫ్యాన్ ధర సాధారణ ఫ్యాన్ కంటే కొంచెం ఎక్కువగా (రూ.2,500 – రూ.4,500 మధ్య) ఉంటుంది. కానీ ఒక ఏడాదిలోనే మీరు ఆదా చేసే కరెంట్ బిల్లు ద్వారా ఆ అదనపు ఖర్చు వెనక్కి వచ్చేస్తుంది.

పర్యావరణాన్ని కాపాడాలన్నా.. జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా BLDC ఫ్యాన్లకు మారడం ఒక తెలివైన నిర్ణయం. ఈ వేసవిలో మీ పాత ఫ్యాన్లను మార్చి.. స్మార్ట్ టెక్నాలజీతో  ఇల్లు చల్లబరచుకోండి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×