// // Mobile Selling Tips: పాత ఫోన్ అమ్ముతున్నారా ? జాగ్రత్త -->
E-Paper
Advertisement

Mobile Selling Tips: ఫోన్ అమ్మే ముందు 4 స్టెప్స్ ఫాలో అయితే.. డేటా సేఫ్, ధర కూడా బెస్ట్

Mobile Selling Tips: ఫోన్ అమ్మే ముందు 4 స్టెప్స్ ఫాలో అయితే.. డేటా సేఫ్, ధర కూడా బెస్ట్
Advertisement

Mobile Selling Tips: స్మార్ట్‌ ఫోన్‌ను అమ్మే ముందు చాలామంది తొందరలో నిర్ణయం తీసుకుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీ పర్సనల్ డేటా సురక్షితంగా ఉండటంతో పాటు, ఫోన్‌కు మంచి ధర కూడా దక్కుతుంది. చాలా మందికి ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు, అకౌంట్ వివరాలు, మెసేజ్‌ల వంటివి ఎంత విలువైనవో పూర్తిగా తెలియదు. కాబట్టి ఫోన్ అమ్మడానికి ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మీరు సులభంగా పాటించగలిగే 4 ముఖ్యమైన విషయాలను గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇవి మీ డేటాను సురక్షితంగా ఉంచడమే కాకుండా.. కొన్న వారికి కూడా మంచి అనుభూతిని అందిస్తాయి.

డేటా బ్యాకప్ తీసుకోవడం:
మీ ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు, మెసేల వంటి వాటిని అమ్మడానికి ముందుగానే సేవ్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. ఒకసారి ఫోన్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత.. ఈ డేటాను తిరిగి పొందడం కష్టం అవుతుంది. అందుకే మీరు వేరే ఫోన్‌లోకి లేదా లేదా పెన్ డ్రైవ్ లోకి పూర్తి డేటా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకాలు, అవసరమైన వివరాలు కోల్పోకుండా ఉంటారు.

Advertisement

అకౌంట్స్ లాగ్ అవుట్:
ఫోన్‌లో మీరు ఉపయోగించిన అన్ని అకౌంట్స్ లాగ్ అవుట్ చేయాలి. ముఖ్యంగా మెయిల్, సోషల్ మీడియాతో పాటు బ్యాంకింగ్ సేవల వంటి వాటి నుంచి బయటకు రావడం చాలా అవసరం. లేకపోతే ..మీ పర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఫోన్‌ను అమ్మే ముందు ఈ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలి. ఇది మీ భద్రత కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య.

ఫ్యాక్టరీ రీసెట్ :
ఫోన్‌లోని అన్ని సమాచారాన్ని పూర్తిగా తొలగించడానికి.. ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఇది ఫోన్‌ను కొత్తదిలా మారుస్తుంది. రీసెట్ చేసే ముందు మీ డేటా బ్యాకప్ తీసుకున్నారని మరో సారి చెక్ చేసుకోండి. రీసెట్ చేసిన తర్వాత ఫోన్‌లో ఎలాంటి పర్సనల్ డేటా మిగలదు. ఇది కొన్న వారికి కూడా నమ్మకం కలిగిస్తుంది.

Advertisement

ఫోన్ శుభ్రపరచడం:
ఫోన్ బయట భాగాన్ని శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. స్క్రీన్, కవర్, కెమెరా వంటి భాగాలను శుభ్రంగా ఉంచాలి. అలాగే ఫోన్ సరిగ్గా పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేయాలి. అంతే కాకుండా చిన్న లోపాలు ఉంటే ముందుగానే చెప్పడం మంచిది. శుభ్రంగా ఉన్న ఫోన్‌కు మంచి ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: పిల్లల కోసం తప్పకుండా కొనాల్సిన వాచ్..సేఫ్టీ, చదువు, ఫన్ అన్నీ ఒక్క వాచ్‌లోనే!

ఇలా ఈ నాలుగు ముఖ్యమైన టిప్స్ పాటిస్తే మాత్రం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ డబ్బులు వచ్చేలాగా అమ్మగలుగుతారు. అంతే కాకుండా ఇలా చేయడం ద్వారా మీ డేటా రక్షితంగా ఉండటమే కాకుండా.. కొన్న వారికి కూడా మంచి అనుభవం కలుగుతుంది. కాబట్టి అమ్మకానికి ముందు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×