E-Paper
Advertisement

అసలేంటీ ‘స్టార్ రేటింగ్’ కథ? కరెంటు బిల్లుకు దానికి లింకేంటి? తప్పక తెలుసుకోవాల్సిందే!

అసలేంటీ ‘స్టార్ రేటింగ్’ కథ? కరెంటు బిల్లుకు దానికి లింకేంటి? తప్పక తెలుసుకోవాల్సిందే!
Advertisement

BEE Star Rating: ఎండలు ముదిరినా, చలి పెరిగినా ఈ రోజుల్లో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ లు, గీజర్లు తప్పనిసరిగా ఆన్ చేయాల్సిందే. అయితే నెలాఖరుకు వచ్చే సరికి.. కరెంటు బిల్లు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయని చాలా మంది వాపోతుంటారు. బిల్లు వాచిపోతోందంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు. అయితే విద్యుత్ భారం తగ్గాలంటే ఎనర్జీ స్టార్ రేటింగ్ మెరుగ్గా ఉన్నది తీసుకోవాలని చాలా మంది సూచిస్తుంటారు. అసలు ఈ స్టార్స్ కథేంటి? వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టార్ రేటింగ్ అంటే ఏంటి?

భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సంస్థ.. హోమ్ అప్లయన్సెస్‌కు ఈ స్టార్ రేటింగ్స్‌ను ఇస్తుంది. ఒక పరికరం ఎంత తక్కువ విద్యుత్‌ను వాడుకుని.. ఎంత ఎక్కువ పనితీరును చూపిస్తుందో ఈ రేటింగ్స్ తెలియజేస్తాయి. ఇందులో 1 స్టార్ నుండి 5 స్టార్స్ వరకు రేటింగ్ ఉంటుంది. స్టార్స్ పెరిగే కొద్దీ విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుందని అర్థం.

3 స్టార్ vs 5 స్టార్

Advertisement

ప్రస్తుత వేసవి నేపథ్యంలో ఏసీ కొనేవారిని ఓ కన్ఫ్యూజన్ వెంటూడుతూ ఉంటుంది. 3 స్టార్ కొనాలా? 5 స్టార్ ఏసీని ఇంటికి పట్టుకెళ్లాలా? అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే 3 స్టార్ ఏసీ ధర కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ 5 స్టార్‌తో పోలిస్తే విద్యుత్ వినియోగం కాస్త ఎక్కువ. రోజుకు 3-4 గంటలు మాత్రమే వాడేవారికి 3 స్టార్ సరిగ్గా సరిపోతుంది. అదే 5 స్టార్ విషయానికి వస్తే.. ధర ఎక్కువైనా, కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది. రోజుకు 8 నుండి 10 గంటలు ఏసీ వాడేవారికి 5 స్టార్ ఏసీయే బెస్ట్ ఛాయిస్. ఇది లాంగ్ రన్‌లో డబ్బును ఆదా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫ్రిడ్జ్ విషయానికి వస్తే..

సాధారణంగా ఫ్రిడ్జ్ లను 24 గంటలూ ఆన్ లోనే ఉంచుతారు. కాబట్టి దీనికి స్టార్ రేటింగ్ చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తాయి కాబట్టి.. ఇవి పాత మోడల్స్ లేదా తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ ‌లతో పోలిస్తే దాదాపు 30% నుండి 40% వరకు కరెంట్ బిల్లును ఆదా చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: వైభ‌వ్ త‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టి..సానుభూతి పేరుతో మ‌ళ్లీ డ్రామాలు, సిరాజ్ పై ట్రోల్స్‌

వాషింగ్ మిషన్, గీజర్లు

వాషింగ్ మిషన్లకు వస్తే ఈ రేటింగ్ వ్యవస్థ విద్యుత్ ఆదాతో పాటు నీటి పొదుపును సైతం సూచిస్తుంటాయి. ఇక గీజర్ల విషయానికొస్తే.. 5-స్టార్ గీజర్లు నీటిని త్వరగా వేడి చేయడమే కాకుండా ఎక్కువ సేపు వేడిని నిలిపి ఉంచి పవర్ వేస్టేజ్ ను అరికడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ స్టార్ రేటింగ్స్ ప్రతీ 1-2 ఏళ్లకు ఒకసారి బీఈఈ అప్డేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువును కొనేటప్పుడు స్టార్ స్టిక్కర్ లేబుల్ ఏ ఏడాదికి సంబంధించింతో తప్పకుండా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రైతు డిస్కం ఏర్పాటుపై ఉత్కంఠ.. సీఎం రేవంత్ వ్యూహం నెగ్గేనా..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×