E-Paper
Advertisement

Battery Induction Stove: బ్యాటరీతో పనిచేసే ఇండెక్షన్ స్టవ్.. జస్ట్ రీఛార్జ్ చేస్తే చాలట, ఎక్కడైనా వండేసుకోవచ్చు!

Battery Induction Stove: బ్యాటరీతో పనిచేసే ఇండెక్షన్ స్టవ్.. జస్ట్ రీఛార్జ్ చేస్తే చాలట, ఎక్కడైనా వండేసుకోవచ్చు!
Advertisement

Battery Induction Stove: సాధారణంగా ఇండక్షన్ స్టవ్ అంటేనే కరెంటుతో ముడిపడి ఉన్న వ్యవహారం. సిటీల్లో పర్లేదు కానీ, పల్లెటూర్లలోనో లేదా సడన్‌గా పవర్ కట్ అయినప్పుడో ఇండక్షన్ మీద వంట చేయడం అసాధ్యం. కానీ, ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. కరెంటు లేకపోయినా కూడా హాయిగా వంట చేసుకునేలా ‘బ్యాటరీ పవర్డ్ ఇండక్షన్ స్టవ్‌లు’ మార్కెట్లోకి వస్తున్నాయి. ‘కాపర్’, ‘ఇంపల్స్ ల్యాబ్స్’ వంటి కంపెనీలు ఈ క్రేజీ ఐడియాతో ముందుకొచ్చాయి. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? వీటి స్పెషాలిటీ ఏంటో ఓసారి చూద్దాం.

ఫోన్ ప్లగ్ ఉంటే చాలు:

ఈ స్టవ్‌ల కోసం వంటగదిలో ప్రత్యేకంగా ఏ మార్పులూ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే 120 వోల్ట్ సాకెట్ ఉంటే సరిపోతుంది. అంత తక్కువ వోల్టేజ్‌తో వంట అవుతుందా? అని మీకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు కిటుకు. ఈ స్టవ్‌లోనే ఒక బ్యాటరీ ఉంటుంది. మీరు వంట చేయనప్పుడు అది నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. ఇక మీరు వంట మొదలుపెట్టగానే, ఆ బ్యాటరీ నుండి కావాల్సిన హై వోల్టేజ్ పవర్ అందుతుంది. దీనివల్ల గోడలు పగలగొట్టి కొత్త వైరింగ్ వేయించే తలనెప్పి తప్పుతుంది.

Advertisement

Also Read: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!

ధరతో పాటు లాభాలూ ఎక్కువే:

నిజం చెప్పాలంటే.. ఈ స్టవ్‌ల ధర దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుంది. అమ్మ బాబోయ్! అనిపించినా.. అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వ సబ్సిడీలు ఉండటం వల్ల ధర కొంత తగ్గుతుంది. దీనివల్ల అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఊర్లలో పవర్ కట్ అయినప్పుడు కూడా హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయితే చాలు.. కనీసం నాలుగైదు పూటల వంటకు ఏ ఢోకా ఉండదని కంపెనీలు భరోసా ఇస్తున్నాయి.

రుచి అమోఘం:

Advertisement

గ్యాస్ స్టవ్‌ల నుండి వచ్చే పొగ వల్ల పిల్లల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని ఈ మధ్య చాలామంది భయపడుతున్నారు. కానీ ఈ బ్యాటరీ ఇండక్షన్ స్టవ్‌లతో ఆ భయం ఉండదు. మంట ఉండదు కాబట్టి.. వంటగది చల్లగా ఉంటుంది. ఇక రుచి విషయానికి వస్తే.. గ్యాస్ మీద వండినంత రుచి రాదేమో అని అస్సలు అనుకోవద్దు. ఇందులో వంట చాలా ఫాస్ట్‌గా అవ్వడమే కాదు, రుచి కూడా అదిరిపోతుందని ఇప్పటికే వాడుతున్న వారు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇవి అమెరికా మార్కెట్లో మాత్రమే ఉన్నప్పటికీ, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే వంటింటి రూపురేఖలు మార్చడం మాత్రం ఖాయం. ఈ స్టవ్ పర్యావరణానికి మేలు చేయడంతో పాటు వంట పనిని ఇంత ఈజీగా మార్చేస్తుంది.

Also Read: వావ్.. సోలార్‌ పవర్‌తో పనిచేసే ఈ స్టవ్ గురించి మీకు తెలుసా?

ముఖ్య గమనిక:

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి గ్యాడ్జెట్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసుకొనేందుకు లింక్స్ కూడా ఇస్తున్నారు. అయితే, మీరు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ లింక్స్, వాళ్లు చూపించే వీడియోలు ఫేక్ కూడా కావచ్చు. ఈ కథనం ముఖ్య ఉద్దేశం.. పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఆయా సంస్థలతో బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి.. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని మనవి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×