E-Paper
Advertisement

బార్‌కోడ్ vs క్యూఆర్ కోడ్.. రెండింటికి తేడా ఏంటి? ఏది ఎక్కువ పవర్‌ఫుల్?

బార్‌కోడ్ vs క్యూఆర్ కోడ్.. రెండింటికి తేడా ఏంటి? ఏది ఎక్కువ పవర్‌ఫుల్?
Advertisement

Barcode vs QR Code: సూపర్ మార్కెట్‌లో వస్తువులు కొన్నప్పుడు వాటిని బిల్లింగ్ కౌంటర్ సిబ్బంది ఒక యంత్రంతో స్కాన్ చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే టీ కొట్టు, రెస్టారెంట్‌లో ఫోన్ తీసి డబ్బులు చెల్లించడానికి ఇంకో రకమైన కోడ్‌ను మనమంతా స్కాన్ చేస్తుంటాం. మొదటిది ‘బార్‌కోడ్’ (Barcode) అయితే.. రెండవది ‘క్యూఆర్ కోడ్’ (QR Code). డిజిటల్ యుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే చూడటానికి ఈ రెండు స్కాన్ చేసే కోడ్‌ల లాగే అనిపించినా.. వీటి పనితీరులో, సాంకేతికతలో చాలా వ్యత్యాసం ఉంది. ఆ తేడాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

బార్‌కోడ్ అంటే ఏంటి?

బార్‌కోడ్ అనేది వన్-డైమెన్షనల్ (1D) టెక్నాలజీ. ఇందులో నలుపు రంగులో ఉండే నిలువు గీతలు.. వాటి మధ్య ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ గీతల మందం, వాటి మధ్య ఉన్న దూరాన్ని బట్టి సమాచారం నిల్వ అవుతుంది. అయితే ఇది కేవలం అక్షరాలు, సంఖ్యలను (Alphanumeric) మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దీని సామర్థ్యం సుమారు 20 నుండి 25 క్యారెక్టర్లు మాత్రమే. దీన్ని చదవడానికి లేజర్ బార్‌కోడ్ స్కానర్ తప్పనిసరి. కోడ్‌లోని గీతలకు అడ్డంగా స్కాన్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందొచ్చు. సాధారణంగా రిటైల్ షాపుల్లో వస్తువుల వివరాలు, ధరలు తెలుసుకోవడానికి.. కొరియర్ ట్రాకింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు.

మరి క్యూఆర్ కోడ్ సంగతేంటి?

Advertisement

క్యూఆర్ కోడ్ అనేది టూ-డైమెన్షనల్ (2D) టెక్నాలజీ. ఇందులో నిలువు, అడ్డం రెండు వైపులా సమాచారాన్ని స్టోర్ చేస్తారు. ఇది నలుచదరపు చుక్కలు, గడుల రూపంలో ఒక బాక్స్‌లో స్టోర్ చేయబడతాయి. బార్‌కోడ్‌తో పోలిస్తే క్యూఆర్ కోడ్ వందల రెట్లు ఎక్కువ డేటాను నిల్వ చేసుకోవచ్చు. సుమారు 7,000 కు పైగా సంఖ్యలు లేదా 4,000 పైగా అక్షరాలను ఇది స్టోర్ చేసుకోగలదు. వెబ్‌సైట్ లింకులు, కాంటాక్ట్ వివరాలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇందులో దాచవచ్చు. కాగా దీనిని స్మార్ట్ ఫోన్ ను కెమెరాను ఉపయోగించి.. 360 డిగ్రీల కోణంలో ఏటు నుంచైనా స్కాన్ చేయవచ్చు. డిజిటల్ పేమెంట్స్ (UPI), వెబ్‌సైట్ రీడైరెక్షన్, టికెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్స్ మొదలైన వాటిలో దీనిని ఉపయోగిస్తుంటారు.

Also Read: రీల్స్ చేసేవాళ్లకి పండగే.. సినిమా రేంజ్ వీడియోలు తీసే.. టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ఫైనల్గా చెప్పేది ఏంటంటే?

Advertisement

బార్‌కోడ్ అనేది కేవలం ఒక వస్తువుకు సంబంధించిన ప్రాథమిక గుర్తింపు సంఖ్య లాంటిది. కానీ క్యూఆర్ కోడ్ అనేది సమాచార నిధి లాంటిది. ఫాస్ట్ స్కానింగ్, ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉండటం వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యూఆర్ కోడ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే సూపర్ మార్కెట్ బిల్లింగ్ లాంటి సాధారణ అవసరాలకు బార్‌కోడ్ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుండటం విశేషం.

Also Read: ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×