E-Paper
Advertisement

Air Coolers: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

Air Coolers: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
Advertisement

Air Coolers under Rs 10,000: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణుకుపుడుతోంది. పోనీ ఇంట్లో ఉండే ఫ్యాన్ అయినా చల్లగా గాలి వీస్తుందా? అంటే అదీ లేదు. ఫ్యాన్ వేసినా.. వేడి గాలే.

Advertisement

అయితే అలాంటి సమయంలో శరీరానికి చల్ల చల్లగా గాలి తగిలితే ఎలా ఉంటుంది. హమ్మయ్య.. అంటూ ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది. అలాంటి వస్తువు కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

చాలా మంది ఇలాంటి సమయంలోనే తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఎయిర్ కూలర్‌లను కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ఎప్పుడెప్పుడు కూలర్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయా అంటూ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.

Advertisement

READ MORE: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఎయిర్ కూలర్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి కూలర్‌లను కొనుక్కోవాలనుకునే వారు అమెజాన్‌లో కేవలం రూ.10 వేలలోపు ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు.

బజాజ్ DMH 65 నియో 65L డీసెట్ ఎయిర్ కూలర్ (Bajaj DMH 65 Neo 65L Desert Air Cooler):

బజాజ్‌ డిఎమ్‌హెచ్ డెసర్ట్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో మంచి ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.14,390 ఉండగా.. ఇప్పుడు 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,289కి సొంతం చేసుకోవచ్చు.

ఇది టర్బో ఫ్యాన్ టెక్నాలజీతో కూడిన 65లీ కూలర్. అంతేకాకుండా ఇది యాంటీ బాక్టీరియల్ హెక్సాకూల్ కూలింగ్, 90 అడుగుల ఎయిర్ త్రో సపోర్టును కలిగి ఉంటుంది. ఇది పరికరంలోని నాబ్‌ల సహాయంతో సర్దుబాటు చేయగల 3-స్పీడ్ సెట్టింగ్‌లను కలిగి ఉంది.

READ MORE: ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే..!

సింఫనీ డెసర్ట్ కూలర్ (Symphony Desert Cooler):

అమెజాన్‌లో సింఫనీ డెసర్ట్ కూలర్ ధర రూ.11,999గా ఉంది. అయితే ఇప్పుడు తాజా డిస్కౌంట్ కింద 21 శాతం తగ్గింపు అందిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ కూలర్‌ను రూ.9,491లకే కొనుక్కోవచ్చు. ఇది 70-లీటర్ల కూలర్. ఈ ఎయిర్ కూలర్‌లో డ్రైన్ ప్లగ్, ఓవర్‌ఫ్లో అవుట్‌లెట్, నాబ్ కంట్రోల్, క్యాస్టర్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 16-అంగుళాల రస్ట్‌ప్రూఫ్ ఫ్యాన్, 3-స్పీడ్ సెట్టింగ్‌లను కలిగి ఉంది.

క్రాంప్టన్ ఓజోన్ డెసర్ట్ ఎయిర్ కూలర్ విత్ ఎవర్లాస్ట్ పంప్ అండ్ ఆటోఫిల్‌ (Crompton Ozone Desert Air Cooler):

క్రాంప్టన్ ఓజోన్ డెసర్ట్ ఎయిర్ కూలర్ లిస్టెడ్ ధర రూ.17,200గా కంపెనీ నిర్ణయించింది. అయితే అమెజాన్‌లో ఈ ధరపై దాదాపు 41 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు ధరతో ఇప్పుడు ఈ కూలర్‌ని రూ.10,199కి కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. కాగా రూ.10,000 లోపు తుది ధరను తీసుకుంటే అదనంగా రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

READ MORE: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!

ఇది 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్ టెక్నాలజీతో కూడిన 75-లీటర్ కూలర్. ఇది ఎవర్లాస్ట్ పంప్, ఆటో ఫుల్ సపోర్ట్‌తో వస్తుంది. ఎయిర్ కూలర్ వడపోత కోసం అధిక-సాంద్రత తేనెగూడు ప్యాడ్‌లను కలిగి ఉంది. ఇది నీటి స్థాయిని తెలియజేయడం, స్పీడ్ కంట్రోల్ కోసం రెండు నాబ్‌లను కలిగి ఉన్న కంట్రోల్ ప్యానెల్‌తో వస్తుంది. ఎయిర్ కూలర్‌కి 1-సంవత్సరం వారంటీ ఉంది.

అందువల్ల రూ.10000 లోపు కూలర్‌లను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×