E-Paper
Advertisement

3 different DNAs:- ముగ్గురు డీఎన్ఏలు కలిపి బిడ్డకు జననం…

3 different DNAs:- ముగ్గురు డీఎన్ఏలు కలిపి బిడ్డకు జననం…
Advertisement

3 different DNAs:- ఒకప్పుడు పిల్లలు పుట్టనివారికి టెక్నాలజీ పెద్దగా సాయం చేసేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ లాంటివి కమర్షియల్ కూడా అయిపోయాయి. సరోగసీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాంటి పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా మరెన్నో టెక్నాలజీలను ఈ విషయంలో అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక కొత్త ప్రయోగం మెక్సికోలో జరిగింది.

Advertisement

తల్లిదండ్రులకు ఏవైనా జెనటిక్ సమస్యలు ఉంటే.. అవి పిల్లలకు కూడా సోకే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఒక్కొక్కసారి జెనటిక్ సమస్యల వల్ల పిల్లలకు సోకే వ్యాధులు తీవ్ర ప్రభావాన్నే చూపిస్తాయి. అందుకే భవిష్యత్తులో అలాంటి సమస్యలు ఉండకుండా ఉండడం కోసం మెక్సికో శాస్త్రవేత్తలు ముగ్గురు డీఎన్ఏలను కలిపి ఒక బిడ్డకు ప్రాణం పోశారు. ఆ బిడ్డకు ఎప్పటికీ జెనటిక్ వ్యాధులు ఏమీ సోకవని శాస్త్రవేత్తలు మాటిస్తున్నారు. అయితే ఇలాంటి బిడ్డను పుట్టించడం మెక్సికోలో ఇదేమీ మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా పలుమార్లు ఇలా జరిగిందని వారు చెప్తున్నారు. కానీ వారి వివరాలు మాత్రం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతామని అన్నారు.

జెనటిక్ డిఫెక్ట్స్ వల్ల డైస్ట్రోఫీ, ఎపిలెప్సీ, గుండె సమస్యలు లాంటి వ్యాధులు అటాక్ అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెక్సికోలో దాదాపు 200 పిల్లల్లో ఒకరు మైటోకోండ్రియల్ సమస్యలతో జన్మిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. అందుకే కొత్త పద్ధతుల్లో బిడ్డలకు జన్మినవ్వడం ద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా మైటోకోండ్రియా అనేది సరిగా లేకపోవడం బిడ్డకు జన్మనివ్వడంలో పెద్ద సమస్యగా మారుతుందని అన్నారు.

Advertisement

అందుకే మైటోకోండ్రియల్ వ్యాధుల కోసం ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవారు ఆరోగ్యంగా ఉన్న వారి మైటోకోండ్రియాను దానం చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. ఇదే విధంగా ఆ డోనర్ డీఎన్ఏ కూడా పిల్లల్లో కలవడంతో బిడ్డ పూర్తిగా మూడు డీఎన్ఏలు కలిపి జన్మించినట్టుగా ఉంటుంది. అప్పుడే పుట్టే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గించడం కోసం ఇలాంటి మరెన్నో ప్రయోగాలు చేయడానికి తాము సిద్ధమని మెక్సికో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×