E-Paper
Advertisement

Avocado:- అవకాడోలను ఎక్కువకాలం తాజాగా ఉంచగలిగే సైన్స్..

Avocado:- అవకాడోలను ఎక్కువకాలం తాజాగా ఉంచగలిగే సైన్స్..
Advertisement

Avocado:- మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ తింటే మంచిది అని చాలామంది వైద్యులు సలహా ఇస్తుంటారు. సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనిషి ఆరోగ్యంతో పాటు బలంగా కూడా ఉపయోగపడతాయంటారు. అయితే కొన్ని ఫ్రూట్స్ మాత్రం చాలా కొద్దిరోజుల్లోనే పాడయిపోతుంటాయి. అలాంటి వాటిలో అవకాడో ఒకటి. అవకాడో అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ తక్కువ సమయంలోనే పాడయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి సైన్స్ సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అవకాడోను టోస్ట్‌లో వేసుకొని తిన్నా, సాలడ్‌లాగా తయారు చేసుకున్నా.. ఎలా చేసిన రుచిగానే ఉంటాయి అంటారు ఫ్రూట్ లవర్స్. కానీ ఇవి కొద్ది సమయంలోనే గ్రీన్ కలర్ నుండి బ్రౌన్ కలర్‌కు మారిపోతాయి. తాజాగా వీటిని ఎక్కువకాలం తాజాగా ఉంచడం కోసం శాస్త్రవేత్తలు కొత్త సైన్స్‌ను కనిపెట్టారు. ఇమేజింగ్ టెక్నాలజీతో ఇది సాధ్యమని తెలిపారు. ముందుగా అవకాడోలు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చాలామంది దానిని గట్టిగా పిండుతారు. కొంచెం మెత్తగా అనిపిస్తే అవకాడో తాజాగా ఉందని అర్థం.

Advertisement

అవకాడోను పండించే రైతులు కూడా ఏ పండ్లు అయితే ఎక్కువకాలం తాజాగా ఉండగలుగుతాయో వాటిని మాత్రమే స్టోర్స్‌కు పంపిస్తారు. అలా వారు అంచనా వేసి పంపిన పండ్లు కూడా ఒక్కొక్కసారి తొందరగా పాడయిపోతాయి. అందుకే 1 మెథిల్ సైక్లోప్రోపేన్ లాంటి కాంపౌండ్స్‌ను ఉపయోగించి అవకాడోలు తొందరగా పాడయిపోకుండా శాస్త్రవేత్తలు కాపాడుకుంటూ వస్తున్నారు. తాజాగా షెల్‌ఫిష్ అస్థిపంజరం నుండి తయారు చేసే ఒక కెమికల్ అవకాడోల మీద అప్లై చేయడం వల్ల అవి ఎక్కువకాలం తాజాగా ఉంటాయని గుర్తించారు.

అవకాడోలను ఎక్కువకాలం తాజాగా ఉంచడానికి 1 మెథిల్ సైక్లోప్రోపేన్ (1 ఎమ్సీపీ) మెరుగ్గా పనిచేస్తుందా లేదా షెల్‌ఫిష్ కెమికల్ మెరుగ్గా పనిచేస్తుందా అన్న విషయంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టేశారు. ఈ రెండు పద్ధుతుల్లో అవకాడోలను 12 రోజులపాటు పరీక్షించారు. ప్రస్తుతం షెల్‌ఫిష్ కోటింగ్ అంటే చిటోసన్ కోటింగ్ అనేది అవకాడోలపై అంత మెరుగ్గా పనిచేయడం లేదని గమనించారు. కానీ భవిష్యత్తులో ఈ కోటింగ్‌ను మరింత మెరుగుపరిచి అవకాడోలు మాత్రమే కాకుండా ఇతర పండ్లు కూడా ఎక్కువకాలం పాటు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తామని శాస్త్రవేత్తలు మాటిచ్చారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×