// // Automatic Cooking Machine: వంట చేయడమే కాదు.. ప్లేట్‌లోకి కూడా ఇదే వడ్డిస్తుందట! -->
E-Paper
Advertisement

Automatic Cooking Machine: వంట మనిషి అక్కర్లేదు, వడ్డించనవసరం లేదు.. అంతా ఈ మెషీన్ చూసుకుంటుంది!

Automatic Cooking Machine: వంట మనిషి అక్కర్లేదు, వడ్డించనవసరం లేదు.. అంతా ఈ మెషీన్ చూసుకుంటుంది!
Advertisement

Automatic Cooking Machine: ఇంట్లో నలుగురు ఉన్నారంటేనే.. పొద్దున్నే లేచి వంట చేయడం ఆడవాళ్లకు పెద్ద టాస్క్ అయిపోతుంది. అలాంటిది రోజూ వందల మంది వచ్చే హోటళ్లు, క్యాంటీన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహింకుంటేనే భయమేస్తుంది కదా. ఎప్పుడూ ఒకే రుచి రావాలి, ఆర్డర్ ఇవ్వగానే వేడివేడిగా వడ్డించాలి, పైగా బాగా టేస్టీగా వండే చెఫ్‌లు దొరకడం గగనమైపోతోంది. ఇలాంటి టెన్షన్లన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ‘ఆటోమేటిక్ కుకింగ్ మెషీన్’ మార్కెట్లోకి వచ్చేసింది. ఇది వంట చేయడమే కాదు.. వండటం అయిపోగానే గిన్నెలోకి కూడా అదే వంచేస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మెషీన్ ఏం వండగలదు?

మనం రోజూ తినే రకరకాల వంటలను ఇది ఇట్టే చేసేస్తుంది. ముఖ్యంగా హోటళ్లలో ఫేమస్ అయిన ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి చైనీస్ వంటకాలకు ఇది బెస్ట్ ఆప్షన్. అంతేకాదు.. చికెన్ కర్రీలు, పప్పులు, సాంబార్ వంటివి కూడా దీనిలో వండుకోవచ్చు. ఇక గంటల తరబడి గరిటెతో తిప్పాల్సిన అవసరం ఉన్న గ్రేవీలు, సాస్‌ల గురించి అయితే అసలు చింతే లేదు.. ఈ మెషీనే వాటిని పర్ఫెక్ట్‌గా ఉడికిస్తుంది.

వాడటం ఎంత ఈజీ అంటే..

Advertisement

ఈ మెషీన్‌ను ఆపరేట్ చేయడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. మీరు ఎగ్ టమోటా కర్రీ చేయాలనుకుంటే.. ముందే కూరగాయలు కోసి పెట్టుకోవాలి. మెషీన్‌లో ఉండే డిస్‌ప్లేలో ఏ వంటకు ఎంత వేడి ఉండాలో సెట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసి బటన్ నొక్కగానే మెషీన్ తిరుగుతూ వేడెక్కుతుంది. మనం ఉల్లిపాయలు ఎప్పుడు వేయాలి, మసాలాలు ఎప్పుడు వేయాలో ఈ మిషీనే వాయిస్ ద్వారా మనకు గుర్తు చేస్తుంది. వంట పూర్తయ్యాక, ఆ బాండీ దానంతట అదే వంగి ఆహారాన్ని ప్లేట్‌లోకి వడ్డించేస్తుంది.

Also Read: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!

దీనివల్ల లాభాలేంటి?

Advertisement

ఈ మెషీన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే.. రుచి అస్సలు మారదు. వంట మనుషులు మారినా, మీరు సెట్ చేసిన పద్ధతిలోనే వంట జరుగుతుంది కాబట్టి.. కస్టమర్లకు ఎప్పుడూ ఒకే టేస్ట్ దొరుకుతుంది. అలాగే మంట దగ్గర నిలబడి చెమటలు కక్కుతూ గరిటె తిప్పే పని ఉండదు. ఒక్క మనిషి ఒకేసారి మూడు నాలుగు మెషీన్లను ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల పనివాళ్లు తక్కువ ఉన్నా పని స్పీడ్‌గా అవుతుంది. పైగా నాన్‌స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది. చిన్న చిన్న హోటళ్ల కంటే పెద్ద రెస్టారెంట్లు, ఐటీ కంపెనీ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ ఆటోమేటిక్ మిషీన్ చాలా ఉపయోగకరం.

ధరెంత, ఎక్కడ కొనాలి?

ఈ మెషీన్ ధర అనేది దాని సైజు, ఫీచర్లను బట్టి మారుతుంటుంది. చిన్న హోటళ్లకు సరిపోయే 5 నుండి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న మెషీన్లు సుమారు రూ.50000 నుండి రూ.1,50,000 వరకు ఉంటాయి. అదే వందల మందికి వండాల్సిన పెద్ద పెద్ద కమర్షియల్ మెషీన్లు అయితే రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల పైనే ఉండొచ్చు. ఇక వీటిని ఎక్కడ కొనాలి అంటే.. ఇండియా మార్ట్ వంటి వెబ్‌సైట్లలో ఉంటాయి. అక్కడ మీరు నేరుగా తయారీదారులతో మాట్లాడి డెమో కూడా అడగొచ్చు. అంతేకాదు, హైదరాబాద్‌లోని కుకట్‌పల్లి,  నాంపల్లి వంటి ఏరియాల్లో ఉండే కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ డీలర్ల దగ్గర వీటిని స్వయంగా చూసి కొనుక్కోవచ్చు.

Also Read: సోలార్‌తో ఇండక్షన్ స్టవ్ నడపాలంటే ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×