E-Paper
Advertisement

Rogue meteor in sky: నేలరాలిన అందమైన తోకచుక్క.. ఫోటోలు వైరల్.

Rogue meteor in sky: నేలరాలిన అందమైన తోకచుక్క.. ఫోటోలు వైరల్.
Advertisement

Rogue meteor in sky: అప్పుడప్పుడు అంతరిక్షంలో జరిగే కొన్ని వింతలు మనకు భూమిపై నుండి చూస్తే కనిపిస్తాయి. అసలు అది ఏంటి అని అర్థం కాకపోయినా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి తోకచుక్క. తోకచుక్కను చూస్తే అదృష్టమని, దానిని చూసి ఏది కోరుకున్నా జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో ఎవరూ నిర్ధారించకపోయినా.. చూడడానికి మాత్రం తోకచుక్క అనేది చాలా అందంగా ఉంటుంది. అలాంటిదే తాజాగా ఆస్ట్రేలియాలో కనిపించింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండర్స్‌లో అందమైన తోకచుక్క ఆకాశంలో మెరిసింది. ఇప్పటివరకు ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడలేదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రకాశవంతమైన ఫైర్‌బాల్ లాగా కనిపించిందని వారు చెప్తున్నారు. ఇది కనిపించింది కొద్ది క్షణాలే అయినా చూడడానికి చాలా అందంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా ఇది ఆకాశం నుండి నేలకు తాకినప్పుడు తెలుపు, ఆరెంజ్ మిక్స్ అయిన కలర్‌లో కనిపించిందని చూసినవారు చెప్తున్నారు. ఆపై అది నేలపై ఎక్కడో క్రాష్ అయిందని వారు భావిస్తున్నారు.

Advertisement

ఆ అద్భుతాన్ని ఆస్ట్రేలియా ప్రజలు రాత్రి 9.22 గంటలకు చూశారు. క్వీన్స్‌ల్యాండ్స్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కేవలం ఒక ప్రకాశవంతమైన లైట్‌ను మాత్రమే చూసినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా క్వీన్స్‌ల్యాండ్స్‌లో ఉన్న ప్రజలు ఈ తోకచుక్కను చూడగానే వెంటనే తమ ఫోన్స్‌లో బంధించారు. కొందరు వారు తీసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. కొంతమంది మాత్రం ఇది చాలా అందంగా ఉంది కానీ అసలు ఏంటిది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు.

ఈ తోకచుక్క ఎక్కడ ల్యాండ్ అయ్యిందని తెలుసుకునే విషయంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఇది క్రోయ్‌డాన్ అనే ప్రాంతంలో పడినట్టుగా వారు భావిస్తున్నారు. క్రోయ్‌డాన్‌లో నివసించే ప్రజలు తమకు ఒక పెద్ద శబ్దం వినపడిందని, ఒక్కసారిగా తమ ఇళ్లులు కూడా వణికాయని చెప్పడంతో అక్కడే ఆ తోకచుక్క పడి ఉంటుందని శాస్త్రవేత్తలు సందేహిస్తున్నారు. కేవలం క్షణాల్లో మాయమయిన ఈ అందమైన తోకచుక్కను చూసే అదృష్టం కొంతమందికే కలిగిందని చూడనివారు సోషల్ మీడియాలో వాపోతున్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×