E-Paper
Advertisement

Drinking Water From Air: గాలి నుంచి డ్రింకింగ్ వాటర్.. ఈ సరికొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?

Drinking Water From Air: గాలి నుంచి డ్రింకింగ్ వాటర్.. ఈ సరికొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

చైనీస్ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. గాలి నుంచి తాగు నీరు తయారు చేసే అట్మాస్ఫెరిక్ వాటర్ జెనరేటర్ ను రూపొందించారు. గాలిలోని తేమను ఆకర్షించి, డ్రింకింగ్ వాటర్‌గా మార్చే అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. షాంఘైలోని జియావో టోంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ మిషన్ ను తయారు చేశారు. దీనికి అట్మాస్ వెల్ అనే పేరు పెట్టారు. ఇది కండెన్సేషన్, డెసికెంట్ పద్దతుల ద్వారా గాలి నుంచి నీటిని తయారు చేస్తుంది. తక్కువ తేమ, వేడి ప్రాంతాలలో ఉపయోగించడానికి వీలుగా దీనిని రూపొందించారు.

రోజుకు 50 లీటర్ల మంచి నీళ్లు

అట్మాస్‌ వెల్ అని పిలిచే ఈ పరికరం సోలార్ ప్యానెల్స్ మీద ఆధారపడి పని చేస్తుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ గా పని చేస్తుంది. 15 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు 35 నుంచి 99 శాతం వరకు తేమ ఉన్న పరిస్థితులలో ఈ పరికరం సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పరికరం రోజుకు 50 లీటర్ల వరకు తాగునీటిని తయారు చేస్తుంది.ఇది చూడ్డానికి చిన్న బస్ షెల్టర్ లా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 1.6 వేల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన పెద్ద ప్లాట్‌ ఫారమ్‌ ను తయారు చేశారు. ఈ పరికరం మారుమూల ప్రాంతాలలో ఉపయోగించేందుకు అనుగుణంగా రూపొందించారు.

ఈ మిషన్ ఎలా పని చేస్తుందంటే?

Advertisement

⦿ గాలిని ఆకర్షించడం: ఈ పరికరంలోని యూనిట్ లో ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ చుట్టూ ఉన్న గాలిని లోపలికి లాక్కుంటుంది.

⦿ కూలింగ్ & కండెన్సేషన్: గాలిని ఎవపరేటర్ కాయిల్స్ మీదుగా పంపిస్తారు. ఇక్కడ రిఫ్రిజరేట్ ఉపయోగించి గాలి ఉష్ణోగ్రతను డ్యూ పాయింట్ కంటే తక్కువ చేస్తారు. తేమ తగ్గి ఐసులా మారుతుంది. దానిని కలెక్టర్‌ లోకి పంపిస్తారు. ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది.

Advertisement

Read Also: చంద్రుడి వద్దకు మీ పేరు పంపాలా? జస్ట్ ఇలా చేయండి చాలు!

⦿ డెసికెంట్ మెథడ్: గాలిని ఉప్పు, జియోలైట్ లాంటి డెసికెంట్ మెటీరియల్ మీదుగా పంపిస్తారు. ఇది తేమను గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత, హీట్  ఉపయోగించి డెసికెంట్‌ ను హీట్ చేస్తారు. వాటర్ వేపర్ విడుదలై ఆవిరిగా మారుతుంది. ఆవిరిని కండెన్సేషన్ చేసి నీటిగా మారుస్తారు. ఇది తక్కువ హ్యూమిడిటీలో కూడా పని చేస్తుంది.

⦿ ప్యూరిఫికేషన్, స్టోరేజ్: సేకరించిన నీటిని UV లైట్, ఓజోన్, కార్బన్ ఫిల్టర్స్ ద్వారా శుద్ధం చేస్తారు. ఇది 99.8% డస్ట్, బాక్టీరియా, పొల్యూషన్ తొలగిస్తుంది. ఫైనల్ వాటర్ WHO స్టాండర్డ్స్ ప్రకారం డ్రింకబుల్ గా ఉంటాయి. చివరికి మినరల్స్ జోడించి టేస్టీగా మార్చుతారు. స్టోరేజ్ ట్యాంక్‌లో నిల్వ చేస్తారు. ఇది ఫ్రెష్‌గా ఉంచడానికి స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది.

Read Also: సరికొత్త AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలిబాబా.. దిమ్మతిరిగే ఫీచర్స్, వర్త్ వర్మ వర్తు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×