E-Paper
Advertisement

యాపిల్ మ్యాక్‌బుక్‌లకు గట్టి పోటీ.. ఒక్క ఛార్జ్‌తో 22 గంటల బ్యాటరీ!

యాపిల్ మ్యాక్‌బుక్‌లకు గట్టి పోటీ.. ఒక్క ఛార్జ్‌తో 22 గంటల బ్యాటరీ!
Advertisement

Asus Zenbook A14 : టెక్ ప్రపంచంలో అల్ట్రాబుక్స్ అనగానే.. మనకు గుర్తొచ్చేది స్లిమ్ డిజైన్, మంచి బ్యాటరీ లైఫ్. అయితే.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎక్కడో చిన్న కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. కానీ.. సరి కొత్త Asus Zenbook A14 ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ లాప్‌టాప్, ఎవరూ ఊహించని రేంజ్‌లో పర్ఫార్మెన్స్ ట్విస్ట్ ఇచ్చింది. బ్యాటరీ లైఫ్, స్పీడ్ విషయంలో యాపిల్ మ్యాక్‌బుక్‌లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ క్రేజీ లాప్‌టాప్ ఫుల్ రివ్యూ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Asus Zenbook A14 ఫీచర్ల వివరాలు:

Advertisement

అసస్ జెన్‌బుక్ సిరీస్ ఎప్పుడూ డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. అయితే, ఈ మోడల్‌లో ఇంటెల్ లేదా ఏఎమ్‌డీ కాకుండా క్వాల్కమ్ కంపెనీకి చెందిన ‘Snapdragon X2 Elite’ చిప్‌సెట్ వాడడం ఈ లాప్‌టాప్‌కే హైలైట్‌గా నిలిచింది.

డిజైన్ ,డిస్‌ప్లే :
ఇది ఎప్పటి లాగే సూపర్ స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కేవలం 1.2 kg బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆఫీస్ లేదా ట్రావెలింగ్‌లో క్యారీ చేయడం చాలా ఈజీ.

Advertisement

డిస్‌ప్లే: ఇందులో 14-ఇంచుల 3డిస్‌ప్లేను అందించారు. కలర్స్ ఎంత వైబ్రంట్‌గా ఉంటాయంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసినా లేదా వీడియో ఎడిటింగ్ చేసినా విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.

ఊహించని పర్ఫార్మెన్స్ ట్విస్ట్ :
ఈ లాప్‌టాప్ అసలు సిసలైన పవర్ హౌస్. సాధారణంగా మొబైల్ ప్రొడక్టివిటీ చిప్స్ హెవీ సాఫ్ట్‌వేర్లను రన్ చేయలేవనే టాక్ ఉంది. కానీ ఇందులో ఉన్న ప్రాసెసర్.. ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, హెవీ కోడింగ్ సాఫ్ట్‌వేర్లను కూడా చాలా స్మూత్‌గా రన్ చేస్తోంది. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు లాప్‌టాప్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. పైగా.. ఇందులో సరికొత్త ఏఐ ఎన్పీయూ ఉండడం వల్ల విండోస్ కొపైలట్ ఫీచర్స్ మెరుపు వేగంతో పనిచేస్తాయి.

బ్యాటరీ లైఫ్:
స్నాప్‌డ్రాగన్ ఆర్కిటెక్చర్ వల్ల వచ్చిన అతిపెద్ద బెనిఫిట్ ఇది. నార్మల్ యూసేజ్‌లో.. ఈ లాప్‌టాప్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 20 నుంచి 22 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల ఆఫీస్ వర్క్‌కు ఛార్జర్ పట్టుకెళ్లాల్సిన అవసరమే లేదు. యాపిల్ సిలికాన్ చిప్స్‌కు విండోస్ ప్రపంచంలో దొరికిన పక్కా ఆల్టర్నేటివ్ ఇది.

థర్మల్స్, హీటింగ్ :
ఇంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా లాప్‌టాప్ అస్సలు వేడెక్కదు. దీని ఫ్యాన్ నాయిస్ కూడా చాలా తక్కువ. నిశ్శబ్ద వాతావరణంలో వర్క్ చేసుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

ధరల వివరాలు :
Asus Zenbook A14 స్నాప్‌డ్రాగన్ X2 ఎలైట్ వేరియంట్ ఇండియాలో వేర్వేరు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.

16GB RAM + 512GB SSD వేరియంట్ ధర: సుమారు రూ.1,14,999

32GB RAM + 1TB SSD ప్రీమియం వేరియంట్ ధర: సుమారు రూ.1,29,999

ప్లస్ & మైనస్ పాయింట్స్:
ప్లస్: క్రేజీ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన స్క్రీన్, లాగ్-ఫ్రీ ఏఐ పర్ఫార్మెన్స్.

మైనస్: కొన్ని పాత విండోస్ యాప్స్/గేమ్స్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ అవ్వాల్సి ఉంది.

మీరు బెస్ట్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ , ఫ్యూచరిస్టిక్ ఏఐ ఫీచర్స్ ఉన్న ప్రీమియం విండోస్ లాప్‌టాప్ కోసం చూస్తుంటే, Asus Zenbook A14 కచ్చితంగా మీ ఫస్ట్ ఛాయిస్ అవ్వాలి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×