E-Paper
Advertisement

ఆసస్ సరికొత్త క్రోమ్‌బుక్స్.. వారి కోసం బడ్జెట్‌లో గూగుల్ AI లాప్‌టాప్స్..

ఆసస్ సరికొత్త క్రోమ్‌బుక్స్.. వారి కోసం బడ్జెట్‌లో గూగుల్ AI లాప్‌టాప్స్..
Advertisement

ASUS AI Chromebooks: ప్రముఖ టెక్ బ్రాండ్ ఆసస్ (ASUS) భారత మార్కెట్లోకి ఒకేసారి మూడు సరికొత్త బడ్జెట్ క్రోమ్‌బుక్‌లను విడుదల చేసింది. విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ASUS Chromebook CM32 Detachable, CM14, మరియు CM15 మోడళ్లను తీసుకొచ్చింది. గూగుల్ AI సపోర్ట్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, గరిష్టంగా 20 గంటల వరకు వచ్చే మెరుగైన బ్యాటరీ లైఫ్ ఈ సరికొత్త క్రోమ్‌బుక్‌ల ప్రధాన ఆకర్షణ. వీటి ప్రారంభ ధర రూ. 26,990 గా నిర్ణయించారు.

Read also-టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Advertisement

ఈ లైనప్‌లో CM32 Detachable (ధర: రూ.37,990) అత్యంత ప్రీమియం మోడల్‌గా నిలిచింది. ఇది లాప్‌టాప్‌గానూ, కీబోర్డ్ విడదీసి టాబ్లెట్‌గానూ ఉపయోగపడే 2-ఇన్-1 డివైజ్. ఇందులో 12.1-ఇంచ్ 2.5K టచ్‌స్క్రీన్, మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. బాక్స్‌లోనే మాగ్నెటిక్ స్టాండ్, స్పిల్-రెసిస్టెంట్ డిటాచబుల్ కీబోర్డ్, వైర్‌లెస్‌గా ఛార్జ్ అయ్యే స్టైలస్ పెన్‌లను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

మరోవైపు, బడ్జెట్ శ్రేణిలో వచ్చిన CM14 (ధర: రూ.26,990) CM15 (ధర: రూ.28,990) మోడళ్లు తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఆశించే వారి కోసం డిజైన్ చేయబడ్డాయి. CM14 మోడల్ 14-ఇంచ్ స్క్రీన్‌తో రాగా, CM15 మోడల్ 15.6-ఇంచ్ పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. ఈ రెండింటిలోనూ మీడియాటెక్ కొంపానియో 540 చిప్‌సెట్, 8GB RAM లభించడమే కాకుండా.. ఏకంగా 20 గంటల అద్భుతమైన బ్యాటరీ లైఫ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Read also-ఫ్రిడ్జ్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే.. కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు రిఫ్రిజిరేటర్ లైఫ్ కూడా పెరుగుతుంది!

ఈ మూడు క్రోమ్‌బుక్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు 3 నెలల పాటు గూగుల్ వన్ AI ప్రీమియం ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా జెమిని (Gemini), నోట్‌బుక్ ఎల్‌ఎమ్ (NotebookLM) వంటి అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో పాటు 5TB క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ లభిస్తుంది. CM14, CM15 మోడళ్లు జూన్ 19 నుండి అమెజాన్, ఆసస్ ఇ-షాప్‌లలో విక్రయానికి రానున్నాయి. అలాగే CM32 మోడల్‌ను ప్రీ-బుక్ చేసుకునే వారికి రూ.11,418 విలువైన అదనపు వారంటీ, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, మౌస్‌లను కేవలం రూ.999 కే అందించే బంపర్ ఆఫర్‌ను ఆసస్ ప్రకటించింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×