E-Paper
Advertisement

AI Eye Test: మీ కళ్లు చూసి ‘బ్రెయిన్ స్ట్రోక్’ ముప్పును చెప్పేసే ఏఐ.. వైద్య రంగంలో సరికొత్త విప్లవం!

AI Eye Test: మీ కళ్లు చూసి ‘బ్రెయిన్ స్ట్రోక్’ ముప్పును చెప్పేసే ఏఐ.. వైద్య రంగంలో సరికొత్త విప్లవం!
Advertisement

AI Eye Test:  కళ్లు మన శరీరానికి కిటికీల వంటివి అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఆ మాటకు ఇప్పుడు సైన్స్ సరికొత్త అర్థాన్ని ఇస్తోంది. మన కళ్ల వెనుక దాగి ఉండే సన్నని రక్త నాళాలు.. మన మెదడు ఆరోగ్యం గురించి ఎన్నో రహస్యాలను దాచి ఉంచుతాయని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. సాధారణంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’ అనేది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, అకస్మాత్తుగా వచ్చి మన జీవితాలను తలకిందులు చేసే ఒక భయంకరమైన పరిస్థితి. కానీ, ఇకపై ఆ భయం అక్కర్లేదు. కృత్రిమ మేధ(AI) పుణ్యమా అని, ఒక చిన్న కంటి పరీక్షతోనే భవిష్యత్తులో మీకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంత ఉందో ముందే పసిగట్టేయవచ్చు.

రెటీనా వెనుక దాగున్న ఆరోగ్యం..

నిజానికి మన కంటి వెనుక భాగంలో ఉండే రెటినాలోని రక్త నాళాల అమరిక, మన మెదడులోని రక్త నాళాలను చాలా వరకు పోలి ఉంటుంది. ఈ వింతైన పోలికనే శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు కీలకంగా మార్చుకున్నారు. యూకే బయోబ్యాంక్‌కు చెందిన సుమారు 45,000 మంది ఆరోగ్య డేటాను విశ్లేషించినప్పుడు, స్ట్రోక్ ముప్పు ఉన్నవారి కంటి నాళాల్లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు ఉన్నట్లు AI గుర్తించింది. మన కంటి రక్త నాళాల సాంద్రత తగ్గడం లేదా వాటి ఆకృతిలో వచ్చే చిన్న చిన్న మార్పులే.. భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి సంకేతాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వచ్చిన తొలి ఫోన్.. మోటొరోలా సిగ్నేచర్ ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేగ కళ్లు..

మన కళ్లతో చూడలేని అతి సూక్ష్మమైన మార్పులను కూడా AI Algorithms అత్యంత ఖచ్చితత్వంతో కనిపెట్టేస్తన్నాయి. సాధారణంగా రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పరీక్షలు స్ట్రోక్ ముప్పును ఎంత ఖచ్చితంగా చెబుతాయో, అంతే కచ్చితత్వంతో ఈ ఏఐ కంటి పరీక్ష కూడా మంచి ఫలితాలను ఇస్తోంది. దీనివల్ల ఖరీదైన స్కాన్లు, కష్టమైన పరీక్షలు అవసరం లేకుండానే.. ప్రారంభ దశలోనే ముప్పును పసిగట్టి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న పక్షవాతం వంటి సమస్యలకు.. ఈ టెక్నాలజీ గొప్ప వరమనే చెప్పాలి.

ప్రాణాలను నిలిపే నేత్రాలు..

Advertisement

ఈ సరికొత్త ఆవిష్కరణ కేవలం బ్రెయిన్‌స్ట్రోక్‌ను పసిగట్టడానికి మాత్రమే కాదు. భవిష్యత్తులో కేవలం కంటి పరీక్ష ద్వారా గుండె జబ్బులు, మతిమరుపు వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యలను కూడా ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది. సాంకేతికత, వైద్య విజ్ఞానం కలిస్తే మనిషి ఆయుష్షును ఎంతగా పెంచవచ్చో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. కళ్లు కేవలం లోకాన్ని చూడటానికే కాదు.. మన ప్రాణాలను నిలుపుకోవడానికి కూడా కీలకమని ఈ టెక్నాలజీ నిరూపిస్తోంది.

Also Read: ఇకపై మీరే న్యాయనిర్ణేతలు.. నెట్‌ఫ్లిక్స్ లైవ్ ఓటింగ్ వచ్చేసింది.. ఇక ఆ షోలో ఏం జరగాలో మీ చేతుల్లోనే!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×