E-Paper
Advertisement

Apple Watch Series 11 Price Drop: కొత్త ఏడాది బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఒక్కసారిగా పడిపోయిన యాపిల్ వాచ్‌ల ధరలు!

Apple Watch Series 11 Price Drop: కొత్త ఏడాది బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఒక్కసారిగా పడిపోయిన యాపిల్ వాచ్‌ల ధరలు!
Advertisement

Apple Watch Series 11: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ వాచెస్ కొనడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఉండే డ్రీమ్. ఎందుకంటే.. అమెరికా దిగ్గజమైన యాపిల్ బ్రాండ్స్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ స్మార్ట్‌వాచ్ యూజర్లకు తీపి కబురు చెప్పింది.

అది కూడా గతేడాది విడుదలైన యాపిల్ వాచ్ సిరీస్ 11పై ధర తగ్గించడం అంటే మామూలు విషయం కాదు. అయితే భారతదేశంలో రిపడ్లిక్ డే సేల్‌కు ముందే ఈ డీల్స్‌ను ప్రకటించినట్లు సంస్థ తెలిపింది. ఇంతకీ యాపిల్ వాచ్ 11పై ఎంత మేరకు ధర తగ్గించారో తెలుసుకుందామా..

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. వన్‌ప్లస్ నార్డ్ 6తో పాటు టర్బో 6 సిరీస్ విడుదల!

2025లో విడుదలైన Apple Watch Series 11 అసలు ధర ధర రూ.46,999. అయితే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సిరీస్‌ను రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. కంపెనీ తగ్గించిన ధరతో పాటు బ్యాంక్ ఆఫర్లతో మరింత ధర తగ్గింపును కూడా పొందవచ్చు. యాపిల్ వాచ్ సిరీస్ 11 గత ఏడాది భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.

Advertisement

ఈ వాచ్‌ కొత్త ఫీచర్లు, మెరుగైన సెన్సార్లను యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ వాచ్ మెరుగైన ఆరోగ్య ట్రాకింగ్‌ను కూడా కలిగి ఉండటంతో.. అధిక రక్తపోటు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నుంచి మనల్ని కాపాడేలా నిరంతరం పర్యవేక్షించగలదు. అలాగే యాపిల్ సిరీస్11.. ట్రాన్స్‌లేషన్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది.

యాపిల్ వాచ్ సిరీస్ 11 బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే దీనిలో 18 గంటల సాధారణ ట్రాకింగ్, 6 గంటల స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు ఉంటాయని పేర్కొంది.

యాపిల్ వాచ్ సిరీస్ 11 కోసం watchOS 26 తీసుకొచ్చింది. ఈ కొత్త వాచ్ యూజర్స్ కోసం అనేక కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది. ఆపిల్ వాచ్ అనగానే చాలా మందికి అది ఒక డ్రీమ్ గాడ్జెట్‌లా ఉంటుంది. అలాంటి వాచ్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.

Also Read: బడ్జెట్‌లోనే వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో రెడ్‌మి సౌండ్‌బార్ 2 ప్రో.. ధర, ఆధునిక ఫీచర్ల వివరాలివే!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×