E-Paper
Advertisement

iPhone 17e: రంగంలోకి లో-కాస్ట్ యాపిల్ ప్రొడక్ట్స్.. ధర, ఫీచర్లు తెలిస్తే యూజర్లకు పిచ్చెక్కిపోద్ది!

iPhone 17e: రంగంలోకి లో-కాస్ట్ యాపిల్ ప్రొడక్ట్స్.. ధర, ఫీచర్లు తెలిస్తే యూజర్లకు పిచ్చెక్కిపోద్ది!
Advertisement

iPhone 17e: యాపిల్ లవర్స్‌కి కీలక అప్డేట్. ఈ బ్రాండ్ నుంచి రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఎంట్రీ-లెవల్ గ్యాడ్జెట్లను మార్కెట్లోకి దింపడానికి సన్నాహలు జరుగుతోంది. యాపిల్ నుంచి ఫస్ట్ టైం సరసమైన మ్యాక్‌బుక్, A-సిరీస్ చిప్‌తో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది(2026) ప్రారంభంలో ఈ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా ఐఫోన్ 17e, ఐఫోన్ 16e ఫోన్లను పరిచయం చేయనున్నట్లు, అదికూడా అత్యంత సరసమైన ధరలకే ఈ మోడల్‌ను తీసుకొస్తుంది. దీంతో పాటు యాపిల్ నుంచి 12వ జనరేషన్ ఐప్యాడ్‌ కూడా విడుదల కానుంది. ఇది A18 చిప్‌పై పనిచేస్తుందని సమాచారం.

ఎప్పుడు రావొచ్చు?

2026 ప్రారంభంలో యాపిల్ నుంచి దాని ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లైనప్‌లలో కొత్త ఎంట్రీ-లెవల్ మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 17e వచ్చే ఏడాది(2026) వసంతకాలంలో 12వ తరం ఐప్యాడ్, కొత్త ఎంట్రీ-లెవల్ మ్యాక్‌బుక్‌తో పాటు విడుదల అవ్వచ్చని భావిస్తున్నారు.

Advertisement

Read Also: మైండ్ బ్లోయింగ్ మావా.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్!

మ్యాక్‌బుక్‌ A18 Pro:

వచ్చే ఏడాది రాబోయే ఎంట్రీ-లెవల్ మ్యాక్‌బుక్‌ A18 Proని ఉపయోగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీనిని మొదట ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల కోసం రూపొందించారు. ఈ మ్యాక్‌బుక్‌ డిస్‌ప్లే 13-అంగుళాలు ఉండి, సిల్వర్, పింక్, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ మ్యాక్‌బుక్‌ ధర సుమారు రూ.62వేల నుంచి రూ. 80వేల మధ్య ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ తన కొత్త బడ్జెట్ మ్యాక్‌బుక్‌ ధరను తక్కువగా ఉంచడానికి పాత డిజైన్, డిస్‌ప్లే భాగాలను ఉపయోగించవచ్చు. ఇది 8GB RAM, ఒక USB టైప్-C పోర్ట్‌‌తో మాత్రమే రావచ్చని చెబుతున్నారు.

పెద్ద మార్పులేం ఉండవు:

Advertisement

ఈ ఐఫోన్ 17e యాపిల్ A19 చిప్‌లో వస్తుంది. దీనికి 18-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,యాపిల్ C1 మోడెమ్‌ను అమర్చారు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ప్రధాన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండనుంది. ఇది ఐఫోన్ SE లైనప్‌ను భర్తీ చేస్తుంది. 12వ జనరేషన్ ఐప్యాడ్ A18 చిప్‌పై నడుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫస్ట్ టైం ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌కు యాపిల్ ఇంటెలిజెన్స్ మద్దతును జోడిస్తుంది. కొత్త మోడల్ దాని ముందు మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అంటే.. వినియోగదారులు ఎలాంటి డిజైన్ మార్పులను ఆశించకూడదన్నమాట.

Read Also: అబ్బా ఏముంది హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్.. 14.2 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలతో లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×