E-Paper
Advertisement

సామాన్యులు సైతం కొనగలిగే ధరకే Apple Smart Glasses.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

సామాన్యులు సైతం కొనగలిగే ధరకే Apple Smart Glasses.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
Advertisement

Apple Smart Glasses: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ త్వరలోనే సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. మెటా కంపెనీకి చెందిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు పోటీగా యాపిల్ వీటిని డిజైన్ చేస్తోంది. గత పదేళ్లలో యాపిల్ వాచ్ ఎలాగైతే సూపర్ హిట్ అయ్యిందో.. ఈ స్మార్ట్ గ్లాసెస్ కూడా భవిష్యత్తులో అంతటి గుర్తింపు తెచ్చుకుంటాయని కంపెనీ భావిస్తోంది.

కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం:

నిజానికి యాపిల్ ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను వచ్చే ఏడాది (2027) ప్రారంభంలోనే మార్కెట్లోకి తేవాలని అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది చివర్లో ఈ గ్లాసెస్ వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. యాపిల్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు N50 అనే కోడ్‌ నేమ్‌ పెట్టి రహస్యంగా పనులు జరుపుతోంది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

Advertisement

యాపిల్ తమ ఎకోసిస్టమ్‌తో పాటు సరికొత్త Siri వాయిస్ అసిస్టెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ఈ గ్లాసెస్‌లో జోడించనుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ వేర్వేరు ఫ్రేమ్ స్టైల్స్, ఆకర్షణీయమైన రంగుల్లో రానున్నాయి. వీటిలో ప్రత్యేకమైన కెమెరా హార్డ్‌వేర్ కూడా ఉండబోతోంది. సాధారణ కళ్లద్దాల స్థానంలో వీటిని సులువుగా వాడేలా యాపిల్ ప్లాన్ చేస్తోంది.

Also Read: Google Pixel 10a ధర భారీగా పెంపు.. కానీ ఈ ఒక్క ట్రిక్‌తో పాత ధరకే సొంతం చేసుకోవచ్చు!

బడ్జెట్ ధరలోనే లభ్యం:

Advertisement

ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా సుమారు రూ.16,000 నుంచి రూ.41,000 మధ్య ఉంచాలని యాపిల్ చూస్తోంది. మార్కెట్లో ఇప్పటికే శాంసంగ్, మెటా వంటి బ్రాండ్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. యాపిల్ తమ బ్రాండ్ ఇమేజ్‌తో ఐవేర్ మార్కెట్‌ను శాసించాలని భావిస్తోంది.

విజన్ ఎయిర్ రాకకు మరికొన్నేళ్లు:

స్మార్ట్ గ్లాసెస్‌తో పాటు యాపిల్ తనమ ‘విజన్ ప్రో’ హెడ్‌సెట్‌కు తదుపరి వెర్షన్‌గా ‘విజన్ ఎయిర్’పై కూడా పనిచేస్తోంది. ప్రస్తుత విజన్ ప్రో బరువు ఎక్కువగా ఉండటం, ధర భారీగా ఉండటంతో చాలామంది దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ లోపాలను సరిదిద్ది, తక్కువ బరువుతో, తక్కువ ధరకే విజన్ ఎయిర్‌ను తీసుకురానున్నారు. అయితే ఇది మార్కెట్లోకి రావడానికి 2028 చివరి వరకు లేదా 2029 వరకు సమయం పట్టొచ్చు.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 19 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి అద్భుతమైన AI ల్యాప్‌టాప్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×