E-Paper
Advertisement

Apple iOS 27 Updates: యాపిల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఇక ఐఫోన్ వాడకం పూర్తిగా మారనుంది!

Apple iOS 27 Updates: యాపిల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఇక ఐఫోన్ వాడకం పూర్తిగా మారనుంది!
Advertisement

Apple iOS 27 Updates: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం తమ సొంత టెక్నాలజీ, పరిమితంగా ChatGPT సేవలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన యాపిల్.. రాబోయే iOS 27 అప్‌డేట్‌తో సిరి రూపురేఖలను పూర్తిగా మార్చేయనుంది. గూగుల్ జెమిని, క్లాడ్ వంటి ప్రముఖ ఏఐ అసిస్టెంట్లను నేరుగా సిరి ద్వారానే వాడుకునే వెసులుబాటును కల్పించబోతున్నట్లు సమాచారం.

సరికొత్తగా సిరి ఎక్స్‌టెన్షన్స్:

ప్రముఖ టెక్ విశ్లేషకుల అందించిన సమాచారం ప్రకారం.. ‘యాపిల్ ఎక్స్‌టెన్షన్స్’ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీనివల్ల మనం యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునే ఏఐ అసిస్టెంట్లను నేరుగా సిరికి అనుసంధానించవచ్చు. అంటే.. మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అది సిరి ద్వారా సమాధానం రావాలా లేక జెమిని లేదా క్లాడ్ ద్వారా రావాలా అనేది మనమే సెట్టింగ్స్‌లో నిర్ణయించుకోవచ్చు. దీనికోసం ఐఫోన్ సెట్టింగ్స్‌లో ఒక ప్రత్యేకమైన మెనూను కూడా తీసుకురాబోతున్నారు.

Advertisement

Also Read: ఓరినాయనో.. 100 ఇంచుల భారీ 4K టీవీ ఇంత తక్కువ ధరలోనా?

మారనున్న పనితీరు:

ప్రస్తుతానికి సిరిని ఏదైనా అడగాలంటే ChatGPTని అడుగు అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది. కానీ ఈ కొత్త అప్‌డేట్ తర్వాత ఆ అవసరం ఉండదు. వినియోగదారులు తమకు నచ్చిన ఏఐ సర్వీస్‌ను డిఫాల్ట్‌గా సెట్ చేసుకుంటే, సిరి ఆటోమేటిక్‌గా ఆ సేవలను ఉపయోగించుకుని వేగంగా సమాధానాలు ఇస్తుంది. అలాగే ఏఐ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా యాపిల్‌కు కూడా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

సిరి కోసం ప్రత్యేక యాప్:

Advertisement

కేవలం ఫీచర్ల మార్పు మాత్రమే కాకుండా.. సిరి కోసం సొంత (Standalone) యాప్‌ను కూడా యాపిల్ అభివృద్ధి చేస్తోంది. ఇది చూడటానికి ఇప్పుడు మనం వాడుతున్న ఛాట్ బాట్ల లాగే ఒక చాట్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. దీనిలో పాత సంభాషణలను చూసుకోవడం, వాటిని పిన్ చేసుకోవడం, ఫొటోలు లేదా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి వాటి గురించి విశ్లేషించమని అడగటం వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉండబోతున్నాయి. వాయిస్‌తో పాటు టెక్స్ట్ మోడ్‌లో కూడా దీనిని వాడుకోవచ్చు.

వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా:

యాపిల్ తమ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత పటిష్టం చేస్తూ.. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుతూనే వారికి అవసరమైన సందర్భోచిత సమాధానాలు ఇచ్చేలా సిరిని తీర్చిదిద్దుతోంది. మన దైనందిన జీవితంలో సిరి ఒక అంతర్భాగంగా మారేలా ఈ కొత్త మార్పులు ఉండబోతున్నాయి. మొత్తానికి సిలికాన్ వ్యాలీలోని ఇతర దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా యాపిల్ తమ వ్యూహాలను మారుస్తోంది.

Also Read: ఇండక్షన్ కంటే తోపు.. గ్యాస్ కంటే చౌక.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్టవ్‌ గురించి తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×