E-Paper
Advertisement

Apple OLED MacBook Pro: టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ వచ్చేస్తోంది.. యాపిల్ యూజర్ల కల నెరవేరబోతున్నట్టేనా?

Apple OLED MacBook Pro: టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ వచ్చేస్తోంది.. యాపిల్ యూజర్ల కల నెరవేరబోతున్నట్టేనా?
Advertisement

Apple OLED MacBook Pro: సాధారణంగా యాపిల్ బ్రాండ్ నుంచి కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే చాలు.. టెక్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఐఫోన్లలో ఉండే కొన్ని ఫీచర్లు మ్యాక్‌బుక్‌లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి యాపిల్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు ఐఫోన్లకే పరిమితం అనుకున్న డైనమిక్ ఐలాండ్, టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు త్వరలోనే MacBook Proలోనూ ఉండనున్నాయి.

ఓఎల్ఈడీ డిస్‌ప్లే:

ప్రస్తుతం మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌లో యాపిల్ మినీ ఎల్ఈడీ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తోంది. అయితే, 2026 మోడల్‌లో తొలిసారిగా OLED టెక్నాలజీని తీసుకురానున్నారు. దీంతో కలర్స్ మరింత క్లారిటీగా, క్వాలిటీగా కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్ పర్ఫెక్షన్‌తో పాటు కాంట్రాస్ట్ రేషియో అద్భుతంగా ఉంటుంది. 14 ఇంచ్, 16 ఇంచ్ వేరియంట్లలో ఈ కొత్త డిస్‌ప్లే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు డిజైన్ పరంగా ల్యాప్‌టాప్ మరింత స్లిమ్‌, స్టైలిష్‌గా మార్చేందుకు యాపిల్ కసరత్తు చేస్తోంది.

Advertisement

Also Read: మార్కెట్లోకి క్రేజీ గాడ్జెట్స్.. 6000mAh బ్యాటరీ పవర్‌ఫుల్ ఫోన్, రూ.699కే ఇయర్‌బడ్స్!

మ్యాక్‌బుక్‌లోకి డైనమిక్ ఐలాండ్:

ఐఫోన్లలో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఇకపై మ్యాక్‌బుక్ స్క్రీన్‌పై కూడా మెరవనుంది. ప్రస్తుతం ఉన్న పాత విధానం నాచ్ స్థానంలో చిన్న హోల్ పంచ్ కెమెరా సెటప్ రాబోతోంది. ఇది కేవలం కెమెరా కోసమే కాకుండా.. మనకు వచ్చే అలర్ట్స్, బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అయ్యే మ్యూజిక్ కంట్రోల్స్, ఇతర సిస్టమ్ నోటిఫికేషన్లను లైవ్‌లో చూపిస్తుంది. తద్వారా స్క్రీన్ స్పేస్ పెరగడమే కాకుండా.. యూజర్లకు మెరుగైన అనుభూతి లభిస్తుంది.

కీలక మార్పులు:

Advertisement

యాపిల్ తన మ్యాక్ కంప్యూటర్లలో టచ్‌స్క్రీన్ ఫీచర్‌ను పెట్టడానికి మొదటి నుంచే నిరాకరించింది. కానీ 2026 నుంచి ఈ పద్ధతిని మార్చాలనుకుంటోంది. కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్‌తో పాటు డైరెక్ట్‌గా స్క్రీన్‌ను టచ్ చేయడం వల్ల కూడా ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేయొచ్చు. దీనికి తగ్గట్టుగానే macOSలో కూడా కంపెనీ భారీ మార్పులు చేయనుంది. టచ్ చేసినప్పుడు బటన్లు సులభంగా క్లిక్ అయ్యేలా వాటి సైజును పెంచడం, పించ్ టు జూమ్ వంటి ఫీచర్లను మెరుగుపరచడం లాంటివి దీనిలో ఉంటాయని సమాచారం.

త్వరలో అందుబాటులోకి:

ఈ కొత్త మోడల్స్‌లో యాపిల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన M6 Pro, M6 Max చిప్‌లను ఉపయోగించనున్నారు. ఇవి ల్యాప్‌టాప్ స్పీడ్‌ను పెంచడానికి సహాయపడతాయి. ప్రొఫెషనల్ ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ మ్యాక్‌బుక్ ప్రో కేవలం ల్యాప్‌టాప్‌లా కాకుండా, యాపిల్ టెక్నాలజీకి ఓ నిదర్శనంలా నిలవనుంది.

Also Read: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి కొత్త బడ్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×