E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. అదిరిపోయే డిజైన్‌తో ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్, ఆ 11 రంగుల ప్రత్యేకత ఏమిటంటే?

యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. అదిరిపోయే డిజైన్‌తో ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్, ఆ 11 రంగుల ప్రత్యేకత ఏమిటంటే?
Advertisement

Apple Pride Edition 2026: ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా యాపిల్ తమ ‘ప్రైడ్ కలెక్షన్’ను మార్కెట్లోకి తెచ్చింది. ఎల్జీబీటీక్యూ+ (LGBTQ+) కమ్యూనిటీకి మద్దతుగా నిలుస్తూ.. ఆ రంగుల విలువలని చాటిచెప్పేలా సరికొత్త స్పోర్ట్ లూప్ బ్యాండ్, అదిరిపోయే వాచ్ ఫేస్, ఐఫోన్, ఐప్యాడ్ కోసం వాల్‌పేపర్లను లాంచ్ చేసింది. కేవలం ప్రొడక్ట్స్ అమ్మడమే కాకుండా.. ఆ కమ్యూనిటీ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు యాపిల్ తన వంతుగా సాయం కూడా చేస్తోంది.

కలర్‌ఫుల్‌గా స్పోర్ట్ లూప్:

ఈ కొత్త ప్రైడ్ ఎడిషన్ స్పోర్ట్ లూప్ బ్యాండ్ చూస్తుంటేనే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. మొత్తం 11 రంగుల నైలాన్ దారాలతో దీనిని అల్లారు. ఒక రంగు నుంచి ఇంకో రంగులోకి షేడ్ మారుతున్న తీరు భలేగా ఉంది. ఇది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల మనుషుల అస్తిత్వానికి ప్రతీక అని యాపిల్ చెబుతోంది. చేతికి కట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉండేలా దీనిని తయారు చేశారు.

Advertisement

Also Read: 10x జూమ్, పిచ్చెక్కించే క్లారిటీ.. Huawei Mate 90 Pro Max కెమెరా సెటప్ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

వాచ్ ఫేస్ అద్భుతం:

ఈ కొత్త బ్యాండ్‌కు మ్యాచింగ్ ఉండేలా ‘ప్రైడ్ లూమినెన్స్’ అనే వాచ్ ఫేస్‌ను తీసుకొచ్చారు. దీనిలో రెండు రకాల స్టైల్స్ ఉన్నాయి. ఒకటి గడియారం ముళ్ల చుట్టూ కిరణాల్లా వచ్చే డిజైన్ అయితే.. రెండోది బ్యాండ్‌ మీద ఉన్న గీతల్లాగే నిలువుగా ఉండే డిజైన్. మనకు నచ్చిన రంగుల్లోకి దీన్ని మార్చుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇది యాపిల్ వాచ్ లుక్‌నే మార్చేస్తుంది.

ధర ఎంతంటే?

Advertisement

ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు కూడా ఈ థీమ్ వాల్‌పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (iOS 26.5)తో పాటు అందుబాటులోకి వస్తాయి. ఇక ధర విషయానికొస్తే.. ఇండియాలో ఈ ప్రైడ్ ఎడిషన్ స్పోర్ట్ లూప్ ధర రూ.4,500. ఇవి 40mm, 42mm, 46mm సైజుల్లో దొరుకుతాయి. యాపిల్ వెబ్‌సైట్‌లో లేదా స్టోర్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.

Also Read: 9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×