E-Paper
Advertisement

యాపిల్ నుంచి తొలి మడత ఫోన్.. ఐప్యాడ్ లాంటి లుక్, రూ.2 లక్షల ధరతో iPhone Ultra!

యాపిల్ నుంచి తొలి మడత ఫోన్.. ఐప్యాడ్ లాంటి లుక్, రూ.2 లక్షల ధరతో iPhone Ultra!
Advertisement

iPhone Ultra Foldable: ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. iPhone Ultra పేరుతో రాబోతున్న ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ ఒక డమ్మీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మార్కెట్లో ఉండే మిగతా మడత ఫోన్ల కంటే ఇది కాస్త వెడల్పుగా, చూడటానికి ఒక చిన్న బుక్ లాగా ఉంది. దీనిని పూర్తిగా విప్పినప్పుడు ఒక ఐప్యాడ్ లేదా టాబ్లెట్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

స్క్రీన్‌లో కీలక మార్పులు:

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ లోపలి స్క్రీన్ 7.8 ఇంచులు, బయటి స్క్రీన్ 5.5 ఇంచుల వరకు ఉండే అవకాశం ఉంది. యాపిల్ దీనిలో బెస్ట్ క్వాలిటీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను వాడుతోంది. దీనివల్ల స్క్రీన్ ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఎలాంటి గీతలు కనిపించవని టాక్. ఫోన్ వెనుక భాగంలో కెమెరాలను అడ్డంగా అమర్చారు. అలాగే ఇందులో మెయిన్ కెమెరాతో పాటు ఒక అల్ట్రా‌వైడ్ లెన్స్ కూడా ఉండనుంది. ఎప్పుడూ ఉండే ఫేస్ ఐడీకి బదులుగా, ఫోన్ పక్కన ఉండే పవర్ బటన్‌కే టచ్ ఐడీ (ఫింగర్‌ప్రింట్) ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: శాంసంగ్ నుంచి దిమ్మతిరిగేలా ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్‌కు ముందే లీకైన ఒరిజినల్ ఫొటోస్!

ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్:

ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కేవలం డిజైన్ పరంగానే కాకుండా.. పర్ఫార్మెన్స్ లోనూ దుమ్మురేపనుంది. దీనిలో యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఏ20 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 12GB RAM, ఏకంగా 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయట. టైప్-సి పోర్ట్, అదిరిపోయే స్పీకర్లు, అలాగే ఐఫోన్లలో ఉండే యాక్షన్ బటన్ కూడా ఈ ఫోన్ లో ఉండబోతున్నాయి. ఫోన్ ఎంత వాడినా వేడెక్కకుండా ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో సెట్ చేస్తున్నారట.

ధర ఎంత? ఎప్పుడు రావచ్చు?

Advertisement

యాపిల్ కంపెనీ ఈ ఫోన్ గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, సాంకేతిక సమస్యలను అధిగమించి సెప్టెంబర్ లో iPhone 18 సిరీస్‌తో పాటే దీనిని కూడా లాంచ్ చేయవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ బ్రాండ్ నుంచి వస్తున్న మొదటి మడత ఫోన్ కాబట్టి దీని ధర కూడా భారీగానే ఉండనుంది. ఇండియాలో దీని ధర సుమారు రూ.2 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: సామాన్యులు సైతం కొనగలిగే ధరకే Apple Smart Glasses.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×