E-Paper
Advertisement

iPhone 18 Pro లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, 12GB RAMతో ఊచకోత!

iPhone 18 Pro లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, 12GB RAMతో ఊచకోత!
Advertisement

iPhone 18 Pro Leaks: యాపిల్ ప్రియులు ఎగిరి గంతేసేలా ఒక సూపర్ అప్డేట్ అందింది. ఐఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐఫోన్ కొత్త సిరీస్ సందడి మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ సంస్థ తమ సరికొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. తాజాగా లీకైన సమాచారం ప్రకారం ఈసారి రాబోయే ఫోన్లలో డిజైన్ పరంగా, పనితీరులో చాలా పెద్ద మార్పులే ఉండబోతున్నాయని తెలుస్తోంది.

కొత్త లుక్.. చిన్నదైన డైనమిక్ ఐలాండ్:

ఈసారి iPhone 18 Pro మోడళ్లలో స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజ్ తగ్గబోతోంది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలను డిస్‌ప్లే లోపలికి అమర్చడం ద్వారా యాపిల్ ఈ మార్పు చేయనుంది. దీనివల్ల స్క్రీన్ మరింత అందంగా, పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే డిస్‌ప్లే పరిమాణంలో మార్పు లేకుండా ప్రో మోడల్ 6.3 ఇంచులు, ప్రో మాక్స్ 6.9 ఇంచులతో రానున్నాయి. ఇక కలర్స్ విషయానికొస్తే.. ఈసారి లైట్ బ్లూ, డార్క్ చెర్రీ, డార్క్ గ్రే రంగుల్లో ఇవి లభించే అవకాశం ఉంది.

అబ్బురపరిచే కెమెరా ఫీచర్లు:

Advertisement

ఐఫోన్ అంటేనే కెమెరాలకు పెట్టింది పేరు. ఈసారి iPhone 18 Pro సిరీస్‌లో కెమెరా విభాగాన్ని పూర్తిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ముఖ్యంగా మెయిన్ కెమెరాకు ‘వేరియబుల్ అపెర్చర్’ టెక్నాలజీని జోడించబోతున్నారు. దీనివల్ల వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో కూడా అద్భుతమైన ఫొటోలు, పోర్ట్రెయిట్స్ తీసుకోవచ్చు. దీంతోపాటు టెలిఫోటో లెన్స్ సామర్థ్యాన్ని కూడా పెంచనున్నారు. ఇక సెల్ఫీల కోసం ఏకంగా 24MP ఫ్రంట్ కెమెరాను అందించబోతున్నట్లు సమాచారం.

Also Read: ట్రెండ్‌ను మార్చేలా సోనీ కొత్త బ్రావియా టీవీలు లాంచ్.. జెమిని ఏఐ సపోర్ట్‌తో వావ్ అనిపించేలా ఫీచర్లు!

12GB ర్యామ్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

Advertisement

యాపిల్ తమ సరికొత్త A20 Pro చిప్‌సెట్‌తో ఈ ఫోన్లను తీసుకురానుంది. ఇది ఫోన్ వేగాన్ని పెంచడమే కాకుండా.. వేడెక్కకుండా చూసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు మరింత స్పీడ్‌గా పనిచేయడం కోసం దీనిలో ఏకంగా 12GB RAMను అందించనున్నారు. దీంతో మల్టీటాస్కింగ్ చాలా సులువుగా మారుతుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. టాప్ మోడళ్లలో 5000mAh బ్యాటరీని ఇవ్వబోతున్నారు, కాబట్టి ఛార్జింగ్ సమస్య ఉండదు.

లాంచ్ ఎప్పుడు ఉండవచ్చు?

ఎప్పటిలాగే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే యాపిల్ ఈ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ ఈవెంట్‌లోనే యాపిల్ తమ మొదటి ఫోల్డబుల్ (మడతబెట్టే) ఐఫోన్‌ను కూడా చూపిస్తుందని టాక్ నడుస్తోంది. అయితే సాధారణ iPhone 18 మోడళ్లు, iPhone 18 Air వంటివి మాత్రం వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు ఐఫోన్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: టెక్ ప్రపంచంలో సంచలనం.. 10 ఇంచుల భారీ డిస్‌ప్లేతో Rollable Phone తెస్తున్న శాంసంగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×