E-Paper
Advertisement

Apple iPhone 16: ఆపిల్ ఐఫోన్ 16.. ధర, ఫీచర్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

Apple iPhone 16: ఆపిల్ ఐఫోన్ 16.. ధర, ఫీచర్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
Advertisement

Apple iPhone 16 Expected price, Features And Colours:  ఆపిల్ మొబైల్ యూజర్లు అందరూ.. ఎదురుచూసే శుభఘడియలు అతి త్వరలోనే రానున్నాయి. సెప్టెంబర్ 9న ‘ఆపిల్ ఈవెంట్ 2024’లో తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ ను ఆపిల్ సంస్థ ఆవిష్కరించనుంది.

ఈ సందర్భంగా ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో , 16 మ్యాక్స్ మోడల్స్ వరుసగా విడుదల చేయనున్నారు.  వైవిధ్యమైన డిస్ ప్లే పరిమాణాలు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలు, గణనీయమైన కెమెరా,  శక్తివంతమైన కొత్త టెక్నాలజీతో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక వీటి ప్రారంభ ధర రూ.67,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇకపోతే రాబోయే డివైజ్లకు సంబంధించి.. కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికి ఐఫోన్ 16 ధర ,ఫీచర్లతో నెట్టిళ్లు కళకళలాడుతోంది.

Advertisement

యాపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే.. ఇది  6.1 అంగుళాల డిస్ ప్లేతో రానుండగా, ప్లస్ వేరియంట్ కొంచెం పెద్దగా అంటే 6.7 అంగుళాల డిస్ ప్లే తో రానుందని అంటున్నారు. ఇక ప్రో, మ్యాక్స్ వెర్షన్లలో వరుసగా 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల డిస్ ప్లే లు ఉండవచ్చునని చెబుతున్నారు. ఇకపోతే బ్యాటరీ పరిమాణాలు మోడళ్లను బట్టి మారుతూ ఉంటాయని భావిస్తున్నారు

ఇక రాబోయే ఐఫోన్లలో గణనీయమైన కెమెరా అప్ గ్రేడ్స్ రానున్నాయని భావిస్తున్నారు. ఆపిల్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం, కొత్త హ్యాండ్సెట్లు ప్రస్తుత హారిజాంటల్ కాన్ఫిగ్యురేషన్ బదులుగా నిలువుగా అలైన్ చేసిన కెమెరా మాడ్యూల్స్ తో రావచ్చునని చెబుతున్నారు.

Advertisement

కొత్త ఐఫోన్లలో ఎఫ్ / 1.6 కెపాసిటీతో కెమెరా ఉంటుందని, తీసే ఫొటోలు, వీడియో కానీ పాయింట్ అండ్ షూట్ ఏక్యురెసీని కలిగి ఉంటుందని అంటున్నారు. 2 ఎక్స్ టెలిఫోటో సామర్థ్యాలతో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించవచ్చని, సెకండరీ యూనిట్ ఎఫ్ / 2.2లో మాత్రం  అల్ట్రా-వైడ్ కెమెరా కావచ్చని నివేదిక పేర్కొంది.

Also Read:  ఉఫ్ ఉఫ్.. వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.23,000 డిస్కౌంట్.. హమ్మయ్య ఇప్పుడు కొనేయొచ్చు..!

ఇక ఐఫోన్ 16, 16 ప్లస్ మోడళ్ల విషయానికి వస్తే, ఇవి రెండు కూడా 128 జీబీ స్టోరేజ్ తో ఉంటాయి. ఇంక ప్రో, మ్యాక్స్ మోడళ్లు మాత్రం 256 జీబీ స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అన్నింటికన్నా మించి ఆపిల్ ఐఫోన్ 16 ధర ఎంత ఉంటుందంటే…
కొన్ని మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం  సుమారు రూ.67,000 (799 డాలర్లు) నుంచి ప్రారంభం కానుందని లెక్కలు వేస్తున్నాయి.
ఇక  ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.75,000 ( 899 డాలర్లు)
ఆపిల్ 16 ప్రో ధర రూ.92,300 (1,099 డాలర్లు)
ఆపిల్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,00,700 (1,199 డాలర్లు) ఉండవచ్చునని అంటున్నారు.

అయితే ఇవన్నీ మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారమే చెబుతున్నవి. సెప్టెంబర్ 9న ‘ఆపిల్ ఈవెంట్ 2024’లో అన్నీ తెలిసిపోతాయి. అంతవరకు కొంచెం ఓపిక పట్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×