E-Paper
Advertisement

విద్యార్థులుకు ‘యాపిల్’ అదిరి పోయే ఆఫర్.. ఇది మళ్ళీ మళ్ళీ రాదు..

విద్యార్థులుకు ‘యాపిల్’ అదిరి పోయే ఆఫర్.. ఇది మళ్ళీ మళ్ళీ రాదు..
Advertisement

Apple Watch: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారతదేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం ఐప్యాడ్‌లు (iPads), మ్యాక్‌బుక్‌లకే (MacBooks) పరిమితమైన యాపిల్ అధికారిక ‘ఎడ్యుకేషన్ సేవింగ్స్’ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు కంపెనీ తన పాపులర్ స్మార్ట్‌వాచ్‌లైన యాపిల్ వాచ్ (Apple Watch) సిరీస్‌కు కూడా వర్తింపజేసింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద అర్హులైన విద్యార్థులు, అధ్యాపకులు తమకు నచ్చిన యాపిల్ వాచ్ మోడల్‌పై గరిష్టంగా రూ. 9,000 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. భారతదేశంలో స్మార్ట్‌వాచ్‌లపై ఈ తరహా అధికారిక ఎడ్యుకేషన్ డిస్కౌంట్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ధరల వివరాలు

యాపిల్ తన లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ లైనప్‌లోని మూడు ప్రధాన మోడళ్లపై ఈ ఎడ్యుకేషన్ డిస్కౌంట్లను అందిస్తోంది.

Advertisement

యాపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3): అత్యంత ప్రీమియం, రగ్గడ్ డిజైన్ మరియు అడ్వాన్స్‌డ్ జీపీఎస్ ఫీచర్లతో వచ్చే ఈ ఫ్లాగ్‌షిప్ వాచ్‌పై యాపిల్ గరిష్టంగా రూ.9,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో దీని అసలు ధర రూ.89,900 నుండి తగ్గి, ఎడ్యుకేషన్ స్టోర్‌లో రూ.80,900 కే లభిస్తోంది.

యాపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11): అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు, స్లిమ్ డిజైన్ మరియు సరికొత్త డిస్‌ప్లేతో వచ్చే ఈ మోడల్‌పై రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. సాధారణ మార్కెట్ ధరతో పోలిస్తే విద్యార్థులు దీనిని రూ.41,900 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

యాపిల్ వాచ్ ఎస్ఈ 3 (Apple Watch SE 3): బడ్జెట్ ధరలో యాపిల్ వాచ్ అనుభూతిని పొందాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఈ మోడల్‌పై రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించారు. దీనివల్ల దీని నెట్ ప్రైస్ రూ.23,900 కి తగ్గింది.

ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?

యాపిల్ సంస్థ ఈ విద్యాసంబంధిత డిస్కౌంట్లను కేవలం పరిమిత వర్గాలకు మాత్రమే అందిస్తుంది విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ప్రస్తుతం చదువుతున్న లేదా కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు. తమ పిల్లల కోసం కొనుగోలు చేయాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు బోధనేతర సిబ్బంది. ఎడ్యుకేషన్ పాలసీ నిబంధనల ప్రకారం, ఒక అకడమిక్ సంవత్సరానికి ఒకరు ఒక యాపిల్ వాచ్‌ను మాత్రమే ఈ రాయితీ ధరపై కొనుగోలు చేయడానికి అర్హులు.

ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ఈ డిస్కౌంట్ ధరల ప్రయోజనాన్ని పొందడానికి కొనుగోలుదారులు తాము విద్యార్థులం లేదా ఉపాధ్యాయులం అని నిరూపించే అధికారిక ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. యాపిల్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టోర్ లేదా యాపిల్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు UNiDAYS ప్లాట్‌ఫారమ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. దీనికోసం కాలేజ్/స్కూల్ ఇచ్చిన ఇన్‌స్టిట్యూషనల్ ఈమెయిల్ ఐడీ లేదా ఐడీ కార్డ్ , అడ్మిషన్ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న యాపిల్ అధికారిక రిటైల్ స్టోర్లను నేరుగా సందర్శించి, ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి కూడా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు తమ రోజువారీ షెడ్యూల్స్ మెయింటైన్ చేయడానికి, ఫిట్‌నెస్ ట్రాక్ చేయడానికి మరియు ఫ్యామిలీ సెటప్ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులతో కనెక్ట్ అయి ఉండటానికి యాపిల్ వాచ్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. కొత్తగా ప్రీమియం స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే విద్యార్థులకు, యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి మారాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×