E-Paper
Advertisement

రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?

రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?
Advertisement

Foldable iPhone Ultra: యాపిల్ సంస్థ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోiPhone 18 Pro సిరీస్‌తో పాటు పాస్‌పోర్ట్ స్టైల్‌లో ఉండే ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను iPhone Ultra పేరుతో లాంచ్ చేయవచ్చని అంచనా. అయితే, తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌ను యాపిల్ అనుకున్న సమయానికే లాంచ్ చేసినప్పటికీ, మార్కెట్లో అమ్మకాలకు రావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

తయారీలో ఎదురవుతున్న సవాళ్లు:

ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో తెలిపిన వివరాల ప్రకారం.. iPhone Ultra తయారీలో యాపిల్ కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈ ఫోల్డబుల్ డిజైన్‌కు సంబంధించిన హింజ్ (మడత పెట్టే భాగం) తయారీని స్థిరీకరించడంలో ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీ కారణంగానే ఫోన్ ఉత్పత్తి ప్రక్రియ కాస్త నెమ్మదించింది. దీనివల్ల ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే ఫోన్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఇక ఇంట్లోనే పబ్ ఫీలింగ్.. రూ.5 వేల లోపు 80W పవర్‌ఫుల్ సౌండ్‌తో బోట్ కొత్త స్పీకర్ లాంచ్!

iPhone X నాటి పరిస్థితులు రిపీట్:

ఈ పరిస్థితి 2017లో వచ్చిన iPhone X లాంచ్‌ను గుర్తు చేస్తోంది. అప్పట్లో సరికొత్త ఓఎల్ఈడీ డిస్‌ప్లే, బెజెల్ లెస్ డిజైన్‌తో వచ్చిన ఐఫోన్ X తయారీలో కూడా యాపిల్ ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంది. దీంతో ఫోన్‌ను అనౌన్స్ చేసినా, మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఐఫోన్ అల్ట్రా విషయంలోనూ అదే రిపీట్ కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కేవలం 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లను మాత్రమే యాపిల్ షిప్ చేయగలదని అంచనా.

అమ్మకాలు ఎప్పుడంటే?

Advertisement

సెప్టెంబర్ నెలలో జరిగే ఈవెంట్‌లో iPhone 18 సిరీస్‌తో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను యాపిల్ ప్రదర్శించినప్పటికీ.. దీని ప్రీ-ఆర్డర్లు, సేల్స్ మాత్రం ఈ ఏడాది చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) వరకు అందుబాటులోకి రాకపోవచ్చు. ఒకవేళ బుకింగ్స్ ప్రారంభమైనా.. ఫోన్ చేతికి అందడానికి కనీసం 4 నుండి 6 వారాల సమయం పట్టవచ్చని సమాచారం.

భారీ ధర ఉన్నా తగ్గని క్రేజ్:

ఈ ఐఫోన్ అల్ట్రా ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.2.20 లక్షల నుండి రూ.2.39 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ధర ఇంత భారీగా ఉన్నప్పటికీ.. యాపిల్ బ్రాండ్ ఇమేజ్, ఫోల్డబుల్ ఫోన్‌పై ఉన్న అంచనాల వల్ల దీనికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×