E-Paper
Advertisement

ఐఫోన్ లవర్స్‌కు షాక్.. రూ.2 లక్షలు దాటనున్న కొత్త iPhone Ultra.. అంత ధర ఎందుకంటే?

ఐఫోన్ లవర్స్‌కు షాక్..  రూ.2 లక్షలు దాటనున్న కొత్త iPhone Ultra.. అంత ధర ఎందుకంటే?
Advertisement

Apple Foldable iPhone: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒక భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఎప్పటినుంచో టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ వినూత్న హ్యాండ్‌సెట్‌ను iPhone Ultra పేరుతో పరిచయం చేయవచ్చని సమాచారం. యాపిల్ చరిత్రలోనే ఇదొక అత్యంత సాహసోపేతమైన డిజైన్ అని చెప్పవచ్చు.

కొత్త సిరీస్‌తో పాటే లాంచ్:

ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను సరికొత్త iPhone 18 Pro సిరీస్‌తో కలిపి లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, సాధారణ iPhone 18 మోడల్ మాత్రం వీటితో పాటు రాకపోవచ్చని తెలుస్తోంది. బడ్జెట్ లేదా ఎంట్రీ లెవెల్ మోడల్‌ను యాపిల్ వచ్చే ఏడాదికి వాయిదా వేసే యోచనలో ఉందట. దీంతో కంపెనీ తమ పూర్తి దృష్టిని అత్యంత ఖరీదైన, ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్‌పైనే కేంద్రీకరించడానికి వీలవుతుంది.

Advertisement

Also Read: పల్లె ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. రూ.259కే నెలంతా హై-స్పీడ్ డేటా, ఉచిత కాల్స్!

దిమ్మతిరిగేలా ఫోన్ ధర:

ఈ ఫోన్ గురించి బయటకు వచ్చిన లీకుల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దీని ధర. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సమాచారం ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర దాదాపు రూ.2,20,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిగతా ఫోల్డబుల్ ఫోన్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ ధర వింటే ఒక హై-ఎండ్ మ్యాక్‌బుక్ ప్రో లాప్‌టాప్ కొనుక్కోవచ్చనే భావన కస్టమర్లలో కలగడం సహజం.

Advertisement

ఫీచర్లు, హార్డ్‌వేర్:

తాజా లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ రెండు డిస్‌ప్లేలతో రానుంది. లోపలి వైపు 7.8 ఇంచుల మెయిన్ ఫోల్డబుల్ ఓఎల్ఈడి స్క్రీన్, బయట పనుల కోసం 5.5 ఇంచుల కవర్ ఓఎల్ఈడి స్క్రీన్ ఉంటాయి. దీనిలో యాపిల్ నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో చిప్‌సెట్‌తో పాటు మల్టీటాస్కింగ్ కోసం 12GB RAM వాడనున్నారు. రెండు స్క్రీన్లకు సరిపోయేలా 5,400 నుండి 5,800mah సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చనున్నారు.

కెమెరా సెటప్ ఎలా ఉందంటే?

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. 48MP మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీల కోసం రెండు స్క్రీన్లపై 18MP ఫ్రంట్ కెమెరాలను కేటాయించనున్నారు. ఇప్పటికే శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీలు ఫోల్డబుల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. కాబట్టి.. యాపిల్ ఇంత భారీ ధరతో వస్తున్నప్పుడు ఖచ్చితంగా అత్యుత్తమ అనుభవాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని కేవలం అంచనాలుగానే చూడాలి.

Also Read: ఇకపై రాత్రిపూట కూడా సూర్యకాంతి.. అమెరికా కొత్త స్పేస్ ప్రాజెక్ట్‌పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×