// // Apple AirPods 2nd Gen Features - భారీ డిస్కౌంట్‌తో.. యాపిల్ ఎయిర్‌పాడ్స్ -->
E-Paper
Advertisement

యాపిల్ ఎయిర్‌పాడ్స్‌‌పై భారీ డిస్కౌంట్.. జస్ట్ రూ.9,999 కే అదిరిపోయే ఫీచర్లు మీ సొంతం!

యాపిల్ ఎయిర్‌పాడ్స్‌‌పై భారీ డిస్కౌంట్.. జస్ట్ రూ.9,999 కే అదిరిపోయే ఫీచర్లు మీ సొంతం!
Advertisement

Apple AirPods 2nd Gen Features: హే గాయ్స్.. మ్యూజిక్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? అది కూడా ‘యాపిల్’ బ్రాండ్ ఇయర్‌ఫోన్స్ అయితే ఆ కిక్కే వేరు. ఇప్పుడు మార్కెట్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ (MV7N2HN/A) కేవలం రూ. 9,999 ధరకే లభిస్తున్నాయి. ఒకప్పుడు వీటి ధర చూసి వెనకడుగు వేసిన వారు కూడా, ఇప్పుడు ఆ మ్యాజికల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ సొంతం చేసుకోవడానికి ఇదే సరైన టైమ్. స్టైలిష్ లుక్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్, మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ఎయిర్‌పాడ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకోసం.

యాపిల్ ఎయిర్‌పాడ్స్ (MV7N2HN/A): రూ. 9,999 బడ్జెట్‌లో టాప్ క్లాస్ ఫీచర్లు!

1. డిజైన్ ,కంఫర్ట్ :
యాపిల్ ఎయిర్‌ పాడ్స్ అంటేనే ఒక క్లాసిక్ ఐకాన్. దీని వైట్ గ్లాసీ ఫినిషింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇవి చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. కాబట్టి గంటల తరబడి మ్యూజిక్ విన్నా లేదా కాల్స్ మాట్లాడినా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. జిమ్ సెషన్స్ లేదా మార్నింగ్ వాక్ వెళ్లే యూత్ కోసం ఇవి బెస్ట్ ఛాయిస్.

Advertisement

2.అదిరిపోయే చిప్ సెట్ ( H1 Chip Performance):
ఈ మోడల్‌లో యాపిల్ తన సొంత H1 Headphone Chip ని ఉపయోగించింది. దీని వల్ల మీ ఐఫోన్ లేదా ఇతర యాపిల్ డివైజ్‌లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. ‘హే సిరి’ అని పిలిస్తే చాలు.. మీ ఫోన్ ముట్టుకోకుండానే.. సాంగ్స్ మార్చవచ్చు లేదా కాల్స్ చేయవచ్చు. లేటెస్ట్ గూగుల్ అప్ డేట్స్ ప్రకారం.. వైర్‌ లెస్ కనెక్టివిటీలో లాగ్ లేకుండా ఉండటం అనేది ఈ మోడల్ ప్లస్ పాయింట్.

3. ఆడియో క్వాలిటీ :
రూ. 9,999 ప్రైస్ పాయింట్ వద్ద వీటి ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. బేస్ మరీ ఎక్కువగా ఉండకుండా.. వాయిస్ క్లారిటీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి లేదా ఆన్‌లైన్ క్లాసులు వినే వారికి ఇందులోని డ్యూయల్ బీమ్-ఫార్మింగ్ మైక్రోఫోన్స్ ద్వారా వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!

4.బ్యాటరీ బ్యాకప్ , ఛార్జింగ్:
యువత ఎక్కువగా చూసేది బ్యాటరీ లైఫ్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఈ ఎయిర్‌పాడ్స్ దాదాపు 5 గంటల లిజనింగ్ టైమ్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే మీకు 24 గంటల పైగా బ్యాటరీ లభిస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల పాటు పాటలు వినొచ్చు. ఇది ట్రావెలింగ్‌ లో ఉన్నప్పుడు చాలా ఉపయోగ పడుతుంది.

ఎందుకు కొనాలి?
నేడు మార్కెట్‌లో చాలా బ్రాండ్స్ అందుబాటులో ఉన్నా.. యాపిల్ ఇచ్చే “బ్రాండ్ వాల్యూ”, “ఎకోసిస్టమ్” వేరు. మీరు ఒక వేళ ఐఫోన్ లేదా మ్యాక్‌ బుక్ వాడుతుంటే.. ఆటో మేటిక్ స్విచ్చింగ్ ఫీచర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. రూ. 9,999 కి లభించే ఈ డీల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×