E-Paper
Advertisement

యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీ లాగే Siri AI కూడా పెయిడ్ సర్వీస్‌గా మారబోతుందా!?

యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీ లాగే Siri AI కూడా పెయిడ్ సర్వీస్‌గా మారబోతుందా!?
Advertisement

Siri Subscription Plan: యాపిల్ ప్రియులకు త్వరలోనే సరికొత్త మార్పు పరిచయం కానుంది. ఇటీవల జరిగిన WWDC 2026 వేడుకల్లో యాపిల్ తమ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటు అప్‌గ్రేడెడ్ సిరి (Siri AI)ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ నెక్ట్స్ జనరేషన్ వర్చువల్ అసిస్టెంట్, చాట్‌జీపీటీ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ అడ్వాన్స్‌డ్ సిరి ఫీచర్లను పూర్తిగా వాడుకోవాలంటే భవిష్యత్తులో డబ్బులు చెల్లించాల్సి రావచ్చని బ్లూమ్‌బర్గ్ ప్రముఖ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ పేర్కొన్నారు.

డబ్బు వసూలు చేసే యోనలో యాపిల్:

తమ వీక్లీ న్యూస్‌లెటర్ ‘పవర్ ఆన్’ ప్రశ్నోత్తరాల విభాగంలో గుర్మన్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం యాపిల్ తమ ఏఐ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో యూజర్లకు నిరూపించే పనిలో ఉందని ఆయన చెప్పారు. రాబోయే ఏడాది కాలంలో ఈ సాంకేతికత మరింత మెరుగవుతుందని, ఆ తర్వాతే అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం యాపిల్ ప్రత్యేక రుసుమును వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Also Read: చూడగానే నచ్చేసే డిజైన్.. 11,000mAh భారీ బ్యాటరీ.. మార్కెట్లోకి వస్తోన్న Honor క్రేజీ ఫోన్ ఇదే!

ఉచిత, పెయిడ్ సర్వీసులు:

ఏఐ ఆధారిత ఫీచర్ల కోసం సర్వర్లను నిర్వహించడం యాపిల్‌కు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే కంపెనీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. పాత సిరి ఫీచర్లు, సాధారణ ఆన్-డివైస్ పర్సనల్ కాంటెక్స్ట్ ఫీచర్లు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. కానీ, మరింత సహజంగా మాట్లాడే చాట్ ఫీచర్లు, జనరేటివ్ ఏఐ సేవలకు మాత్రం పరిమితులు విధించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను తీసుకురావచ్చని గుర్మన్ అంచనా వేస్తున్నారు.

సరికొత్త సిరి సామర్థ్యాలు:

Advertisement

ఈ సరికొత్త సిరి, విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఈ ఏడాది చివర్లో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సిరి మన మెసేజ్‌లు, మెయిల్స్, ఫొటోల వంటి యాప్స్ నుండి డేటాను సేకరించి, మన పనులను సులువుగా పూర్తి చేయగలదు. అలాగే ఒకే ఇంటర్‌ఫేస్ ద్వారా కొత్త సంభాషణలను ప్రారంభించేందుకు లేదా పాత వాటిని కొనసాగించేందుకు ప్రత్యేక సిరి యాప్ కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఐక్లౌడ్ ప్లస్ (iCloud+) యూజర్లకు కొన్ని అదనపు సదుపాయాలు ఇస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో ఏఐ కోసం ప్రత్యేక ప్లాన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Also Read: 512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×