E-Paper
Advertisement

అప్పట్లో ఏసీలు లేవు.. మరి ఇళ్లు చల్లగా ఎలా ఉండేవి? తాతల నాటి టెక్నిక్స్ ఇవే!

అప్పట్లో ఏసీలు లేవు.. మరి ఇళ్లు చల్లగా ఎలా ఉండేవి? తాతల నాటి టెక్నిక్స్ ఇవే!
Advertisement

Traditional Cooling Methods: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఏసీలపై విపరీతంగా ఆధారపడుతుంటారు. ఏసీ గదుల నుంచి అడుగు బయటపెట్టడానికి సైతం ఇష్టపడరు. అయితే పూర్వపు రోజుల్లో ఏసీలు, కూలర్లు వంటివి ఉండేవి కావు. అప్పుడు మన తాతముత్తాతలు ఈ వేడిని ఏ విధంగా తట్టుకున్నారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే ఏసీలు లేని ఆ కాలంలో ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు మన పూర్వీకులు కొన్ని ప్రాచీన పద్దతులను ఉపయోగించేవారని నిపుణులు అంటున్నారు. ఇంతకీ అవి ఏంటి? అవి ఏ విధంగా ఇంటిని చల్లగా ఉంచాయి? వంటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వట్టివేళ్ల పరదాలు

పూర్వం బయటి వేడి ఇంట్లోకి ప్రవేశించకుండా వట్టివేళ్ల పరదాలను ఉపయోగించేవారు. వాటిని కిటికీలు, ఇంటి ద్వారాల వద్ద ఉంచి.. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో నీటితో తడిపేవారు. అప్పుడు బయటి నుంచి వచ్చే వేడిగాలి.. వట్టివేళ్ల పరదాలను తాకి.. చల్లటి ఎయిర్ గా మారిపోయేది. దీంతో గది చల్లగా మారిపోయి.. మంటుడెండలోనూ హాయిగా, అహ్లాదకరంగా ఉండే పరిస్థితులు ఇంట్లో కనిపించేవి.

ఇంటి పైకప్పు టెక్నిక్స్

Advertisement

ఇల్లు హీటెక్కడానికి గల ప్రధాణ కారణాల్లో ఇంటి పైకప్పు వేడెక్కడం ఒకటి. దీనికి చెక్ పెట్టేందుకు మన పూర్వీకుల రెండు విలక్షణమైన పద్దతులను ఉపయోగించేవారు. అప్పట్లో ఇంటి పైకప్పుపై తెల్లటి సున్నం రాసేవారు. సాధారణంగా తెలుపు రంగు అనేది ఉష్ణాన్ని గ్రహించదు. కాబట్టి సున్నం పూయడం ద్వారా ఎండ వేడి ఇంట్లోకి ప్రవేశించకుండా పరావర్తనం చెందుతుంది. ఫలితంగా ఇంటిలోపలి గదులు చల్లగా ఉంటాయి. రెండో పద్దతిలో మన తాతలు ఇంటిమీద గడ్డి చల్లేవారు. దీనివల్ల ఇంటిపైకప్పుపై సూర్య కిరణాలు నేరుగా పడకుండా ఆ గడ్డి అడ్డుకునేది. సాయంత్రం వేళ ఈ గడ్డిపై నీరు చల్లడం ద్వారా.. ఇంటిలోపల ఏసీ లాంటి చల్లదానాన్ని మన పెద్దలు సృష్టించేవారు.

గాలి ప్రసరణ

పూర్వం ఏ ఇంటిని తీసుకున్నా గాలి ప్రసరణకు వీలుగా పెద్ద ఎత్తున కిటికీలు కనిపించేవి. మరి ముఖ్యంగా ఇంటి మధ్యలో పైకప్పు లేకుండా ఉంచి.. గాలి, వెలుతురు పడేలా ఇంటిని డిజైన్ చేసేవారు. ఈ విధానం వల్ల గాలి నిరంతరం ఇంట్లోకి ప్రసరిస్తూ.. ఉండేది. పైగా వేడి గాలి బయటకు పోయేందుకు వీలుగా ఇంటి పైకప్పుకు దగ్గరగా చిమ్నీలు సైతం మన పెద్దలు ఫిక్స్ చేసేవారు. ఇవి తేలిగ్గా ఉండే వేడి గాలిని బయటకు నెట్టేసి.. బరువుగా ఉండే చల్లగాలిని గదిలో అట్టిపెట్టుకునేలా చేసేవి.

కిటికీల చిట్కాలు

Advertisement

ప్రస్తుత వేసవి కాలంలో చాలామంది గాలి కోసం కిటికీలు బారుగా తెరిచి ఉంచుతున్నారు. కానీ మన పూర్వీకులు కిటికీల విషయంలో చాలా తెలివిగా వ్యవహరించేవారు. సూర్యుడి గమనాన్ని బట్టి.. కిటికీలను ఓపెన్ చేయాలా? క్లోజ్ చేయాలా? అని నిర్ణయించేవారు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచేవారు. దీనివల్ల బయటి వేడి గాలులు లోపలికి రాకుండా ఉండేవి. కేవలం సాయంత్రం వేళ ఎండ తగ్గాక మాత్రమే కిటికీలు తెరిచి చల్లని గాలిని ఇంట్లోకి ఆహ్వానించేవారు.

Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!

ఇంటిముందు కల్లాపి చల్లడం

ఒకప్పుడు సాయంత్రం కాగానే మన అమ్మమ్మలు ఇంటి ముందు, లోపల ఉన్న మట్టినేలపై కల్లాపి (నీరు) చల్లేవారు. అప్పుడు ఆ నీరు.. నేలలోని వేడి గాలిని పీల్చేసేవి. దీని వల్ల నేల చల్లబడటమే కాకుండా.. గదిలోని వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారిపోయేది. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇల్లు టైల్స్, నాపరాళ్లతో దర్శనమిస్తున్నాయి. దీనివల్ల కల్లాపి చల్లే ప్రక్రియ పట్టణాలు, నగరాల్లో అంతరించిపోతోంది. గ్రామాల్లో మాత్రం ఈ విధానం కొనసాగుతుండటం విశేషం.

Also Read: జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×