E-Paper
Advertisement

Lionel Messi – Anant Ambani: మెస్సీకి రూ.10 కోట్లు విలువ చేసే వాచ్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ప్రత్యేకతలు ఇవే

Lionel Messi  – Anant Ambani: మెస్సీకి రూ.10 కోట్లు విలువ చేసే వాచ్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ప్రత్యేకతలు ఇవే
Advertisement

Lionel Messi – Anant Ambani: ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మెస్సీ ఇటీవల భారత పర్యటనకు రావడం అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఈ పర్యటనలో గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఉన్న వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని (Vantara Animal Conservation Center) మెస్సీ సందర్శించారు. ఈ సందర్భంగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ మెస్సీకి ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా అనంత్ అంబానీ మెస్సీకి అందించిన ఖరీదైన బహుమతి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

10 కోట్ల కానుక.. అరుదైన రిచర్డ్ మిల్ వాచ్

Advertisement

ప్రపంచంలోనే అత్యంత అరుదైన గడియారాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన రిచర్డ్ మిల్ ఆర్ఎం 003-వి2 జిఎంటి టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్ వాచ్‌ను అనంత్ అంబానీ మెస్సీకి కానుకగా ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వాచ్ ధర సుమారు 1.1 మిలియన్ డాలర్లు. ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం భారత కరెన్సీలో దీని ధర 9,92,43,100 రూపాయలు. అంటే దాదాపు పది కోట్ల రూపాయల విలువైన గడియారం మెస్సీ చేతికి చేరింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గడియారాలు కేవలం 12 మాత్రమే తయారు చేశారు.

అనంత్ అంబానీ చేతిలో 45 కోట్ల వాచ్

Advertisement

ఈ సందర్శన సమయంలో అనంత్ అంబానీ కూడా సుమారు 45 కోట్ల రూపాయల విలువైన రిచర్డ్ మిల్ ఆర్ఎం 056 సఫైర్ టూర్‌బిల్లాన్ వాచ్ ధరించి కనిపించారు. దీంతో అంబానీ కుటుంబానికి లగ్జరీ వాచ్‌లపై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది. రిచర్డ్ మిల్ వాచ్‌లు కేవలం ఖరీదైనవే కాదు, ఇంజనీరింగ్ పరంగా కూడా అద్భుతమైనవిగా గుర్తింపు పొందాయి.

Also Read: Oppo Reno Premium 5G: రూ.8 వేల లోపే ఒప్పో 5జి ఫోన్.. ఇది నిజమైన ఆఫరా లేక సోషల్ మీడియా ప్రచారమా?

ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారీ

ఆర్ఎం 003-వి2 వాచ్‌ను ఏరోస్పేస్ రంగంలో ఉపయోగించే కార్బన్ టిపిటి మెటీరియల్‌తో తయారు చేశారు. ఈ మెటీరియల్ ఫార్ములా 1 రేసింగ్ కార్లలో కూడా వాడుతారు. 38 మిల్లీమీటర్ల సైజ్ కలిగిన ఈ వాచ్‌లో మాన్యువల్ వైండింగ్ టూర్‌బిల్లాన్ మూవ్‌మెంట్ ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ (Earth’s gravitational effect) ప్రభావం వల్ల గడియారాల్లో వచ్చే సెకన్ల స్థాయి తేడాలను టూర్‌బిల్లాన్ టెక్నాలజీ సరిచేస్తుంది. దీంతో సమయాన్ని అత్యంత ఖచ్చితంగా చూపించే సామర్థ్యం ఈ వాచ్‌కు ఉంటుంది.

డ్యూయల్ టైమ్ జోన్.. పవర్ రిజర్వ్ ఫీచర్లు

ఈ గడియారంలో గంటలు, నిమిషాలతో పాటు సెకండ్ టైమ్ జోన్ చూపించే డ్యూయల్ టైమ్ జోన్ ఇండికేటర్ కూడా ఉంది. లగ్జరీ స్పోర్ట్స్ కారును పోలిన డిజైన్‌లో ఫంక్షన్ సెలెక్టర్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వాచ్‌ను వైండింగ్ మోడ్ (స్ప్రింగ్ చార్జింగ్ స్థితి), న్యూట్రల్ మోడ్, హ్యాండ్ సెట్టింగ్ మోడ్‌లలో మార్చుకోవచ్చు. టార్క్ ఇండికేటర్, 70 గంటల పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు దీన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

ప్రపంచ ప్రముఖుల కలెక్షన్‌లో మెస్సీ పేరు

ఈ వాచ్‌ను బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, ఎఫ్1 డ్రైవర్ మిక్ షూమేకర్, ఫెరారీ మాజీ బాస్ జీన్ టాడ్ లాంటి ప్రముఖులకు మాత్రమే ఉండటం విశేషం. అలాంటి అరుదైన గడియారం భారత పర్యటనలో మెస్సీకి దక్కడం క్రీడా అభిమానులకు గర్వకారణంగా మారింది. మెస్సీ స్థాయిని, అంబానీ కుటుంబ వైభవాన్ని ఒకేసారి చూపించిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×