E-Paper
Advertisement

మన ఏసీల వాడకం చూసి తెల్లబోయిన అమెరికా అమ్మడు.. ఇండియాకు, యూఎస్‌కు ఇంత తేడా ఉందా!

మన ఏసీల వాడకం చూసి తెల్లబోయిన అమెరికా అమ్మడు.. ఇండియాకు, యూఎస్‌కు ఇంత తేడా ఉందా!
Advertisement

AC Usage Differences: భారతదేశంలో ఎండలు ముదిరిరాయంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ ఏసీలు ఆన్‌ అవుతాయి. అయితే మనవాళ్లు ఏసీ ఆన్ చేసిన ప్రతిసారీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అనే ఆలోచన కూడా మనసులో మెదులుతూనే ఉంటుంది. ఈ విషయం కొన్నేళ్లుగా ఇండియాలో నివసిస్తున్న అమెరికాకు చెందిన క్రిస్టెన్ ఫిషర్ అనే నలుగురు పిల్లల తల్లిని విపరీతంగా ఆశ్చర్యపరిచింది. భారతీయులు ఏసీలను వాడే విధానానికి, అమెరికన్ల శైలికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని ఆమె ఒక వీడియో ద్వారా పంచుకుంది.

రూమ్ కూలింగ్ Vs హౌస్ కూలింగ్:

క్రిస్టెన్ గమనించిన ప్రధాన తేడా ఏంటంటే.. ఇండియాలో చాలామంది విండో ఏసీలు లేదా స్ప్లిట్ ఏసీలను వాడుతుంటారు. ఇవి కేవలం ఒక గదికి మాత్రమే కూలింగ్ ఇస్తుంది. అందుకే మనవాళ్లు ఏ రూంలో ఉంటే ఆ గదిలోనే ఏసీ ఆన్ చేస్తారు. బయటకు రాగానే వెంటనే ఆపేస్తుంటారు. కానీ అమెరికాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడ ఇళ్లలో సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల ఒక గది మాత్రమే కాదు.. ఇల్లంతా ఒకేసారి చల్లబడుతుంది.

రోజంతా రన్ అయ్యే థర్మోస్టాట్లు:

Advertisement

అమెరికాలో ఇళ్ల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి థర్మోస్టాట్లను ఉపయోగిస్తారని క్రిస్టెన్ చెప్పింది. అక్కడ ప్రజలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సెట్ చేసి, రోజంతా ఏసీని అలాగే వదిలేస్తారు. చివరికి ఇంట్లో ఎవరూ లేకపోయినా, ఆఫీసులకు వెళ్లినా, లేదా ఊర్లకు వెళ్లినా సరే ఏసీలు రన్ అవుతూనే ఉంటాయి. ఇల్లు ఎప్పుడూ ఒకేలా చల్లగా ఉండాలనేది వారి ఉద్దేశం. వాతావరణం ఎలా ఉన్నా ఇళ్లను ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంచడం అక్కడ సర్వసాధారణమైన విషయం.

ఇండియాలోనే ఎక్కువట:

Advertisement

భారత్‌లో కరెంట్ బిల్లుల భయం వల్లే ప్రజలు ఏసీలను చాలా జాగ్రత్తగా, అవసరమైనప్పుడే వాడుతుంటారని క్రిస్టెన్ అభిప్రాయపడింది. అయితే ఇక్కడే ఆమెకు మరో పెద్ద షాక్ తగిలింది. అమెరికాలో అంతలా ఏసీలు వాడినప్పటికీ.. అక్కడ వచ్చే కరెంట్ బిల్లు కంటే.. ప్రస్తుతం ఇండియాలో ఆమె కడుతున్న బిల్లే చాలా ఎక్కువగా ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read: బడ్జెట్ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లు.. మార్కెట్లోకి Xiaomi 400L స్మార్ట్ ఫ్రిడ్జ్.. గంటలోనే ఐస్ రెడీ!

నెటిజన్ల మధ్య మొదలైన వార్:

ఈ వీడియోపై ఇరు దేశాల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయులు ఏసీలను పొదుపుగా వాడటం మంచి అలవాటని, అమెరికన్లు అలా రోజంతా ఏసీలు ఆన్ చేసి ఉంచడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని కొందరు విమర్శించారు. అయితే అమెరికాలో విపరీతమైన మంచు కురవడం, అక్కడ ఇళ్లు చెక్కతో నిర్మించడం వల్ల సెంట్రల్ హీటింగ్, కూలింగ్ వ్యవస్థలు తప్పనిసరని మరికొందరు సమర్థించుకున్నారు. ఏది ఏమైనా మనవాళ్ల పొదుపు సూత్రం ముమ్మాటికీ గొప్పదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×