// // Amazon AC Deals: గోల్డెన్ ఛాన్స్ మావా.. సగం ధరకే బ్రాండెడ్ ACలు! -->
E-Paper
Advertisement

ఏందీ.. ఏసీలపై 65% డిస్కౌంటా? ఈ అమెజాన్ ధమాకా సేల్‌ను మిస్ చేసుకుంటే ఇంకెప్పుడూ కొనలేరు!

ఏందీ.. ఏసీలపై 65% డిస్కౌంటా? ఈ అమెజాన్ ధమాకా సేల్‌ను మిస్ చేసుకుంటే ఇంకెప్పుడూ కొనలేరు!
Advertisement

Amazon AC Deals: ఏప్రిల్ నెల మొదలైందో లేదో.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఇక మధ్యాహ్నం అయితే ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా వేడి గాలి వస్తోంది. ఇలాంటి టైంలో ఏసీ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మీ మనసులో మాట తెలుసుకున్నట్టుగా అమెజాన్ తాజాగా ఏసీలపై క్రేజీ సేల్ తీసుకొచ్చింది. వోల్టాస్, ఎల్‌జీ, డైకిన్ లాంటి టాప్ బ్రాండ్లపై ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లిపోదం రండి..

కరెంటు బిల్లు టెన్షన్ అక్కర్లేదు..

ఏసీ నుంచి వచ్చే చల్లదనం సరే.. కానీ నెల తిరిగేసరికి వచ్చే కరెంటు బిల్లు తలచుకుంటేనే భయమేస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఇన్వర్టర్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్ సేల్‌లో ఇలాంటి పవర్ సేవింగ్ ఏసీలపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇవి గదిని ఇట్టే చల్లబరచడమే కాకుండా.. కరెంటు కూడా చాలా తక్కువగా వాడుకుంటాయి. కాబట్టి బిల్లు గురించి అంతగా భయపడక్కర్లేదు.

స్మార్ట్ ఏసీలతో అంతా ఈజీ..

Advertisement

ఇప్పుడు వస్తున్న ఏసీలు చాలా తెలివైనవి. మీరు ఆఫీసులో ఉన్నప్పుడే మీ ఫోన్ ద్వారా ఇంట్లోని ఏసీని ఆన్ చేసుకోవచ్చు. దీంతో మీరు ఇంటికి వచ్చేసరికి బెడ్ రూమ్ కశ్మీర్‌లా చల్లగా ఉంటుందన్నమాట. ఇక రిమోట్ వెతుక్కునే పని లేకుండా వాయిస్ కమాండ్‌తో కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఎల్‌జీ, పానాసోనిక్ మోడల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి.

Also Read: అపరిచితులకు మీ ఫోన్ నెంబర్ కనిపించకూడదా? అయితే వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

అవసరాన్ని బట్టి ఎంపిక..

Advertisement

మార్కెట్‌లో రకరకాల ఏసీలు ఉన్నప్పటికీ.. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్లు ఎంచుకోవడం ముఖ్యం. ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండి గది పెద్దదైతే హిటాచీ లాంటి ప్రీమియం మోడల్స్ బాగుంటాయి. బడ్జెట్ తక్కువలో మంచి క్వాలిటీ కావాలంటే లాయిడ్, గోద్రెజ్ బ్రాండ్లు బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యంగా ఎల్‌జీ ఏసీల్లో గాలిని శుభ్రం చేసే ఫిల్టర్లు ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఉన్న ఇళ్లకు ఇవి చాలా బాగుంటాయి.

ఆర్థిక భారం పడకుండా..

ఏసీ కొనడం ఇప్పుడు మునుపటిలా కష్టం కాదు. అమెజాన్ ఇస్తున్న నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల వల్ల నెలకు కొంత మొత్తమే చెల్లిస్తూ మీకు నచ్చిన ఏసీని ఇంటికి తీసుకెళ్లొచ్చు. దీనికి తోడు బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఎలాగూ ఉన్నాయి. కొన్న వెంటనే వాళ్లే వచ్చి ఇన్‌స్టాలేషన్ కూడా పూర్తి చేస్తారు. మీ గది చిన్నదైతే 1 టన్, మీడియంగా ఉంటే 1.5 టన్ ఏసీని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: వావ్, ఇది కదా ఆఫర్ అంటే.. ఏసీలపై రూ.20,000 డిస్కౌంట్, రూ.30,000 క్యాష్‌బ్యాక్!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×