E-Paper
Advertisement

షాపింగ్ లవర్స్‌కు పండగే.. జూలైలో అమెజాన్ ప్రైమ్ డే, అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు!

షాపింగ్ లవర్స్‌కు పండగే.. జూలైలో అమెజాన్ ప్రైమ్ డే, అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Amazon Prime Day 2026: ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ వచ్చేస్తోంది! ఈ ఏడాది జూలైలో ఇండియాలో భారీ అమ్మకాలు జరగనున్నాయని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ప్రైమ్ మెంబర్ల కోసం మాత్రమే నిర్వహించే ఈ పదో ఎడిషన్ సేల్‌లో గ్యాడ్జెట్స్, ఫ్యాషన్, కిచెన్ ఐటమ్స్‌పై ఊహించని డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, తక్కువ టైంలో డెలివరీ వంటి మరెన్నో విశేషాలతో ఈసారి ప్రైమ్ డే సందడి చేయనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ఇండియా ప్రతి ఏటా నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సేల్ ‘ప్రైమ్ డే’. ఈ ఏడాది జూలైలో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, జపాన్ దేశాల్లో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే అమెజాన్ ఇండియా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.

Advertisement

ఆఫర్‌లో ఏం దొరుకుతాయ్ ..

ఎలక్ట్రానిక్స్ నుంచి కిచెన్ వరకు అన్నీ ఆఫర్లే!
ఈ సేల్‌లో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. అంతేకాకుండా కిచెన్ అప్లయన్సెస్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ , నిత్యావసర సరుకులపై కూడా ప్రత్యేక డీల్స్ ఉండబోతున్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వంద లాది ప్రొడక్ట్స్ ఈ సేల్ ద్వారానే లాంచ్ కానున్నాయి.

Advertisement

బ్యాంక్ ఆఫర్లు ,క్యాష్‌బ్యాక్:
అమెజాన్ తన కస్టమర్ల కోసం ఎప్పుడూ స్పెషల్ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఈసారి కూడా ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ , డెబిట్ కార్డులపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ముఖ్యంగా Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ వాడే వారికి ప్రతి ప్రొడక్ట్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ తప్పకుండా లభిస్తుంది. అలాగే రూ. 1,399 కంటే ఎక్కువ కొనే వారికి రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది.

మెరుపు వేగంతో డెలివరీ:
1.ఈసారి సేల్‌లో కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు. డెలివరీ విషయంలోనూ అమెజాన్ సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది.

2.దాదాపు 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై Same-Day Delivery సౌకర్యం ఉంటుంది.

3.సుమారు 40 లక్షల ఐటమ్స్‌పై నెక్స్ట్ డే డెలివరీ అందుబాటులో ఉంటుంది.

4.ఎంపిక చేసిన నగరాల్లో కేవలం 4 గంటల్లోనే వస్తువులను ఇంటికి చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

5.ప్రైమ్ మెంబర్లు రూ.99 పైన షాపింగ్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా పొందవచ్చు.

Also Read: జేబీఎల్ నుంచి సోనీ వరకు..రూ.10వేలలోపు అదిరిపోయే సౌండ్‌బార్స్

ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్లు:
నెలవారీ ప్లాన్: రూ.299

త్రైమాసిక ప్లాన్ (3 నెలలు): రూ.599

వార్షిక ప్లాన్ (12 నెలలు): రూ.1,499

ప్రైమ్ లైట్ (వార్షిక): రూ.799

ప్రైమ్ షాపింగ్ ఎడిషన్: రూ.399 (సంవత్సరానికి)

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా లేదా మీ ఇంటికి కావాల్సిన వస్తువులను తక్కువ ధరకు ఆర్డర్ చేయాలనుకున్నా జూలై వరకు వెయిట్ చేయడం ఉండటం మంచిది. అమెజాన్ ప్రైమ్ డే 2026 మీ షాపింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.

Also Read: సామ్‌సంగ్, రెడ్‌మీ,మోటో.. రూ. 15వేలలోపు ఏ బ్రాండ్ ఫోన్ బెస్ట్?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×