E-Paper
Advertisement

అమెజాన్ సమ్మర్ బొనాంజా.. అత్యంత చౌకగా ఏసీలు.. వామ్మో ధరలు ఇలా తగ్గించేశారేంటి!

అమెజాన్ సమ్మర్ బొనాంజా.. అత్యంత చౌకగా ఏసీలు.. వామ్మో ధరలు ఇలా తగ్గించేశారేంటి!
Advertisement

Amazon AC Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ‘మెగా డీల్ డేస్’ సేల్ నడుస్తోంది. సమ్మర్ లో ఏసీలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సేల్ లో వాటిపై క్రేజీ డిస్కౌట్లు ప్రకటించింది. ప్రముఖ కంపెనీ ఏసీలను సగం ధరకే అందిస్తోంది. కొత్తగా ఏసీ కొనాలని భావిస్తున్నవారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని నిపుణులు సైతం చూస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ లో 50 శాతం డిస్కౌంట్ తో లభిస్తున్న టాప్ కంపెనీల ఏసీలు, వాటి ఫీచర్లు, ధర- డిస్కౌంట్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

LG 1.5 Ton 3 Star Split AC

ఎల్జీ కంపెనీకి చెందిన ఈ ఏసీని 53 శాతం డిస్కౌంట్ తో రూ.35,490లకు అమెజాన్ అందిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఏసీ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వచ్చింది. ఇది గదిలోని వేడిని బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. ఇందులోని 6-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్ ను ఉపయోగించి.. మీ అవసరానికి అనుగుణంగా కూలింగ్ కెపాసిటీని మార్చుకోవచ్చు. దీనిలోని వాయు కాలుష్యాన్ని తగ్గించే ‘యాంటీ వైరల్ ప్రొటెక్షన్’ ఫిల్టర్ గాలిని శుభ్రంగా ఉంచుతుంది.

Midea 1.5 Ton 3 Star Split AC

Advertisement

బడ్జెట్ ధరలో లభించే ఈ ఏసీలో 6-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ ఫీచర్ ఉంది. ఇది AI ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉండి.. తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటుంది. గాలిలోని బ్యాక్టీరియా, దుమ్ముదూళిని తొలగించే PM 2.5, HD ఫిల్టర్లు ఈ ఏసీలో ఉన్నాయి. దీని టర్బో మోడ్ ద్వారా గదిని అత్యంత వేగంగా చల్లబరుచుకోవచ్చు. స్మార్ట్ వై-ఫై మోడల్స్, స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ సదుపాయాన్ని కూడా ఈ ఏసీ అందిస్తుంది. అమెజాన్ లో ఈ ఏసీ 48 శాతం రాయితీతో రూ.30,990 లభిస్తోంది.

Samsung 1.5 Ton 3 Star Bespoke AI

శాంసంగ్ కొత్తగా ప్రవేశపెట్టిన Bespoke AI టెక్నాలజీతో ఈ ఏసీ పనిచేస్తుంది. మీ అలవాట్లు, బయటి టెంపరేచర్ ను విశ్లేషించి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా ఈ ఏసీ అడ్జస్ట్ చేస్తుంది. దీనిలోని AI ఎనర్జీ మోడ్ విద్యుత్ వినియోగాన్ని 30% వరకు తగ్గిస్తుంది. ఇది 5-in-1 కన్వర్టిబుల్ మోడ్లతో రూపొందింది. SmartThings యాప్, వాయిస్ కంట్రోల్ ఫీచర్లను ఉపయోగించుకొని.. ఈ ఏసీని ఎక్కడినుంచైనా కంట్రోల్ చేయవచ్చు. అమెజాన్ ఈ ఏసీని 54 శాతం రాయితీతో రూ.36,490కు అందిస్తోంది.

Voltas 183V Vectra CAW 1.5 Ton AC

Advertisement

టాటా బ్రాండ్ వోల్టాస్ ఏసీలు.. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఈ మోడల్ 4-in-1 అడ్జస్టబుల్ మోడ్ ను కలిగి ఉంది. ఇది గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. 52°C అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థవంతంగా ఇది పనిచేయగలదు. ఇది తక్కువ శబ్దంతో పనిచేస్తూ రాత్రిళ్లు హాయిగా నిద్రపోయేందుకు సాయపడుతుంది. అమెజాన్ ఈ వోల్టాస్ ఏసీని 51 శాతం రాయితీతో రూ.30,990 అందిస్తోంది.

Also Read: అధునాతన స్మార్ట్ కూలర్లు.. ఏసీలకు ప్రత్యామ్నాయం కాగలవా? నిపుణులు ఏమంటున్నారు!

Haier 1.5 Ton 4 Star AI AC

ఈ ఏసీ AI క్లైమేట్ కంట్రోల్, 7-in-1 కన్వర్టిబుల్ ఫీచర్లతో రూపొందింది. దీనిలోని ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ గదిని చాలా వేగంగా చల్లబరుస్తుంది. 60 డిగ్రీల విపరీతమైన ఎండలోనూ గదిని సమర్థవంతంగా చల్లబరచగలదు. దీనిలోని ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ ఏసీ లోపల పేరుకుపోయిన ధూళిని క్లీన్ చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఇందులో 4 వే స్వింగ్ ఉండటం వల్ల గది అంతటా సమానంగా కూలింగ్ వ్యాపిస్తుంది. ఈ హైయర్ ఏసీని 52 శాతం డిస్కౌంట్ తో రూ.35,490కు అమెజాన్ లో దక్కించుకోవచ్చు.

Also Read: Fan Cleaning: ఫ్యాన్‌కు బాగా దుమ్ము పట్టిందా? నిచ్చెనతో పనిలేకుండా.. ఇలా ఈజీగా క్లీన్ చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×