E-Paper
Advertisement

OnePlus Pad Lite: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఇంత తగ్గిందా? యాపిల్ వాచ్‌పై కూడా క్రేజీ డీల్!

OnePlus Pad Lite: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఇంత తగ్గిందా? యాపిల్ వాచ్‌పై కూడా క్రేజీ డీల్!
Advertisement

OnePlus Pad Lite: ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్, యాపిల్ వాచ్ se 3 మోడల్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇదే సరైన సమయం. సాధారణంగా యాపిల్ బ్రాండ్ల ధరలు తగ్గడం అనేది చాలా అరుదు. అలాగే వన్‌ప్లస్ ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో మంచి క్రేజ్ ఏర్పడటంతో.. ఇలాంటి డిస్కౌంట్‌లను అందుబాటులోకి తెస్తుంటుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ఆఫర్ వివరాలు..

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ట్యాబ్లెట్ కావాలనుకుంటే వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని అసలు ధర రూ.19,999 కాగా, అమెజాన్ ఇప్పుడు 18% తగ్గింపుతో కేవలం రూ.16,499లకే అందిస్తోంది. అంతేకాదు.. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా మరో రూ.2,000 వరకు అదనంగా డిస్కౌంట్ ఇస్తోంది. అంటే.. రూ.14,500 లోపే ఈ ట్యాబ్లెట్‌ను సొంతం చేసుకోవచ్చన్నమాట.

Advertisement

Also Read: అమెజాన్‌లో శాంసంగ్ S25 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. ఆఫర్ పూర్తి వివరాలు మీ కోసం..

ఇక వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 11 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది. దీంతో వీడియోలు చూడటానికి, చదువుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే.. దీనిలో ఏకంగా 9340mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీంతో 11 గంటల పాటు ప్లేబ్యాక్ పొందొచ్చు. అలాగే ఈ ట్యాబ్‌లో 8GB RAMతో పాటు 128GB మెమరీ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా జరుగుతుంది. పైగా ఇది LTE వెర్షన్ కాబట్టి.. Wi-Fi అవసరం లేకుండానే సిమ్‌కార్డ్ వేసి వాడుకోవచ్చు.

యాపిల్ వాచ్‌‌పై అదిరిపోయే డీల్..

Advertisement

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ వాచ్ వాడాలనేది చాలామంది కల. అలాంటి వారి కోసమే సంస్థ యాపిల్ వాచ్ se 3పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. రూ.28,900 విలువైన ఈ ప్రీమియం వాచ్‌ను ఇప్పుడు రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ డబ్బులు ఒకేసారి కట్టడం ఇబ్బంది అనుకుంటే, నెలకు రూ.914 EMI సదుపాయం కూడా ఉంది. హెల్త్ ట్రాకింగ్, ప్రీమియం లుక్ కోసం ఈ వాచ్‌ను కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్.

ఆఫీస్ పనుల కోసమైనా లేదా స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసుల కోసమైనా ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ చాలా బాగా సెట్ అవుతుంది. యాపిల్ వాచ్ అనేది కేవలం స్టైల్ మాత్రమే కాదు.. మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మాత్రమే. అందుకే స్టాక్ అయిపోకముందే అమెజాన్ యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన గ్యాడ్జెట్‌ను బుక్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బు వృథానే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×