E-Paper
Advertisement

Amazon iPhone 16 Offer : ఐఫోన్ 16 – ఇలా చేస్తే రూ.47వేలకే దక్కించుకోవచ్చు బాస్​!

Amazon iPhone 16 Offer : ఐఫోన్ 16 – ఇలా చేస్తే రూ.47వేలకే దక్కించుకోవచ్చు బాస్​!
Advertisement

Amazon iPhone 16 Offer : యాపిల్​ తన ఐఫోన్ 16 సిరీస్​ను లాంఛ్​ చేసి దాదాపు రెండు నెలలు అయిపోతోంది. ఈ లగ్జరీ అండ్​ సెక్యూరిటీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్​ విడుదల సమయంలో ఐఫోన్​ ప్రియులు దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయినప్పటికీ కొంతమంది ఈ ఫోన్​ను ధర గురించి ఆలోచించి కొనలేకపోయారు. భవిష్యత్​లో డిస్కౌంట్ల రూపంలో తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుగోలు చేసేందుకు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడా సమయం వచ్చేసింది.

ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్​ఫామ్ అమెజాన్​లో అదిరే డిస్కౌంట్ ఆఫర్​ ఇప్పుడు ఐఫోన్ 16 అందుబాటులోకి వచ్చేసింది. సాధారణంగా దీని ఒరిజినల్ ధర రూ.79,999. అయితే బ్యాంక్ ఆఫర్స్​, ఎక్సేంఛ్​ ఆఫర్స్​ ఈ స్మార్ట్ ఫోన్​ను రూ.70 వేల కన్నా తక్కువగా కొనుగోలు చేయొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలంటే? – ప్రస్తుతం అమెజాన్ వెబ్​సైట్​లో ఐఫోన్ 16 రూ. 77,900కు అందుబాటులో ఉంది. అంటే ఒరిజినల్ ధరతో (రూ.79,900) పోలిస్తే రూ.2 వేల రూపాయలను డిస్కౌంట్​ ఇస్తోంది అమెజాన్. ఇదే సమయంలో ఈ ఐఫోన్​ 16 పై మరి కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది అమెజాన్​. బ్యాంక్​ ఆఫర్లను ఇస్తోంది. ఎస్​బీఐ, ఐసీఐసీఐ, అమెజాన్, కొటాక్​ క్రెడిట్ కార్డ్​ల ద్వారా రూ. 5 వేల ఇన్​స్టంట్ డిస్కౌంట్​ ఇస్తోంది. అంటే దీని ద్వారా ఐఫోన్ 16 రూ. 72,900కు దక్కించుకోవచ్చు.

ఇంకా మీ పాత స్మార్ట్ ఫోన్లను ఎక్సేంఛ్​ పై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. దాదాపు రూ. 25,700 వరకు ఎక్సేంఛ్​ను అందిస్తోంది అమెజాన్. అంటే ఈ లెక్కన తక్కువలో తక్కువగా రూ. 47,200కు ఐఫోన్ 16ను దక్కించుకోవచ్చు. అయితే ఎక్సేంఛ్ వ్యాల్యూ ధర ఎక్కువగా రావాలంటే మీ పాత స్మార్ట్ ఫోన్​ బ్రాండ్​, దాని పనితీరు పై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఇలా పలు రకాల ఆఫర్ల ద్వారా అమెజాన్​లో ఐఫోన్ 16 ను రూ. 70 వేల కన్నా తక్కువకే దక్కించుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఈ ఐఫోన్​ 16 ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ డీల్​ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. వీలైనంత త్వరగా అమెజాన్​ సైట్​ ఓపెన్​ చేసి ఐఫోన్ ను కొనేయండి.

Advertisement

ఐఫోన్ 16 ఫీచర్స్​ – ఐఫోన్‌ 16 సిరీస్​లో భాగంగా, ఐఫోన్ 16, ఐఫోన్‌ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌.. అనే నాలుగు మోడళ్లను యాపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) తో మరింత శక్తిమంతంగా ఈ ఐఫోన్ 16 రూపొందాయి. అధునాతన కెమెరా కంట్రోల్‌ ఫీచర్​ తో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్‌ ఏ18 తో ఇవి మార్కెట్​లోకి వచ్చాయి. ఐఫోన్ 16 కెమెరా విషయానికొస్తే విజువల్‌ ఇంటెలిజెన్స్‌ తో మాక్రో ఫొటోలు, స్పేషియల్‌ ఫొటోలు/వీడియోలు తీసుకోవచ్చు. డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి ధ్వనిని తగ్గించొచ్చు. ఐదు రంగుల్లో ఈ ఐఫోన్ 16 అందుబాటులో ఉంది. ఇక ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మెుబైల్స్ లో ఒకటిగా ఐఫోన్ 16 నిలిచింది

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×