E-Paper
Advertisement

Amazon Great Indian Festival Sale 2024 : తగ్గేదేలే… తెగ కొనేస్తున్నారుగా.. ఆ ప్రొడక్ట్స్​కు ఫుల్ డిమాండ్​!

Amazon Great Indian Festival Sale 2024 : తగ్గేదేలే… తెగ కొనేస్తున్నారుగా.. ఆ ప్రొడక్ట్స్​కు ఫుల్ డిమాండ్​!
Advertisement

Amazon Great Indian Festival Sale 2024 : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నుంచి అమెజాన్ వరకు, మింత్రా నుంచి మీషో వరకు పలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు పలు భారీ ఆఫర్లతో ముందుకొస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఈ-కామర్స్ సంస్థల ఫెస్టివల్ సీజన్ సేల్స్​ కొనసాగుతున్నాయి. మిగతా రోజుల్లో కన్నా ఈ ఫెస్టివల్​ సేల్స్​లో తమ విక్రయాలను మరింత పెంచుకునేందుకు బెస్ట్ డిస్కౌంట్​, ఆఫర్స్​తో ఇవి యూజర్స్​ను ఆకర్షిస్తున్నాయి.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం… ఈ ఫెస్టివల్ సేల్స్​ మొదటి మూడు రోజుల్లో అమ్మకాలు వేల కోట్లలో జరిగాయని రిపోర్ట్ బయటకు వచ్చింది. కేవలం 3 రోజుల్లోనే(సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 28) రూ.26,500 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని గణాంకాలు తెలిపాయి. మొత్తం ఫెస్టివల్ సేల్స్​ అమ్మకాల్లో దాదాపు 26 శాతం అమ్మకాలకు ఇది సమానం.

Advertisement

డేటా రిపోర్ట్​ ప్రకారం ఈ అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయాయని తెలిసింది. అవే ఈ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయట. ఇప్పటి వరకు దాదాపు 3.5 నుంచి 4 మిలియన్ యూనిట్స్​ అమ్ముడుపోయాయట. ఎందుకంటే ఈ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించారు. దీంతో జనాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.​ ఇంకా ఈ మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్​, నిత్యావసర గృహోపకరణాల విక్రయాల వాటా 79 శాతంగా ఉందని డాటమ్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది.

ALSO READ : అక్టోబర్లో రానున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ

Advertisement

నో కాస్ట్ ఈఎమ్​ఐలు, ఎక్స్​చేంజ్​ డీల్స్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు, ఈజీ ఈఎమ్​ఐ కారణంగా ఈ అమ్మకాల డిమాండ్ బాగా పెరిగింది. ఇవే వినియోగదారులను ఎక్కువగా కొనుగోలు చేసేలా చేశాయి ఆకర్షిస్తున్నాయి.

సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్, గ్రాసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్​ సేల్స్​ 2 నుంచ 4 రెట్లు పెరిగాయని డేటా పేర్కొంది. ఇంకా స్మార్ట్ టెలివిజన్స్​, మాట్రెసెస్​, వాటర్ ప్యూరిఫైయర్స్​, ల్యాప్​టాప్స్​, ఎయిర్ కండిషనర్స్​, వాటర్ హీటర్స్​, వాషింగ్ మెషీన్స్, ఘీ, డ్రై ఫ్రూట్స్​ కూడా భారీగా అమ్మకాలు జరిగాయట.

దాదాపు 60 శాతం మంది వినియోగదారులు కనీసం రూ.15 వేల కన్నా ఎక్కువ ధర ఉన్నవే కొనుగోలు చేశారట.

కాగా, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో 50 నుంచి 60 శాతం కొనుగోళ్లు మెట్రో నగరాల నుంచే జరుగుతున్నాయని రిపోర్ట్​లో ఉంది. మిగిలిన 40 నుంచి 45 శాతం కొనుగోళ్లు ద్వితీయ శ్రేణి నగరాల నుంచి అవుతున్నాయట. ఏది ఏమైనా ఈ భారీ సేల్స్​ కారణంగా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పండగ చేసుకుంటున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×